BigTV English

Benefits of Bhasma/Vibhuti : భస్మధారణ ఎక్కడ చేసుకుంటే ఎలాంటి ఫలితం కలుగుతుంది….

Benefits of Bhasma/Vibhuti : భస్మధారణ ఎక్కడ చేసుకుంటే ఎలాంటి ఫలితం కలుగుతుంది….

Benefits of Bhasma/Vibhuti : భస్మధారణతో మహాపాపాలు కూడా నశిస్తాయి. కుడిచేతి మధ్యమ, అనామికా వేళ్ళ సాయంతో విభూతిని చేతిలోకి తీసుకోవాలి. నుదుటిపై పెట్టుకోవడం కూడా ఎడమవైపు నుండి కుడివైపుకు విభూతి రేఖలు తీర్చిదిద్దాలి. గృహస్తు భస్మాన్ని నీళ్ళతో తడిపి, నుదుటిమీద, ఉదరంపైన, చేతులమీద పెట్టుకోవాలి. మంత్రాలు పఠించలేని వారు కనీసం నమశ్శివాయ అనే పంచాక్షరీ మంత్రాన్ని జపించి, భస్మధారణ చేయాలి.


స్త్రీలు, స్వాములు నీళ్ళతో తడపని పొడి విభూతిని ధరించాలని శాస్త్రాలు చెప్తున్నాయి. విభూతి ధరిస్తే సకల శారీరక,మానసిక రోగాలు తొలగిపోయి, పరిపూర్ణ ఐశ్వర్యం సిద్ధిస్తుంది. పీకలవరకు చేసిన పాపాలు తొలగుతాయి. భస్మాన్ని వక్షస్థలం రాసుకుంటే మనస్సుతో తెలిసి చేసిన పాపం నశిస్తుంది. నాభిపై రాసుకుంటే కడుపు దాకా చేసిన పాప నిర్మూలన జరుగుతుంది. భుజాలుపై రాసుకుంటే చేతితో చేసిన పాపం నశిస్తుంది.హోమ భస్మం ధారణతో నవగ్రహ బాధలు తొలగిపోతాయి. మనిషిలో ఉండే అన్ని రకాల దోషాలు నివారించబడతాయి. దేవుని అనుగ్రహం కలిగి అన్ని పలును నిరాటకంగా జరుగుతాయి.అన్ని రకాల గోచర, అగోచర, దృశ్య, అదృశ్య రోగాలు తొలగిపోతాయి.

శ్రీ మహాగణపతి హోమంలోని భస్మాన్ని ఉపయోగిస్తే అన్ని పనులు నిరాటంకంగా జరుగుతాయని నమ్మకం. సుబ్రహ్మణ్య స్వామి హోమంలోని భస్మాన్ని ధరిస్తే ఇంట్లో ఉండే కలహాలు తొలగి అందరికీ శాంతి చేకూరుతుంది. దుర్గా హోమంలోని భస్మాన్ని ధరిస్తే సకల శత్రువుల నాశనం జరిగి ప్రశాంతత జీవితాన్ని సాగించవచ్చు. ధన్వంతరి హోమంలోని భస్మాన్ని ధరిస్తే అన్ని రోగాలు నివారించబడి దేహం వజ్రసమానంగా మారుతుంది. నవగ్రహ హోమంలోని భస్మాన్ని ధరిస్తే ఎంటువంటి గ్రహాల చెడు ప్రభావం ఉండదు.మహా మృత్యుంజయ హోమంలోని భస్మంతో అన్ని రకాల అకాల మృత్యువులు తొలగిపోతాయి. హోమ భస్మధారణతో ఎటువంటి మాంత్రికుల బాధ, దృష్టి, శాపం, గ్రహ బాధలు వేధించవు. హోమభస్మాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నేలపై ఉంచకూడదు..


Follow this link for more updates:- Bigtv

Tags

Related News

Vastu Tips:ఇంట్లో నుంచి నెగిటివ్ ఎనర్జీ పోయి..సంతోషంగా ఉండాలంటే ?

Raksha Bandhan 2025: 16 రోజుల పాటు రాఖీ తీయకూడదట ! హిందూ సాంప్రదాయం ఏం చెబుతోందంటే ?

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలను ఎండకుండా చూసుకోండి, అలా ఎండితే లక్ష్మీదేవి కరుణించదు

Big Stories

×