BigTV English
Advertisement

Shukra Gochar 2025: శుక్రుడి సంచారం.. ఈ రాశుల వారికి డబ్బే డబ్బు !

Shukra Gochar 2025: శుక్రుడి సంచారం.. ఈ రాశుల వారికి డబ్బే డబ్బు !

Shukra Gochar 2025: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం గ్రహాల రాశి మార్పు 12 రాశుల వారిని ప్రభావితం చేస్తుంది. గ్రహాల రాశి మార్పు కారణంగా.. ఆయా రాశుల వారి జీవితంలో సంపద, వృత్తి, ప్రేమ, శ్రేయస్సు మొదలైనవి వివిధ మార్గాల్లో ప్రభావితమవుతాయి. ఇదిలా ఉంటే.. శుక్రుడు 31 మే 2025, శనివారం ఉదయం 11:42 గంటలకు మీన రాశిని వదిలి మేషరాశిలోకి ప్రవేశించనున్నాడు.


శుక్రుడి రాశి మార్పు కొన్ని రాశుల వారిపై అధిక ప్రహావాన్ని చూపుతుంది. అంతే కాకుండా వారి జీవితాల్లో సానుకూల మార్పులను తీసుకురాబోతోంది. మరి శుక్రుడి సంచారం ఏ ఏ రాశుల వారిని ప్రభావితం చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.

మేష రాశి:
మేష రాశి వారికి శుక్రుని సంచారము వల్ల అద్భుత ప్రయోజనాలు కలుగుతాయి. సంపద, శ్రేయస్సు , విలాసాలను అనుభవించడానికి ఎక్కువ అవకాశాలు కూడా ఉన్నాయి. అంతే కాకుండా విద్యార్థులు కూడా శుభ వార్తలు వింటారు. కొత్త వాహనాలు, వస్తువులను కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కుటుంబ సభ్యులతో సంతోషకరమైన జీవితం గడుపుతారు. అంతేకాకుండా.. ఆస్తికి సంబంధించిన విషయాలలో పురోగతి , విజయం సాధించే అవకాశాలు ఉంటాయి. వ్యాపారాలలో ఆదాయం పెరుగుతుంది. ప్రేమ వివాహం జరిగే అవకాశాలు బలంగా ఉన్నాయి. గతంలో పెట్టిన పెట్టుబడులు మీకు లాభాలను అందిస్తాయి. అంతే కాకుండా వైవాహిక జీవితం కూడా సంతోషంగా ఉంటుంది. పెట్టుబడులు పెట్టేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి.


తులా రాశి :
శుక్రుడి రాశి సంచారం తులా రాశి వారికి మే 31 నుండి అధిక ప్రయోజనాలను అందిస్తుంది. తులా రాశి వారు ఆర్థిక పరంగా లాభాలను పొందే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. తులా రాశికి అధిపతి శుక్రుడు. శుక్ర సంచార ప్రభావం వల్ల తులా రాశి వ్యక్తులు ఇల్లు, వాహనం లేదా ఇతర ఆస్తిని కొనుగోలు చేయడంలో విజయం సాధిస్తారు. వ్యాపారం, ఉద్యోగం రెండింటిలోనూ విజయం సాధిస్తారు. ప్రేమ జీవితంలో ఆనందం పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అంతే కాకుండా కుటుంబ సభ్యులతో సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు.

Also Read: చాణక్య నీతి ప్రకారం, ప్రతీ పనిలో విజయం సాధించాలంటే.. ఇలా చేయాలట !

కుంభ రాశి:
కుంభ రాశి వారికి శుక్రుని రాశి మార్పు అనేక ప్రయోజనాలను అందిస్తుంది. ఈ వ్యక్తుల జీవితాల్లో ఆకస్మిక ఆర్థిక లాభం పొందే అవకాశాలు ఉంటాయి. ప్రేమ సంబంధాలు మరింత మెరుగుపడుతుంది. అంతే కాకుండా మీ ఆదాయం పెరగడానికి నూతన అవకాశాలు కూడా మీకు లభిస్తాయి. ఆఫీసుల్లో కూడా మీ గౌరవం పెరుగుతుంది. అంతే కాకుండా విద్యార్థులు కూడా శుభ వార్తలు అందుకుంటారు. గతం కంటే మీ ఆరోగ్యం చాలా మెరుగ్గా ఉంటుంది. అంతే కాకుండా మీరు మీ కుటుంబ సభ్యులతో సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు. మే 31 నుండి మీ ఆర్థిక కష్టాలు  తొలగిపోతాయి. అంతే కాకుండా మీరు అనుకున్న పనులను సాధించడంలో కూడా మీరు ముందుంటారు. కుటుంబ సభ్యులతో మద్దతు కూడా మీకు పెరుగుతుంది. ఉన్నతాధికారుల నుండి మీరు ప్రశంసలు అందుకునే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి.

Related News

Karthika Masam 2025: కార్తీక మాసం చివరి సోమవారం.. ఇలా పూజ చేస్తే శివయ్య అనుగ్రహం

Shani Puja: ఈ నాలుగు పనులు చేశారంటే శని దేవుడు మీ కష్టాలన్నీ తీర్చేస్తాడు

Vastu tips: మహిళలు నిలబడి చేయకూడని పనులు ఇవన్నీ.. చేస్తే పాపం చుట్టుకుంటుంది

Vastu tips: మీ ఇంట్లో ప్రతిరోజూ కర్పూరం వెలిగించడం వల్ల జరిగేది ఇదే

Vastu Tips: ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఉందా ? అయితే ఈ వాస్తు టిప్స్ పాటించండి !

Money Plant: మనీ ప్లాంట్ నాటుతున్నారా ? ఈ పొరపాట్లు అస్సలు చేయొద్దు

Vastu tips: వంట గదిలో మీ చేతిలోంచి ఈ ఐదు వస్తువులు జారి పడకుండా చూసుకోండి

Karthika Masam: కార్తీక మాసంలో.. ఎలాంటి దానాలు చేస్తే మంచిదో తెలుసా ?

Big Stories

×