Illu Illalu Pillalu Today Episode October 1st: నిన్నటి ఎపిసోడ్ లో.. చందు ఇచ్చిన లక్ష రూపాయలు డబ్బుని నాన్నకు తెలియకుండా ఎలాగైనా సరే అకౌంట్ లో వేయాలి చాలా ప్రయత్నాలు చేస్తాడు. ఆ డబ్బులు నీ అకౌంట్లో వేసి గూగుల్ పే ద్వారా ట్రాన్స్ఫర్ చేయాలని అనుకుంటాడు. కానీ బ్యాంకుకు వెళితే అక్కడ టైం అయిపోయింది ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. అయితే మీకంతా అర్జెంట్ అయితే వెళ్లి డబ్బులు మిషన్లో డిపాజిట్ చేసుకోండి అని అతను సలహా ఇస్తాడు. ధీరజ్ మాత్రం రేపైనా కచ్చితంగా నాన్న అకౌంట్లో డబ్బులు వేయాలి అని అనుకోని బయటకు వస్తాడు.. బ్యాంక్ బయట ఉన్న ప్రేమ ఆ డబ్బులు ఎక్కడిది అని అడుగుతుంది. ఏ డబ్బులు గురించి మాట్లాడుతున్నావు అని ధీరజ్ కావాలని అడుగుతాడు. బండిలో ఉన్న డబ్బులను తీసి ప్రేమ ఈ లక్ష రూపాయలు డబ్బులు నీకు ఎక్కడివి రా అని నిలదీస్తుంది.. అప్పటికే రామరాజుకు డబ్బుల విషయం తెలిసిపోతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. రాత్రి అవ్వగానే రామరాజు తో పాటు మిగిలిన వాళ్ళందరూ కూడా ధీరజ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. శ్రీవల్లి మాత్రం చాలా సంతోషంగా ఈరోజు ఇంట్లోంచి వెళ్లిపోతాడు అని చాలా సంతోషంగా ఉంటుంది. రామరాజు ధీరజ్ పై సీరియస్ గా ఉంటాడు. ధీరజ్ ప్రేమ ఏమైందని ఆలోచిస్తూ ఉంటారు. ఇక ధీరజ్ ఏమైంది నాన్న అర్జెంటుగా రమ్మని పిలిచారు అని అడుగుతాడు ధీరజ్.. రామరాజు నా అకౌంట్లో నుంచి డబ్బులు నువ్వు ఎందుకు తీసుకున్నావు రా అని అడుగుతాడు. అడుగుతుంటే సమాధానం చెప్పవ్ ఏంట్రా నా ఫోన్ నుంచి లక్ష రూపాయలు దొంగ చాటుగా నీ ఫోన్ కి ఎందుకు ట్రాన్స్ఫర్ చేసుకున్నావు రా అని రామరాజు అడుగుతాడు. లేని ప్రేమలో నటించి డబ్బులు కొట్టేస్తావా అని రామరాజు నిలదీస్తాడు.
ధీరజ్ మాత్రం ఏమీ సమాధానం చెప్పలేక గిలగిలా కొట్టుకుంటాడు. ఇక శ్రీవల్లి ఎందుకంటే ధీరజ్ ఎలా చెప్తాడు మామయ్య గారు అండి ప్రేమ కోసమే ఈ డబ్బులను కొట్టేసి ఉంటాడు అని శ్రీవల్లి అంటుంది. ధీరజ్ ను కాపాడాలని ప్రేమ రామ రాజుకి అడ్డుపడుతుంది. అది చూసిన శ్రీవల్లి మావయ్య గారికి నువ్వు అడ్డు చెప్తావా? మావయ్య గారిని నువ్వు ఎదిరిస్తావా? ఎంత ధైర్యం ఉంటే మావయ్య గారిని చేయి పట్టుకుంటావా? ఇంట్లో వాళ్ళందరూ ముందర మావయ్య గారిని అవమానించినట్లే అని శ్రీవల్లి ఏదేదో మాట్లాడడం చూసి ప్రేమ నువ్వు ఆపక్క అని గట్టిగా అరుస్తుంది.
ధీరజ్ డబ్బులు తీసుకోవడం అన్నమాట నిజమే.. అయితే ఆ డబ్బులు తీసుకొని మా జల్సాల కోసము మా ఆయన జల్సాల కోసం కాదు చందు బావగారికి కావాలంటే ఇచ్చాడు అని ప్రేమ అసలు నిజాన్ని బయటపెడుతుంది. ఆ మాట విన్న రామరాజు తో పాటు ఇంట్లోనే వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇక చందు ని రామరాజు పిలుస్తాడు. శ్రీవల్లి ఆయన ఇంకా ఇంటికి రాలేదంటే ఫోన్ చేసి అర్జెంటుగా ఇంటికి రమ్మని పిలుస్తాడు.
చందు ఇంటికి రాదని రామరాజు నిజాన్ని బయటపెడతాడు. వీడు లక్ష రూపాయలు ఇచ్చాడా లేదా అని అడుగుతాడు. ఆ డబ్బులు నాకు చిన్నోడు ఇచ్చాడు నాన్న అని ఒప్పుకుంటాడు చందు. నీకు తెలియకుండా నేను ఒక పెద్ద తప్పు చేశాను నాన్న క్షమించరాని నిజం దాచాను అని చందు అంటాడు. వల్లి వాళ్ళ అమ్మ నాన్నకి మీకు తెలియకుండా డబ్బులు ఇచ్చాను నాన్నగారు అని చందు అసలు నిజాన్ని బయటపెడతాడు. వాళ్లకి నువ్వు ఎందుకు ఇచ్చావు రా అంటే వల్లి చెప్పద్దని అడ్డుపడుతుంది.
ఇక వల్లి అడ్డంగా ఇరుక్కుపోయానని తెలిసి కావాలని నాటకాన్ని మొదలు పెడుతుంది. అటు నర్మదా ప్రేమ ఇద్దరు కూడా వల్లిని ఒక ఆట ఆడుకుంటారు. అసలు లక్ష రూపాయలు వేసి నీకు తెలిసి కూడా ధీరజ్ని కొడుతుంటే నువ్వెందుకు నిజం చెప్పలేదు అని నర్మద కూడా శ్రీవల్లిని కడిగి పడేస్తుంది. ఇక వీళ్ళ గొడవ విన్న రామరాజు ముగ్గురిని బయటకు వెళ్ళమని అంటాడు. చెబుతుంది మీకే కదా వెళ్ళండి ఇకనుంచి అని గట్టిగా అరుస్తాడు..
Also Read: బుధవారం టీవీల్లోకి బోలెడు సినిమాలు.. ఆ రెండు మస్ట్ వాచ్…
ఇక ముగ్గురు అన్నదమ్ములు కూడా ఒకరినొకరు అర్థం చేసుకుని మళ్లీ కలిసిపోయి సంతోషంగా ఉంటారు.. మీ భార్యలను చూస్తే ఇంత వైలెంట్ గా ఉన్నారు. మీరు మాత్రం అన్నదమ్ముల అనుబంధమే మాకు ముఖ్యమంటూ ఇలా కలిసిపోయారు అని తిరుపతి టెన్షన్ పడుతూ ఉంటారు. ఇక రామరాజు వేదవతి పై సీరియస్ అవుతాడు. కోడల్ని కంట్రోల్లో పెట్టుకుని అత్తగా నువ్వు మిగిలిపోయావు బుజ్జమ్మ అంటూ అరుస్తాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..