Drugs Case:ఇండస్ట్రీలో డ్రగ్స్ వ్యవహారం ఏ రేంజ్ లో కలకలం రేపుతోందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే ఈ డ్రగ్స్ వాడకంపై పోలీసులు పంజా విసిరినా.. ఇంకా కొన్ని చోట్ల మాత్రం ఈ దందా జరుగుతూనే ఉంది. ముఖ్యంగా సెలబ్రిటీలుగా పేరు తెచ్చుకున్న వారే ఈ డ్రగ్స్ కేసులో ప్రథమంగా ఉండడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది అని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే ఇప్పుడు డ్రగ్స్ సరఫరా చేస్తూ ఒక ప్రముఖ బాలీవుడ్ నటుడు పట్టుబడ్డాడు. ఏకంగా 35 కోట్ల విలువ చేసే డ్రగ్స్ తీసుకెళ్తూ అధికారుల చేతికి చిక్కి అరెస్టయ్యారు.. దీంతో ఈ ఘటన ఎక్కడ జరిగింది? ఆయన ఎవరు? అనే పూర్తి వివరాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
ఆయన ఎవరో కాదు బాలీవుడ్ లో మంచి సూపర్ హిట్ అందుకున్న ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’ మూవీ నటుడు. ఈ సినిమాతో మంచి పేరు దక్కించుకున్నారు. ఇందులో సపోర్టింగ్ రోల్ చేసి.. ఆ తర్వాత వరుస అవకాశాలు కూడా అందుకున్నారు. అలాంటి ఈయన ఆదివారం ఉదయం సింగపూర్ నుంచి వస్తూ ఉండగా.. చెన్నై విమానాశ్రయంలో కాస్త అనుమానంగా కనిపించారట.. దీంతో అనుమానం వచ్చి చెన్నై కస్టమ్స్ ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్ , డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు ఆయన బ్యాగ్ చెక్ చేయగా ఒక తెల్లటి పదార్థం దొరికిందట. వెంటనే టెస్ట్ లు చేయగా అది కొకైన్ అని నిర్ధారించారు. కాంబోడియా లోని తెలియని వ్యక్తుల నుంచి ఈ బ్యాగ్ వచ్చిందని చెప్పినా.. ముంబై, ఢిల్లీ వంటి ప్రదేశాలకు ఈ కొకైన్ సరఫరా చేసే అవకాశాలు ఉన్నాయని అధికారులు భావిస్తున్నారు.
ఏకంగా 35 కోట్ల విలువ చేసే కొకైన్ సరఫరా
ఇకపోతే అలా చిక్కిన కొకైన్ 3.5 కిలోలు ఉందని, దీని ఇంటర్నేషనల్ మార్కెట్ విలువ ప్రకారం రూ..35 కోట్లు ఉంటుందని సమాచారం. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది..ఇకపోతే సహాయ నటుడు అని చెప్పిన అధికారులు అతడి పేరు మాత్రం బయట పెట్టకపోవడం గమనార్హం. ఇకపోతే పట్టుబడిన తర్వాత ఆ నటుడు తాను గుర్తు తెలియని వ్యక్తుల నుండి కంబోడియాలో ఈ ప్యాకెట్ అందుకున్నానని అందులో ఏముందో తనకు తెలియదని చెప్పినప్పటికీ.. దానిని ట్రాలీలో దాచిపెట్టి చెన్నై విమాశ్రయంలో ఎవరికైనా అందించాలనే ఆలోచన చేసినట్లు అధికారులు గుర్తించారు.
నటుడి చరిత్రను పరిశీలిస్తున్న అధికారులు..
ఈ మాదక ద్రవ్యాలను ముంబై లేదా ఢిల్లీ వంటి ప్రధాన నగరాలలో పంపిణీ చేయడానికి ఉద్దేశించినవిగా అధికారులు అనుమానిస్తున్నారు. ఇక్కడ మాదకద్రవ్యాల సిండికేట్ లు పనిచేస్తాయని, అరెస్ట్ అయిన నటుడి చరిత్రను కూడా అధికారులు పరిశీలిస్తున్నారు. త్వరలోనే ఆ నటుడు పూర్తి వివరాలు కూడా బయటపెడతామని అధికారులు స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈయనను విచారణకు తరలిస్తున్నట్లు సమాచారం.