Gundeninda GudiGantalu Today episode October 1st : నిన్నటి ఎపిసోడ్ లో.. రోహిణి తన తల్లితో మీరు ఎందుకు ఇక్కడికి వచ్చారని సీరియస్ గా మాట్లాడుతుంది. దానికి సుగుణమ్మ కూడా నీ కొడుకు అని నువ్వు చెప్పుకోలేని స్థితిలో ఉన్నావు అదేనా నువ్వు చేసే పని అని సీరియస్ అవుతుంది. నా పరిస్థితిని అర్థం చేసుకో అమ్మ నా కాపురం కూలిపోతుంది నువ్వు ఇక్కడే ఉంటే అని బ్రతిమలాడుతుంది రోహిణి. అప్పుడే చింటూ కిందకు వస్తాడు. పడిపోతుంటే రోహిణి పట్టుకొని నేను మీ అత్తను కాదురా అమ్మని అని దగ్గరకు తీసుకుంటుంది. నువ్వు మా అమ్మవని మా ఫ్రెండ్స్ అందరికీ చెప్పమ్మా అని చింటూ అడుగుతాడు. నేను మీ అమ్మని ఎక్కడ చెప్పద్దు రా అని మాట తీసుకుంటుంది. వాళ్ళని ఇంట్లో నుంచి పంపించాలనుకున్న టైంలో బాలు మీనా వచ్చేస్తారు అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. మీనా, బాలు చింటూను జాగ్రత్తగా చూసుకుంటారు. అప్పుడే రవి శృతి వస్తారు. మీరు వాళ్ళ అత్తకి కాల్ చేయండి అని మీనా చెప్తుంది. ఈ టైంలో తన దగ్గర తన ఫోను ఉండదు అమ్మ మళ్లీ చేసినప్పుడు నీ చేత మాట్లాడిస్తాను అని సుగుణమ్మ అంటుంది. రవి కావాలని రోహిణి పాలను కింద వేయడం చూసి షాక్ అవుతాడు.. రోహిణి పాలు చేజారి కింద పడిపోయాయని అంటుంది. మీనా నేను క్లీన్ చేస్తానని చెప్పి లోపలికి వెళ్తుంది. రవి శృతి లోపలికి వెళ్ళగానే రవి అసలు నిజాన్ని శృతికి చెప్తాడు.
ఆ మాట వినగానే శృతి కిందకు వచ్చి రోహిణిని అడుగుతుంది. నువ్వు కావాలనే పాలను కింద వేయడం రవి చూశాడు మీరు రూమ్ కోసం ఇబ్బంది పడుతున్నారా అయితే ఈ విషయాన్ని చెప్పొచ్చు కదా అని శృతి అడుగుతుంది. కానీ రోహిణి మాత్రం అదేమీ లేదు అంత ఇబ్బంది అయితే నేను చెప్తాలే అనేసి అంటుంది. ఇక ప్రభావతి సత్యం ఇంటికి వస్తారు. ప్రభావతి ఇంట్లోకి రాగానే చింటూ ని చూసి నా సీట్లో కూర్చున్నావ్ ఏంట్రా అని రచ్చ రచ్చ చేస్తుంది. కుర్చీలోనే కదా కూర్చుంది ఆ కుర్చీలో నేను రోజు కూర్చుంటున్నావా? కొంచెం మానవత్వం మర్యాద ఉండాలి అని ప్రభావతికి బాలు క్లాస్ పీకుతాడు.
అప్పుడే ఇంట్లోకి మనోజ్ కూడా వస్తాడు. ఇవాళ కూడా కిందే పడుకోవాలా అని అనుకుంటాడు. ఇచ్చిన మీ ఆవిడని ఆ విషయం గురించి అడుగు అని ప్రభావతి అంటుంది. ఒక్క రోజే కదా ఏమవుతుంది ఎందుకు ఇంత రచ్చ చేస్తున్నారు అని బాలు అంటాడు. పసి పిల్లాడే కదా ఎందుకు ఇంత రచ్చ చేస్తున్నారని మీనా కూడా అంటుంది. బామ్మ దగ్గర పెరిగిన వాళ్ళందరూ ఇలానే ఉంటారు అని అనగానే బాలు కోపంతో రెచ్చిపోతాడు. మీ దగ్గర పెరిగిన వాళ్ళందరూ మర్యాదగా ఉన్నారా? ఒకడేమో లక్షలు మింగాడు.. మరొకడెమో లక్షలు మింగాడు అని బాలు అంటాడు.
ఏంటండీ మీరు కూడా ఆ చింటూని పైకి తీసుకురండి అని మీనా అంటుంది. ఇక రాత్రి అవగానే మనోజు పిల్లలు కనాలని అనుకుంటున్నావు కదా అని సరదాగా మాట్లాడతాడు కానీ రోహిణి మాత్రం సీరియస్ గానే ఉంటుంది. ఇక ఉదయం అవ్వగానే చింటూ దగ్గరికి వెళ్లిన రోహిణి అమ్మ అని గట్టిగా పిలవద్దు అని అంటుంది. కట్లు విప్పేటప్పుడు నా దగ్గర ఉండాలమ్మా అని రోహిణి తో చింటూ అంటాడు. సరే అని రోహిణి మాట ఇస్తుంది.
ప్రభావతి వాళ్ళని ఇంకా ఇంట్లోంచి పంపించలేదని అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే రోహిణి రావడం చూసిన ప్రభావతి ఆ సంత వెళ్ళిపోతున్నారా లేదా అని అడుగుతుంది. వెళ్ళిపోతున్నారు అత్తయ్య అని రోహిణి అంటుంది. అప్పుడు అక్కడికి వచ్చిన రోహిణి వాళ్ళ అమ్మ మేము వెళ్లిపోతున్నాం అమ్మ అని అనగానే వెళ్ళండి మళ్లీ రాకండి ఇదే లాస్ట్ టైం అవ్వాలి అని ప్రభావతి అంటుంది. నేనేమీ మటము సత్రం నడపడం లేదు అని ప్రభావతి అనగానే మీనా అంత దారుణంగా ఎలా మాట్లాడుతున్నారు అత్తయ్య అని అంటుంది.
Also Read : శ్రీవల్లికి దిమ్మతిరిగే షాక్.. ప్రేమ పై సీరియస్.. కోడళ్ల మధ్య ఫైట్..
వాళ్ళ అమ్మ ఎవరో కూడా తెలియదు అసలు ఉందో లేదో కూడా తెలియదు అని ప్రభావతి దారుణంగా మాట్లాడటం విన్న రోహిణి ఆ వాళ్ళ అమ్మ ఎవరో కూడా తెలియదు అసలు ఉందో లేదో కూడా తెలియదు.. చచ్చిందో లేక ఎవరితో అయినా వెళ్లిపోయిందో అని ప్రభావతి అనడం విన్నరోహిని కోపంతో ఆపండి అత్తయ్య అని గట్టిగా అరుస్తుంది. చిన్నపిల్లలు ముందు ఏం మాట్లాడుతున్నారో తెలియడం లేదా మీకు అని అరుస్తుంది. ఆ తర్వాత అందుకేనా మమ్మల్ని ఇంట్లోంచి బయటికి పంపించి వీళ్ళని ఇంట్లోంచి బయటికి పంపిస్తానని అన్నావ్ అని ప్రభావతి నిజాన్ని బయటపెడుతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..