OTT Movie : క్రైమ్ థ్రిల్లర్ జానర్ లో వస్తున్న సినిమాలు ఇప్పుడు ఎక్కువగా ట్రెండ్ అవుతున్నాయి. ఈ సినిమాలు ఆడియన్స్ ని ఎక్కువగా ఎంటర్టైన్ చేస్తున్నాయి. ఇంటెన్స్ స్టోరీలతో బుర్రని హీటెక్కిస్తున్నాయి. తమిళ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఒక క్రైమ్ థ్రిల్లర్ సినిమా, మైండ్ ని బెండ్ చేసే ట్విస్టులతో ఆకట్టుకుంటోంది. ఈ సినిమా కార్ డిక్కీలో దాచిన ఒక శవం చుట్టూ తిరుగుతుంది. దీని పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.
‘సత్తం ఎన్ కైయిల్’ (Sattam en kaiyil) 2024లో విడుదలైన తమిళ క్రైమ్ థ్రిల్లర్ సినిమా. చాచి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా 2024 సెప్టెంబర్ 27న థియేటర్లలో రిలీజ్ అయింది. ఇందులో సతీష్ (గౌతం), మైమ్ గోపీ (పోలీస్) ప్రధాన పాత్రల్లో నటించారు. 2 గంటల 4 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమా IMDbలో 7.9/10 రేటింగ్ పొందింది. ప్రస్తుతం Amazon Prime Video లో ఈ సినిమా అందుబాటులో ఉంది.
గౌతం ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి. సాధారణ జీవితం గడుపుతుంటాడు. కానీ ఒక రోజు రాత్రి అతని జీవితం తలకిందులవుతుంది. తాగి కార్ డ్రైవ్ చేస్తూ, మోటార్‌సైకిల్‌పై వచ్చిన ఒక వ్యక్తిని తగిలించి చంపేస్తాడు. భయంతో గౌతం ఆ శవాన్ని తన కార్ డిక్కీలో దాచేస్తాడు. కానీ అదే సమయంలో పోలీస్ చెక్ పాయింట్‌లో, డ్రంక్ డ్రైవింగ్ కేసులో అతన్ని పట్టుకుంటారు. గౌతం కార్‌ని పోలీసులు స్టేషన్‌కి తీసుకెళ్తారు. కానీ డిక్కీలో శవం ఉందని ఎవరూ గమనించరు. ఈ సమయంలో గౌతం టెన్షన్‌లో ఉంటాడు. శవం బయటపడితే అతని జీవితం ముగిసిపోతుంది. ఇప్పుడు ఒక క్రూరమైన పోలీస్ ఆఫీసర్ గౌతం వాలకం చూసి ఎక్కడో అనుమానం వస్తుంది. అయితే ఇంకా శవం గురించి ఎవరికీ తెలిసి ఉండదు.
ఈ కథ స్లోగా స్టార్ట్ అవుతుంది, కానీ టెన్షన్ బిల్డప్ బాగా ఉంటుంది. గౌతం తన కార్‌ని తిరిగి తీసుకోవడానికి, శవాన్ని దాచడానికి ప్లాన్స్ వేస్తాడు. కానీ పోలీస్ స్టేషన్‌లో ఉండే ఇతర క్యారెక్టర్స్, అతన్ని రిస్క్‌లో పెడతారు. పోలీస్ ఆఫీసర్ మైమ్ గోపీ గౌతంని ఎక్కువగా వాచ్ చేస్తాడు. ఏదో తప్పు జరిగిందని అనుమానిస్తాడు. ఈ మధ్యలో శవం గురించి ఒక ట్విస్ట్ వస్తుంది. అది ఎవరిదో, ఎందుకు చనిపోయిందో కొత్త సీక్రెట్స్ బయటపడతాయి. ఒక్కో సీన్‌లో సస్పెన్స్ ఎక్కువవుతుంది. గౌతం మెంటల్‌గా, ఫిజికల్‌గా ఒత్తిడిలో ఉంటాడు. ఇక గౌతం శవాన్ని దాచడానికి ఆఖరి ప్లాన్ వేస్తాడు. కానీ పోలీస్ ఆఫీసర్ తో ఊహించని ట్విస్ట్లు వస్తాయి. చివరికి గౌతం ఈ శవం నుంచి బయట పడతాడా ? పోలీస్ ఆఫీసర్ గౌతం చేసిన పనిని కనిపెడతాడా ? క్లైమాక్స్ ట్విస్ట్లు ఏమిటి ? అనే విషయాలను, ఈ సినిమాను చూసి తెలుసుకోండి.
Read Also : అందం కోసం అరాచకం… మనిషి మాంసాన్ని మటన్ లా తినే ఊరు… మెంటలెక్కించే సస్పెన్స్ థ్రిల్లర్