BigTV English

Fatal Extramarital Affair: భర్త ఎదురుగానే ప్రియుడితో తిరిగే భార్య.. చివరికి ఏమైందంటే!

Fatal Extramarital Affair: భర్త ఎదురుగానే ప్రియుడితో తిరిగే భార్య.. చివరికి ఏమైందంటే!

Fatal Extramarital Affair| ఓ యువతి తన భర్తకు చదువురాదని అతనితో చులకనగా చూసేది. భర్త పట్ల అగౌరవంగా వ్యవహరించేది. ఆమెకు ఓ అయిదేళ్ల కూతురు కూడా ఉంది. అయినా మరో యువకుడితో ప్రేమాయాణం నడిపింది. అందరి ముందు ఆ యువకుడు తన ఫ్రెండ్ అని చెప్పేది. అతనితో బైక్ పై షాపింగ్ కు, సినిమాలకు, షికార్లకు వెళ్లేది. ఇదంతా చేయకూడదని భర్త ఎంత చెప్పినా ఆమె లెక్కచేయలేదు. ఇక చదువురాని మొద్దుతో కాపురం చేసేకన్నా.. తన ప్రియుడితోనే జీవితం గడపాలనుకుంది. అందుకే తన ప్రియుడితో పెళ్లి చేసుకుందామని ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయింది. ఆ తరువాత తిరిగి రాలేదు. పోలీసులు ఆమె కోసం వెతుకు తుండగా నిర్జీవ స్థితిలో కనిపించింది. ఈ ఘటన ఝార్ఖండ్ రాష్ట్రంలో జరిగింది.


పోలీసుల కథనం ప్రకారం.. ఝార్ఖండ్ రాష్ట్రంలోని దేవ్ ఘర్ జిల్లా మోహన్ పూర్ గ్రామానికి చెందిన ఫూల్ కుమారి అనే 26 మహిళకు ఆరేళ్ల క్రితం దుమ్ కా జిల్లాలో నివసించే ప్రకాశ్ (29)తో వివాహం జరిగింది. అయితే ప్రకాశ్ కు చదువురాదు. అతను చిన్న ఉద్యోగం చేస్తున్నాడు. వారిద్దరికి అయిదేళ్ల కూతురు కూడా ఉంది. ఫూల్ కుమారికి హిందీ సినిమాలలో లాగా జీవితం గడపడమంటే చాలా ఇష్టం. ఆమె పదవ తరగతి వరకు చదువుకుంది. దీంతో ఆమె నిత్యం స్మార్ట్ ఫోన్ లో ఫేస్ బుక్, ఇన్స్‌టాగ్రామ్ లోనే ఎక్కువ సమయం గడిపేది.

ఈ క్రమంలో ఏడాదిన్నర క్రితం ఫూల్ కుమారి ఒక సారి తన పుట్టింటికి వెళ్లినప్పుడు అక్కడ పవన్ చౌదరి (25) అనే యువకుడితో పరిచయమైంది. పవన్ ఆమె పుట్టింటి పొరుగులోనే ఉండేవాడు. అతను జిమ్ చేస్తూ.. రోజూ మంచి బైక్ లో తిరిగేవాడు. క్రమంగా ఫూల్ కుమారి అతనితో సినిమాలకు, షాపింగ్ కు వెళ్లేది. అలా ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం మొదలైంది. కొన్ని రోజుల తరువాత ఫూల్ కుమారి భర్త అత్తారింటికి వచ్చాడు. అక్కడ తన భార్య మరొక యువకుడితో తిరగడం చూసి గొడవపడ్డాడు. అయినా ఫూల్ కుమారి ఆ యువకుడు తనకు తమ్ముడు లాంటి వాడని, వారిద్దరి మధ్య ఉన్నది కేవలం స్నేహం అని చెప్పి నమ్మించింది. ఆ తరువాత ఫూల్ కుమారిని తీసుకొని ఆమె భర్త తన ఇంటికి వెళ్లిపోయాడు.


అయితే కొన్ని రోజుల తరువాత ఫూల్ కుమారి తన ప్రియుడిని తన అత్తారింటికి రావాలని ఫోన్ చేసి పిలిచింది. అలా ఆమె ప్రియుడు పవన్.. ఫూల్ కుమారి భర్త ఇంటికి కూడా వచ్చే వాడు. పవన్ ని తన పొరుగింటి అబ్బాయని ఫూల్ కుమారి తన అత్తారింట్లో పరిచయం చేసింది. అక్కడ ఆమె భర్త ఎదురుగానే అతడితో పనిఉందని షాపింగ్ కోసం వెళ్లిపోయేది. భర్త ఆమెను ఎంత వారించినా వినేది కాదు. పవన్ తరుచూ ఫూల్ కుమారి ఇంటి వస్తుండే వాడు. ఆ తరువాత ఇద్దరూ బయటికి వెళ్లిపోయే వారు. వారిద్దరి మధ్య వివాహేతర సంబంధం ఉందని తెలిసినా ఆమె భర్త ఏమీ చేయలేకపోయాడు. ఇదంతా ఒకటిన్నర సంవత్సరం నుంచి జరుగుతూ ఉంది. ఈ క్రమంలో ఫూల్ కుమారి తను ఇక భర్తను వదిలేసి పవన్ ని పెళ్లి చేసుకోవాలని నిర్ణియించుకుంది.

