E-Paper
Advertisement

Elephant Idol: ఇంట్లో ఏనుగు విగ్రహం పెడితే.. నిజంగానే జీవితాలు మారిపోతాయా ?

Elephant Idol: ఇంట్లో ఏనుగు విగ్రహం పెడితే.. నిజంగానే జీవితాలు మారిపోతాయా ?

Elephant Idol: హిందూ ధర్మశాస్త్రంలో అంతే కాకుండా వాస్తు శాస్త్రంలో ఏనుగుకు అత్యంత విశిష్టమైన స్థానం ఉంది. ఏనుగును వినాయకుడి స్వరూపంగా.. ఐశ్వర్యానికి అధిదేవత అయిన గజలక్ష్మి రూపంగా మనం భావిస్తాం. చాలా మంది ఇంట్లో అలంకరణ కోసం ఏనుగు విగ్రహాలను పెడుతుంటారు. కానీ అవి కేవలం అలంకార వస్తువులు మాత్రమే కాదు.. సరైన దిశలో..సరైన పద్ధతిలో పెడితే ఇంట్లోకి సానుకూల శక్తిని, సంపదను, ప్రశాంతతను తీసుకొస్తాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు. అసలు ఏనుగు విగ్రహం వల్ల కలిగే మార్పులేంటో వివరంగా తెలుసుకుందాం.

వాస్తు శాస్త్రం ప్రకారం ఏనుగు ప్రాముఖ్యత:

వాస్తు శాస్త్రం ప్రకారం.. ఏనుగు ధైర్యానికి, జ్ఞానానికి అంతే కాకుండా రాజసానికి చిహ్నం. ఏనుగులు గుంపులుగా కలిసి మెలిసి ఉంటాయి. అందుకే ఇవి కుటుంబంలో ఐక్యతను కూడా సూచిస్తాయి. గజరాజు ఇంటి రక్షణ కవచంలా పనిచేస్తుందని నమ్ముతారు.

1. సంపద, విజయం:
ఏనుగు తొండం పైకి ఎత్తి ఉంటే అది విజయాన్ని, అదృష్టాన్ని సూచిస్తుంది. వ్యాపార సంస్థల్లో లేదా ఆఫీసు టేబుల్స్ మీద ఇటువంటి విగ్రహాలు ఉంచడం వల్ల వృత్తిపరంగా ఎదుగుదల ఉంటుంది. ముఖ్యంగా గజలక్ష్మి రూపంలో ఉన్న ఏనుగులు ఇంట్లో లక్ష్మీ కటాక్షం కలిగిస్తాయి.

2. జంట ఏనుగులు, దాంపత్యం:
బెడ్‌రూమ్‌లో రెండు ఏనుగుల విగ్రహాలను (జంటగా) ఉంచడం వల్ల భార్యాభర్తల మధ్య ఉన్న మనస్పర్థలు తొలగిపోయి, ప్రేమానురాగాలు పెరుగుతాయి. అయితే.. ఇవి ఒకదానికొకటి ఎదురుగా ఉండేలా చూసుకోవాలి.

3. పిల్లల చదువు, ఏకాగ్రత:
పిల్లల స్టడీ టేబుల్ మీద లేదా వారి గదిలో ఏనుగు విగ్రహాన్ని ఉంచడం వల్ల వారిలో ఏకాగ్రత పెరుగుతుందని వాస్తు చెబుతోంది. ఏనుగుకు ఉండే జ్ఞాపకశక్తి , తెలివితేటలు పిల్లలకు కూడా లభిస్తాయని నమ్మకం.

ఏ దిశలో ఉంచాలి ?

విగ్రహం పెట్టడం ఎంత ముఖ్యమో.. దానిని సరైన దిశలో ఉంచడం కూడా అంతే ముఖ్యం.

ఉత్తర దిశ: ఉత్తర దిశ కుబేరుడికి స్థానం. ఈ దిశలో ఏనుగు విగ్రహాన్ని ఉంచడం వల్ల ఆర్థిక లాభాలు ఉంటాయి.

తూర్పు దిశ: ఇంటి ప్రధాన ద్వారం తూర్పు వైపు ఉంటే.. ద్వారం వైపు ముఖం చేసి ఉన్న ఏనుగు విగ్రహాలు ఇంటికి రక్షణగా ఉంటాయి. అంతే కాకుండా కీర్తి ప్రతిష్టలను పెంచుతాయి.

