BigTV English

Today Horoscope in Telugu: నేటి రాశిఫలాలు (01/10/2025)                 

Today Horoscope in Telugu: నేటి రాశిఫలాలు (01/10/2025)                 

Today Horoscope: ప్రముఖ జ్యోతిర్వాస్తు, వేద పండితులు, దేవీ ఉపాసకులు  ‘బ్రహ్మశ్రీ  రామడుగు శ్రీకాంత్‌ ఆచార్య’ గారిచే గ్రహాల సంచారం ప్రకారం అంచనా వేసిన అక్టోబర్‌ 30వ తేదీ రాశి ఫలితాలను ఇప్పుడు తెలుసుకుందాం.


మేష రాశి:  

చేపట్టిన పనులు సకాలంలో  పూర్తిచేస్తారు. సమాజంలో ప్రముఖులతో చర్చలకు అనుకూలమైన రోజు ఇది. వృత్తి వ్యాపారాలలో తీసుకున్న నిర్ణయాలు అనుకూలంగా సాగుతాయి.  ఆలోచనలు అనుకూలంగా సాగుతాయి. భూ సంభందిత క్రయ విక్రయాలు లాభిస్తాయి. ఉద్యోగస్తులు సమస్యలు  అధిగమిస్తారు.

వృషభ రాశి:

ఆకస్మిక ధన వ్యయ సూచనలు ఉన్నవి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. ప్రయాణాలలో ఆకస్మిక మార్పులు తప్పవు. ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ద అవసరం. వృత్తి, ఉద్యోగాలు అంతగా రాణించవు. వ్యాపారమున కీలక సమయంలో నిర్ణయాలు తీసుకోలేరు.


మిథున రాశి:  

నిరుద్యోగులకు నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. ఉద్యోగస్తులకు గందరగోళ పరిస్థితులు  ఉంటాయి. ఆర్థిక ఇబ్బందులు బాధిస్తాయి. దీర్ఘ కాలిక రుణ ఒత్తిడి అధికమవుతుంది. కుటుంబ బాధ్యతలు మరింత చికాకు పరుస్తాయి. బంధుమిత్రులతో చిన్నపాటి వివాదాలు తప్పవు.  దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు.

కర్కాటక రాశి:

సమాజంలో ప్రముఖులతో పరిచయాలు  లాభిస్తాయి. కుటుంబ సభ్యుల  ఆదరణ పెరుగుతుంది. బంధు మిత్రుల సమాగమం ఆనందం కలిగిస్తుంది. ముఖ్యమైన పనులలో  అవరోధాలు కలిగిన అధిగమించి ముందుకు సాగుతారు. ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. ఉద్యోగస్తులు ఆలోచించి ముందుకు సాగడం మంచిది.

సింహరాశి:

చిన్న నాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాలు విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. కీలక సమయంలో బంధు మిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. సేవా  కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలలో పరిస్థితులు అనుకూలంగా మారుతాయి.  ఉద్యోగాలలో అనుకూలత పెరుగుతుంది.

కన్యారాశి :

చేపట్టిన వ్యవహారాలు అనుకూలంగా  సాగుతాయి. వ్యాపారానికి పెట్టుబడులు అందుతాయి. దీర్ఘ కాలిక రుణబాధలు తొలగుతాయి. నిరుద్యోగులకు నూతన ఉద్యోగావకాశాలు లభిస్తాయి. కుటుంబమున అవసరానికి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగాలలో అధికారుల అనుగ్రహం కలుగుతుంది.

ALSO READ: ఈ రాశుల్లో జన్మించిన వారు ఎప్పటికైనా కోట్లు సంపాదిస్తారట

 

తులారాశి:

ముఖ్యమైన వ్యవహారాలు వాయిదా వేయడం మంచిది. రుణ దాతల నుండి ఒత్తిడి పెరుగుతుంది. మానసిక సమస్యలు చికాకు పరుస్తాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో   జాగ్రత్త వహించాలి. వ్యాపార, ఉద్యోగాలలో ఊహించని సమస్యలు ఎదురవుతాయి.

వృశ్చికరాశి:

వ్యాపారాలలో ఇబ్బందులు ఎదురైనా అధిగమించి లాభాలు అందుకుంటారు. ఉద్యోగమున ధైర్యముగా నిర్ణయాలు చేస్తారు. చేపట్టిన పనులు శ్రమాధిక్యతతో కానీ పూర్తి కావు. ఆత్మ విశ్వాసంతో వివాదాల నుంచి బయటపడతారు. దూరప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. ఆదాయం బాగుంటుంది.

ధనస్సు రాశి:

ఆర్థిక పరంగా ఇబ్బందులు మరింత బాధిస్తాయి. వృత్తివ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఇతరుల వ్యవహారాలలో తలదూర్చడం మంచిది కాదు. మీ ఆలోచనలు కుటుంబ సభ్యులకు నచ్చే విధంగా ఉండవు. చేపట్టిన పనులు మధ్యలో నిలిపివేస్తారు. ఉద్యోగ వాతావరణం సమస్యాత్మకంగా ఉంటుంది.

మకరరాశి:

ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో విశేషంగా పాల్గొంటారు.  ఉద్యోగమున వివాదాలు పరిష్కరించుకుంటారు. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. దాయాదులతో భూ సంభందిత వివాదాలు కొలిక్కి వస్తాయి. బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి.  వృత్తి వ్యాపారాలు తన ప్రయత్నాలు ఫలిస్తాయి.

కుంభరాశి:

వ్యాపారములో భాగస్తులతో చిన్నపాటి వివాదాలతో తప్పవు. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. చేపట్టిన పనులు నత్త నడక సాగుతాయి. తగినంత ఆదాయం  లభించదు. వృధా ఖర్చులు విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. ఉద్యోగమున అధికారులతో వివాదాలు కలిగే సూచనలున్నవి.

మీనరాశి:

వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు అనుకూల ఫలితాలను ఇస్తాయి. అనారోగ్య ఉపశమనం లభిస్తుంది. కొన్ని వ్యవహారాలలో ఇతరుల  సహయ సహకారాలు అందుతాయి. ధనదాయం బాగుంటుంది. సంతాన విద్య విషయాలు  సంతృప్తికరంగా సాగుతాయి.

ALSO READ: ఆ రాశి అమ్మాయిలతో జాగ్రత్త – లేదంటే ఇక అంతే

 

Related News

Dussehra 2025: దసరా నుంచి.. ఈ రాశుల వారు పట్టిందల్లా బంగారం !

Today Horoscope in Telugu: నేటి రాశిఫలాలు (30/09/2025)                

Today Horoscope in Telugu: నేటి రాశిఫలాలు (29/09/2025)                

Weekly Horoscope: ఈ వారం రాశి ఫలాలు (సెప్టెంబర్‌ 28 – అక్టోబర్‌ 04)

Today Horoscope in Telugu: నేటి రాశిఫలాలు (28/09/2025)               

Today Horoscope in Telugu: నేటి రాశిఫలాలు (27/09/2025)               

Today Horoscope in Telugu: నేటి రాశిఫలాలు (26/09/2025)               

Big Stories

×