Also Read: ఇంటి నుంచి పారిపోతున్న తల్లిని పట్టుకొని ఏడ్చిన చిన్నారి.. ఆ పాపని నిర్దాక్షిణ్యంగా..!

ఒకరోజు ఫూల్ కుమారి తన అదేళ్ల కూతురితో ఒక బ్యాగులో తన నగలన్నీ తీసుకొని భర్తకు చెప్పకుండా తన పుట్టింటికి వచ్చేసింది. ఆ తరువాత ఇప్పుడే వస్తాను అని చెప్పి పవన్ బైక్ పై కూర్చొని వెళ్లిపోయింది. అలా వెళ్లిపోయిన ఫూల్ కుమారి రెండు రోజులైనా తిరిగిరాలేదు. దీంతో ఆమె పుట్టింటివారు ఫూల్ కుమారి భర్తకు సమాచారం అందించారు. ఫూల్ కుమారి కోసం ఆమె భర్త, తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే మూడు రోజుల తరువాత పోలీసులకు ఊరి బయట కాలిపోయిన ఒక మహిళ శవం ఉందని సమాచారం అందింది. పోలీసులు ఆ శవం గుర్తింపు కోసం మిస్సింగ్ కేసు ఫిర్యాదు చేసిన ఫూల్ కుమారి భర్త, తల్లిదండ్రులను పిలిపించారు. మహిళ బట్టలను గుర్తించి అది ఫూల్ కుమారి శవమే అని వారంతా చెప్పారు. దీంతో పోలీసులు.. శవం పోస్టు మార్టం చేయించారు.

పోస్టు మార్టం రిపోర్టు ప్రకారం.. ఫూల్ కుమారి నాలుగు రోజుల క్రితం చనిపోయిందని తేలింది. దీంతో పోలీసులు ఫూల్ కుమారి ఫోన్ డేటాని పరిశీలించారు. ఆ తరువాత ఆమె శవం లభించిన స్థలంలో టవర్ లొకేషన్ ని బట్టి ఆమె ప్రియుడు కూడా ఘటనా స్థలంలో ఆ సమయానికి ఉన్నాడని తేలింది. దీంతో పోలీసులు ఫూల్ కుమారి ప్రియుడు పవన్ చౌదరి ట్రేస్ చేసి పట్టుకున్నారు. పోలీసులు తమదైన శైలిలో నిందితుడు పవన్ చౌదరి ప్రశ్నించగా.. అప్పుడు నిజం బయటపడింది.

Also Read: ‘రూ.5 వేలకే అందమైన యువతి’.. ఒక మహిళ ఎలా మోసపోయిందంటే..

ఫూల్ కుమారి తన ప్రియుడిని వివాహం చేసుకోవాలని బలవంతం చేసేది. అయితే అతనికి మాత్రం ఆమెను వివాహం చేసుకోవడం ఇష్టం లేదు. అయినా ఆ రోజు ఫూల్ కుమారి తన ఇంట్లో ని నగలన్నీ తీసుకొని ప్రియుడి వద్దకు వచ్చి.. పారిపోదామని చెప్పింది. అయితే అతను వినకపోయేసరికి ఆమె తన ప్రియుడు పవన్ చౌదరిని బ్లాక్ మెయిల్ చేసింది. అతని పై రేప్ కేసు పెడతానని బెదిరించింది. దీంతో పవన్ ఆమెను ఒప్పించి ఊరి చివరకు తీసుకొని వెళ్లి.. ఆమె చీరతోనే గొంతు నులిమేశాడు. ఆమె చనిపోయాక తన బైక్ లోని పెట్రోల్ తీసి ఫూల్ కుమారి శవాన్ని తగలబెట్టాడు. పవన్ పోలీసుల ముందు హత్య చేసినట్లు అంగీకరించాడు. పోలీసులు పవన్ పై ఫూల్ కుమారి హత్య కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు. ప్రస్తుతం కోర్టులో కేసు విచారణ సాగుతోంది.

Also Read: ఫారిన్‌లో ఉద్యోగం చేస్తున్న యువకుడు.. పెళ్లికి ముందు యువతిని ఎలా మోసం చేశాడంటే..

 

Related News

Hyderabad News: ఆడ వేషం వేసుకుని.. ఫ్రెండ్ ఇంట్లో చోరి, ఇదిగో ఇలా దొరికిపోయాడు!

Bapatla Road Accident: బాపట్లలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఓ కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి

Charlapalli Incident: సంచిలో డెడ్ బాడీ కేసులో పురోగతి.. ఆ మహిళ, నిందితుడు ఎవరంటే?

Mahabubnagar: మహిళ డెడ్ బాడీని రోడ్డు పక్కన వదిలేసిన అంబులెన్స్ డ్రైవర్.. రాష్ట్రంలో దారుణ ఘటన

Train Accident: రైలు ఢీకొని.. ఇద్దరు యువకులు మృతి

Husband Kills Wife: గాఢ నిద్రలో భార్య.. సైలెంటుగా గొంతుకోసి పరారైన భర్త.. అసలు ఏమైంది

Food Delivery Boy: ఫుడ్ ఆర్డర్ ఆలస్యంగా తెచ్చాడని.. డెలివరీ బాయ్‌పై ఘోరంగా దాడి

Guntur Bus Accident: గుంటూరులో ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్లోనే 25 మంది

Big Stories

×