E-Paper
Advertisement

IND-W vs SA-W First ODI Highlights: స్మృతి మంథాన సెంచరీ.. దక్షిణాఫ్రికా ఘోర ఓటమి

IND-W vs SA-W First ODI Highlights: స్మృతి మంథాన సెంచరీ.. దక్షిణాఫ్రికా ఘోర ఓటమి
Advertisement

IND Women vs SA Women First ODI Highlights: టీ 20 ప్రపంచకప్ మ్యాచ్ లు ఒకవైపు హోరెత్తిపోతున్నాయి. ప్రపంచంలోని క్రికెట్ అభిమానుల దృష్టి అంతా అటువైపు ఉంటే, భారత అమ్మాయిలు అద్భుతంగా ఆడి మ్యాచ్ గెలవడమే కాదు, దక్షిణాఫ్రికాను చిత్తుచిత్తుగా ఓడించారు.

బెంగళూరులోని చిన్నస్వామి స్డేడియింలో దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో భారత్ 143 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. అంతేకాదు మూడు వన్డేల సిరీస్ లో భాగంగా ఆధిక్యంలోకి వెళ్లింది.  టాస్ గెలిచిన భారత్ మొదట బ్యాటింగ్ చేసి స్మృతి మంథాన సెంచరీ తో 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 26s పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో దక్షిణాఫ్రికా 37.4 ఓవర్లలో 122 పరుగులకి ఆలౌట్ అయ్యి పరాజయం పాలైంది.

Advertisement

266 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన దక్షిణాప్రికా అమ్మాయిలకు మంచి ప్రారంభాలు దొరకలేదు. ఓపెనర్ల దగ్గర నుంచి ఫస్ట్ డౌన్ వరకు టపటపా వికెట్లు పడిపోయాయి. ఓపెనర్ కెప్టెన్ లౌరా (4), మరో ఓపెనర్ తజ్మిన్ (18), అన్నెకే బోష్ (5) త్వరత్వరగా అయిపోయారు.

తర్వాత వచ్చిన సునె ల్యూస్ (33), మేరిజన్నె (24), సినాలో జఫ్తా (27) మాత్రమే కాసేపు పోరాడారు. మిగిలినవాళ్లు చేతులెత్తేశారు. దీంతో 37.4 ఓవర్లలో దక్షిణాఫ్రికా ఆలౌట్ అయిపోయింది.

Advertisement

భారత్ అమ్మాయిలు బౌలింగులో రేణుకా సింగ్ 1, పూజా వస్త్రాకర్ 1, దీప్తీ శర్మ 2, రాధా యాదవ్ 1, ఆశా శోభన 4 వికెట్లు పడగొట్టారు.

Also Read: విరాట్ ఫామ్ గురించి ఆందోళన అవసరం అక్కర్లే.. టీమిండియా బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్..

అంతకుముందు బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ కి ఆదిలోనే దెబ్బ తగిలింది. షఫాలీ వర్మ (7) వెంటనే అవుట్ అయ్యింది. మరో ఓపెనర్ స్మృతి అద్భుతంగా ఆడి సెంచరీ చేసింది. 127 బాల్స్ ఎదుర్కొని 1 సిక్స్, 12 ఫోర్ల సాయంతో 117 పరుగులు చేసింది. అనంతరం హేమలత (12), కెప్టెన్ హర్మాన్ ప్రీత్ (10), జెమిమా (17), దీప్తీ శర్మ (37), పూజా వస్త్రాకర్ (31 నాటౌట్) చకచకా పరుగులు తీయడంతో 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 265 పరుగులు చేసింది.

సౌతాఫ్రికా బౌలింగులో అయబొంగా ఖాకా 3, మసబాటా క్లాస్ 2, అన్నీరై 1, మ్లాబా 1, షంగేశ్ 1 వికెట్ పడగొట్టారు

Tags

Related News

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

రోహిత్ శ‌ర్మ‌, కోహ్లీ ఇద్ద‌రూ టీమిండియాకు హార్ట్ బీట్ లాంటోళ్లు..వాళ్ల‌ను ట‌చ్ చేయెద్దు

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 ఫైన‌ల్ మ్యాచ్ టైమింగ్స్ ఇవే..ఇండియాలో లైవ్ ఎప్పుడంటే ?

రెండు మ్యాచ్ ల‌కే గాయ‌ప‌డ్డ బుమ్రాతో వ‌ర‌ల్డ్ క‌ప్ గెలుస్తారా? గ‌వాస్క‌ర్ సీరియ‌స్‌

Big Stories

Advertisement
×