E-Paper
Advertisement

Ganesh Chaturthi 2024: గణపతిని ఇంటికి తెచ్చే ముందు ఈ విషయాలు తప్పకుండా గుర్తుంచుకోండి

Ganesh Chaturthi 2024: గణపతిని ఇంటికి తెచ్చే ముందు ఈ విషయాలు తప్పకుండా గుర్తుంచుకోండి
Advertisement

Ganesh Chaturthi 2024: హిందూ మతంలో శ్రావణ మాసానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ రెండు నెలలు శివుడితో పాటు పార్వతీ, వినాయకుడి పూజిస్తారు. శ్రావణ మాసం శివుడి ఆరాధనకు అంకితం చేయబడింది. భాద్రపద మాసంలో వినాయకుడిని పూజిస్తుంటారు. ఈ మాసం గణేశుడు పుట్టుకతో ముడిపడి ఉంటుంది. మత విశ్వాసాల ప్రకారం గణపతి భాద్రపద మాసంలో శుక్ల పక్షం చతుర్థి రోజున జన్మించాడు. ప్రతి సంవత్సరం గణపతి జన్మదినాన్ని పండుగలాగా జరుపుకుంటారు. ఈ పండగ పదిరోజుల పాటు కొనసాగుతుంది.

గణేష్ చతుర్థి వేడుకలు సెప్టెంబర్ 7 నుంచి ప్రారంభం కాగా గణపతి నిమర్జనం సెప్టెంబర్ 17 న చేస్తారు. ఈ రోజు బ్రహ్మయోగం ఏర్పడబోతోంది. గణేష్ చతుర్థి పండగను చిత్రా నక్షత్రంలో జరుపుకోనున్నారు. ఈ పండగను మహారాష్ట్రలో ఘనంగా జరుపుకుంటారు.  వినాయక చవితి  రోజు విగ్రహాలను ఇళ్లలో ప్రతిష్టించి పూజా కార్యక్రమాలు నిర్వహించి స్వామికి నైవేద్యాలను సమర్పిస్తారు. 10 రోజు పాటు వినాయకుడికి పూజలు నిర్వహిస్తారు.  పది రోజుల తర్వాత నిమర్జనం చేస్తారు.

Advertisement

వినాయక చవితి రోజు నుంచి 10 రోజుల పాటు గణేశుడి ఊరేగింపులో పాల్గొనడంతో పాటు పూజా కార్యక్రమాలు, రుచికరమైన వంటకాలు గణపతికి సమర్పించడం వంటివి చేస్తుంటారు. గణపతి పండగ రోజు ఇళ్లల్లో, వీధుల్లో వినాయకుడి విగ్రహాలను ప్రతిష్టిస్తారు. ముఖ్యంగా వినాయకుడి విగ్రహాలను కొనే ముందు కొన్ని విషయాలు గుర్తించుకోవాల్సి ఉంటుంది.  మీ ఇంట్లో గణపతి స్థాపన చేసే ముందు ఈ విషయాలు తప్పక గుర్తుంచుకోండి.

1. గణపతిని ఇంటికి తీసుకు రావడానికి ముందు ఇంటిని ముందుగా శుభ్రం చేసుకుని అలంకరించుకోవాలి.
2. మట్టి విగ్రహాన్ని పెట్టుకోవడం మంచిది. ఇనుము లేదా ఉక్కు విగ్రహాలకు దూరంగా ఉండండి.
3. గణపతి బప్పను ఇంటికి తీసుకురావడానికి ముందు విగ్రహాన్ని శుభ్రమైన గుడ్డతో కప్పెలా చూసుకోండి.
4. ఇంటిలో పూజా స్థలంలో విగ్రహాన్ని పెట్టే ముందు పూజా స్థలంలో నీటితో నింపిన కలశాన్ని ఉంచడం మర్చిపోకండి.
5. గణేషుడిని ఇంట్లో ప్రతిష్టించడానికి ముందు ఆసనాన్ని సిద్ధం చేయండి.
6. విగ్రహాన్ని ప్రతిష్టించిన తర్వాత వినాయకుని తాజా పుష్పాలతో అలంకరించండి. అంతే కాకుండా ఎడమ భుజంపై జాన్వీ అని పిలువబడే పవిత్రమైన దారాన్ని కూడా అలంకరించండి.
7. విగ్రహం ప్రతిష్టించిన సమయం నుంచి వినాయకుడి నిమజ్జనం వరకు ప్రతి రోజు గణేషుడిని పవిత్ర మంత్రాలు పఠించి పూజ చేయండి. రకరకాల నైవేద్యాలు సమర్పించండి.

Advertisement

Also Read: శని ప్రదోష వ్రతం ఎప్పుడు ? తేదీ, శుభ సమయం మరియు పూజా విధానం

వినాయకుడి ప్రతిష్ట చేసిన తర్వాత చేయకూడనివి..

1. గణేశ్ చతుర్థి నుంచి 10 రోజుల సమయంలో మాంసం, చికెన్, ఇతర మాంసాహారం తినకూడదు.
2. గణేష్ చతుర్థి సందర్భంగా మధ్యపానాన్ని నిషేధించండి. వంటకాల్లో ఉల్లిపాయలు, వెల్లుల్లితో సహా తొలగించండి.
3. వినాయకుడిని ఎల్లప్పుడూ ఇంట్లో ఒంటరిగా లేకుండా చూడాలి. కనీసం ఒక్కరైనా విగ్రహం దగ్గర ఉండాలి.
4. గణపతి బప్ప విగ్రహాన్ని ఇంటికి ముందు తీసుకురావడానికి సుముహూర్తాన్ని అనుసరించాలి.

(గమనిక : ఇక్కడ ఇచ్చిన సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించినది. bigtvlive.com దీనిని ధృవీకరించదు.)

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×