Banana Tree In House: సనాతన ధర్మంలో గురువారం విష్ణువు, దేవగురువు బృహస్పతికి అంకితం చేయబడింది. గురువారం రోజు అరటి చెట్టును పూజించడం శుభప్రదంగా భావిస్తారు. ఈ చెట్టులో నారాయణుడు స్వయంగా నివసిస్తున్నాడని నమ్ముతారు. చాలా మంది ఇంట్లో అరటి చెట్లను నాటడానికి ఇష్టపడతారు. ఇంట్లో అరటి చెట్టును నాటడం మంచిదా కాదా అనే సందేహాం చాలా మందిలో ఉంటుంది. మరి ఇంట్లో అరటి చెట్టు నాటడం గురించి వాస్తు శాస్త్రం ఏమి చెబుతుందో తెలుసుకోవడం కూడా ముఖ్యం. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాను ఇప్పుడు తెలుసుకుందాం.
తులసి, మనీ ప్లాంట్, వెదురు చెట్టు వంటి మొక్కల మాదిరిగానే.. ఇంట్లో అరటి చెట్టు నాటడం కూడా శుభప్రదంగా పరిగణించబడుతుంది. మీరు ఇంట్లో అరటి చెట్టు నాటాలని అనుకుంటే.. మాత్రం కొన్ని వాస్తు నియమాలను తప్పకుండా పాటించాలి. లేకుంటే భారీ నష్టాలు ఎదుర్కోవలసి ఉంటుంది.
ఇంట్లో అరటి చెట్టు నాటడానికి సరైన దిశ ఏంటి ?
సనాతన ధర్మ గ్రంథాలలో.. అరటి చెట్టు నాటడానికి ఇంటి ఈశాన్య దిశ ఉత్తమమని భావిస్తారు. అయితే దీనిని తూర్పు , ఉత్తర దిశలలో కూడా నాటడం మంచిది. కానీ ఇక్కడ గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే.. అరటి చెట్టును పొరపాటున కూడా దక్షిణం, పడమర దిశలో నాటకూడదు.
ఇదే కాకుండా అరటి చెట్టును ఇంటి లోపల లేదా ఇంటి ముందు నాటకూడదని చెబుతారు. ఇంటి వెనుక దిశలో అరటి చెట్టును నాటడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఈ వాస్తు నియమాలను పాటించడం ద్వారా.. ఇంట్లో సానుకూల శక్తి ప్రవహించడం ప్రారంభమవుతుంది. అంతేకాకుండా.. నారాయణుడి ఆశీస్సులు కూడా మీపై ఎల్లప్పుడూ ఉంటాయి.
బరువైన వస్తువులు:
హిందూ మత గ్రంథాల ప్రకారం.. ఉత్తర దిశ లక్ష్మీ దేవి, కుబేరుడికి సంబంధించినది. కాబట్టి.. బరువైన వస్తువులను ఇంట్లో ఈ దిశలో ఎప్పుడూ ఉంచకూడదు. అలాంటి తప్పు ఎవరు చేసినా వారి కుటుంబం నుండి ఆనందం , శ్రేయస్సు దూరమవుతాయని అంటారు. అంతేకాకుండా.. ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుందట.
బూట్లు, చెప్పులు:
ఇంట్లో ఉత్తర దిశలో బూట్లు, చెప్పులు ఉంచడం అశుభం. అలాంటి తప్పు చేసే వ్యక్తి ఇంట్లో ప్రతికూల శక్తి ప్రవహిస్తుందని అంటారు. అంతేకాకుండా ఇంట్లో సంఘర్షణ పరిస్థితి కొనసాగుతుంది.
మూసిన గోడ :
హిందూ మత గ్రంథాల ప్రకారం.. ఇంటికి ఉత్తర దిశలో పొరపాటున కూడా మూసివున్న గోడను ఉంచకూడదు. ఈ దిశ లక్ష్మీ దేవి రాకకు సంబంధించిన దిశ. ఈ కారణంగానే చాలా ఇళ్లలో కిటికీలు లేదా తలుపులు ఉత్తరం వైపు ఉంటాయి.
Also Read: శుక్రుడి సంచారం.. ఈ రాశుల వారికి డబ్బే డబ్బు !
చెత్తబుట్ట:
పొరపాటున కూడా ఇంటి ఉత్తర దిశలో చెత్తబుట్టను ఉంచకూడదు. అలాంటి తప్పు ఎవరు చేసినా.. లక్ష్మీదేవి కోపంగా ఇంటిని వదిలి వెళ్లిపోతుందని అంటారు. దీని కారణంగా.. జీవితంలో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది.
టాయిలెట్ :
పొరపాటున కూడా ఇంటికి ఉత్తర దిశలో టాయిలెట్ నిర్మించకూడదు. అలాంటి తప్పు ఎవరు చేసినా.. వారి జీవితంలో దురదృష్టం ప్రవేశిస్తుందని అంటారు. సనాతన ధర్మంలో ఇంటికి ఉత్తరం దిశలో మరుగుదొడ్డి ఉండటం అశుభకరమని భావిస్తారు.