E-Paper
Advertisement

Astrology: రాశి ఫలాలు..ఈ రాశి వారికి వృత్తి, వ్యాపారాల్లో ఊహించని విజయం

Astrology: రాశి ఫలాలు..ఈ రాశి వారికి వృత్తి, వ్యాపారాల్లో ఊహించని విజయం

Astrology today: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. 12 రాశుల వారిలో ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. ఏ రాశి వారు విజయం సాధిస్తారు. ఎవరికి అనుకూలంగా ఉందనే విషయాలను తెలుసుకుందాం.

మేషరాశి:
ఈ రాశి వారికి అనుకూలంగా ఉంది. ప్రారంభించిన పనులను పట్టుదలతో విజయం సాధిస్తారు. ఆదాయం పెరుగుతుంది. విద్యార్థులకు కొత్త అవకాశాలు లభిస్తాయి. డబ్బు విషయంలో జాగ్రత్తలు అవసరం. కుటుంబంలో సమతుల్యత కాపాడుకోవాలి. ఇష్టదైవాన్ని పూజిస్తే మంచిది.

వృషభం:
వృషభ రాశి వారికి ఊహించని విజయాలు వరిస్తుంది. ప్రారంభించిన పనుల్లో అలసటకు గురికాకుండా చూసుకోవాలి. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ప్రయాణాలు ఉంటాయి. ఆర్థికపరంగా లాభం పొందుతారు. పెండింగ్ పనులు పూర్తవుతాయి. తోటి వారితో జాగ్రత్తగా మెలగాలి. శివుడిని దర్శించుకోవాలి.

మిథునం:
ఈ రాశి వారు కష్టపడి ప్రతి పనిలో విజయం పొందుతారు. అనుకోని విధంగా ఆర్థిక అవసరాలు పెరుగుతాయి. చేసే పనిలో హ్రమ పెరుగుతుంది. ప్రశాంతంగా ఉంటారు. పెండింగ్ పనులు ఊపందుకుంటాయి. సంపద పెరుగుతుంది. వ్యాపారాల్లో కలిసి వస్తుంది. ఎవరిని నమ్మవద్దు. ఆంజనేయుడిని సందర్శించాలి.

కర్కాటకం:
ఈ రాశి వారు ప్రారంభించిన పనుల్లో ఇబ్బందులను అధిగమించి విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై శ్రద్ద అవసరం. మీరు తీసుకునే కీలక నిర్ణయాలకు ప్రశంసలు వస్తాయి. ఊహించని ఫలితాలు అందుకుంటారు. వైవాహిక జీవితంలో ప్రేమ, సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. శివుడిని పూజించాలి.

సింహం:
సింహ రాశి వారికి ఆర్థిక ప్రయోజనాలు చేకూరుతాయి. ప్రారంభించిన పనుల్లో ఆటంకాలను అధిగమిస్తారు. మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. రుణ లావాదేవీలకు దూరంగా ఉండడం మంచిది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. శ్రీవారిని సందర్శిస్తే శుభం జరుగుతుంది.

కన్యరాశి:
ఈ రాశి వారు చేపట్టిన పనులు విజయవంతగా ఫూర్తవుతాయి. వైవాహిక జీవితం సంతోషకరంగా ఉంటుంది. మీరు తీసుకునే నిర్ణయాలతో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మనోబలంతో పనులు పూర్తి చేస్తారు. ఖర్చుల విషయంగా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఇష్టమైన దైవారాధన భుభప్రదం.

తుల రాశి:
ఈ రాశి వారికి మంచి గౌరవం లభిస్తుంది. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. మీరు చేసే పనుల్లో ఊహించని విధంగా అదృష్టం వరిస్తుంది. లక్ష్యంపై ఏకాగ్రత అవసరం. సొంత నిర్ణయాలు పనిచేస్తాయి.ఇతరుల సహకారం ఉంటుంది. దుర్గాదేవిని ఆరాధించాలి.

వృశ్చికం:
వృశ్చిక రాశి వారు ఆశించిన ఫలితాలు రాబడతారు. ఊహించిన అదృష్టం వరిస్తుంది. లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఒత్తిడిని ఎదుర్కొంటారు. ప్రత్యర్థులతో జాగ్రత్తగా ఉండాలి. ఇష్టదైవాన్ని పూజించాలి.

ధనుస్సు:
ఈ రాశి వారికి కుటుంబ సహకారం ఉంటుంది. మీ రంగాల్లో విజయం వరిస్తుంది. కీలయ పనుల్లో ఊహించని విజయం పొందుతారు. ప్రయాణాలు ఫలిస్తాయి. ఆర్థికంగా కలిసివస్తుంది. వివాదాలు తొలగిపోతాయి. పెద్దల సలహాలు ఫలిస్తాయి. ఇష్టదైవ ప్రార్థన చేస్తే మేలు జరుగుతుంది.

మకరం:
మకరం రాశి వారు అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. ఖర్చులు పెరుగుతాయి. పెట్టుబడి పెట్టేవారికి అనుకూలం. కొన్ని సంఘటనలు నిరుత్సాహ పరుస్తాయి. తీసుకునే నిర్ణయాలతో డబ్బు నష్టాన్ని నివారించవచ్చు. ప్రశాంతంగా ఉండాలి. సూర్య ఆరాధన మంచిది.

కుంభం:
ఈ రాశి వారికి వృత్తి, వ్యాపారాల్లో మంచి ఫలితాలు వస్తాయి. ఆర్థికంగా మిశ్రమ కాలం. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. అనవసర ఖర్చులకు దూరంగా ఉండాలి. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. మీ పట్టుదల మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. లక్ష్మీధ్యానంతో మనోబలం పెరుగుతుంది.

మీనం:
మీన రాశి వారు ప్రారంభించిన పనుల్లో మంచి ఫలితాలు సాధిస్తారు. సామాజిక గౌరవం పొందుతారు. మనోబలం పెరుగుతుంది. అనుకున్న సమయానికి డబ్బు అందుతుంది. సమస్యలనుంచి బయటపడుతారు. ఆర్థిక విషయాల్లో మీ కష్టానికి తగిన ఫలితం పొందుతారు. శివుడిని ఆరాధించాలి.

Related News

రథాన్ని విరగ్గొట్టిన లక్ష్మీదేవి! పూరీ జగన్నాథ క్షేత్రంలో.. నేటికీ జరిగే అద్భుతమైన ఆచారం

చార్ ధామ్ యాత్ర.. ఎటు చూసినా భక్తులు, 8 కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్

ఆ దేవుడికి చేతులు కాళ్ళు ఎందుకు ఉండవు ?..అసలు రహస్యం ఇదే

Black Thread: ఈ రాశుల వారు కాలికి నల్ల దారం కట్టుకుంటే శని చెడు ప్రభావం తగ్గుతుంది

Anger: కోపాన్ని తగ్గించే రత్నం.. సోమవారంనాడు ధరిస్తే మీ జీవితమే మారిపోతుంది

ప్రసాదంగా లడ్డూ కాదు.. సాక్షాత్తూ ‘డబ్బులే’ ఇస్తారు! ఈ వింత ఆలయం గురించి మీకు తెలుసా?

రావి చెట్టు ఇంట్లో ఉండకూడదని ఎందుకు అంటారు? అసలు నిజం తెలిస్తే షాక్ అవుతారు

Vastu tips: ఇలాంటి సీలింగ్ ఫ్యాన్ ఇంట్లోకి పేదరికాన్ని తెస్తుంది.. ఈ 5 తప్పులు చేయకండి

Big Stories

×