పడమర దిశ: సృజనాత్మకత పెరగాలంటే పడమర దిశలో ఉంచవచ్చు.

ఎలాంటి విగ్రహాలు ఎంచుకోవాలి ?

మార్కెట్లో రకరకాల లోహాలతో చేసిన ఏనుగులు దొరుకుతాయి. ఒక్కో లోహానికి ఒక్కో ప్రత్యేకత ఉంది.

వెండి ఏనుగు: జాతకంలో రాహు దోషాలు పోవడానికి, శాంతికి ఎంతగానో ఉపయోగపడుతుంది.

రాగి ఏనుగు: ఆరోగ్యం, సూర్య శక్తి పెరగడానికి సహాయపడుతుంది.

కంచు/పిత్తాళం: ఇంట్లో ఐశ్వర్యం, గౌరవం పెరగడానికి తోడ్పడుతుంది.

రాయి/మట్టి: భూమి తత్వానికి చిహ్నం, స్థిరత్వాలకు సంకేతాలుగా వీటిని ఉపయోగిస్తారు.

Also Read: కొత్త ఇళ్లు కొంటున్నారా ? ఈ వాస్తు దోషాలు లేకుండా జాగ్రత్తలు తీసుకోండి

ముఖ్యమైన జాగ్రత్తలు:

ఏనుగు విగ్రహం పెట్టేటప్పుడు ఈ కింది విషయాలు గుర్తుంచుకోవాలి.

తొండం దిశ: విగ్రహం తొండం పైకి ఉంటే అదృష్టం, కిందకు ఉంటే వినయం అంతే కాకుండా ఏకాగ్రతను సూచిస్తుంది. కానీ పగిలిన లేదా విరిగిన తొండం ఉన్న విగ్రహాలను ఇంట్లో ఉంచకూడదు.

జంటగా ఉంచడం: ఒంటరి ఏనుగు కంటే జంట ఏనుగులను ఉంచడం శుభప్రదం

శుభ్రత: విగ్రహంపై దుమ్ము చేరకుండా ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. అపరిశుభ్రత ప్రతికూల శక్తిని ఇస్తుంది.

ఏనుగు విగ్రహం అనేది కేవలం ఒక బొమ్మ కాదు, అది మన సంస్కృతిలో ఒక పవిత్రమైన గుర్తు. వాస్తు నియమాలను పాటిస్తూ సరైన విగ్రహాన్ని ఇంట్లో ప్రతిష్ఠించుకుంటే.. కచ్చితంగా మానసిక ప్రశాంతతతో పాటు ఆర్థిక అభివృద్ధిని కూడా ఆశించవచ్చు. మీ నమ్మకమే మీ విజయానికి పునాది

Related News

రథాన్ని విరగ్గొట్టిన లక్ష్మీదేవి! పూరీ జగన్నాథ క్షేత్రంలో.. నేటికీ జరిగే అద్భుతమైన ఆచారం

చార్ ధామ్ యాత్ర.. ఎటు చూసినా భక్తులు, 8 కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్

ఆ దేవుడికి చేతులు కాళ్ళు ఎందుకు ఉండవు ?..అసలు రహస్యం ఇదే

Black Thread: ఈ రాశుల వారు కాలికి నల్ల దారం కట్టుకుంటే శని చెడు ప్రభావం తగ్గుతుంది

Anger: కోపాన్ని తగ్గించే రత్నం.. సోమవారంనాడు ధరిస్తే మీ జీవితమే మారిపోతుంది

ప్రసాదంగా లడ్డూ కాదు.. సాక్షాత్తూ ‘డబ్బులే’ ఇస్తారు! ఈ వింత ఆలయం గురించి మీకు తెలుసా?

రావి చెట్టు ఇంట్లో ఉండకూడదని ఎందుకు అంటారు? అసలు నిజం తెలిస్తే షాక్ అవుతారు

Vastu tips: ఇలాంటి సీలింగ్ ఫ్యాన్ ఇంట్లోకి పేదరికాన్ని తెస్తుంది.. ఈ 5 తప్పులు చేయకండి

Big Stories

×