BigTV English

Bird Nest:- పక్షికి గూడు పెడితే సొంతిల్లు కల నెరవేరుతుందా….

Bird Nest:- పక్షికి గూడు పెడితే సొంతిల్లు కల నెరవేరుతుందా….

Bird Nest:- వాస్తుశాస్త్రాన్ని నమ్మేవారికి ఎన్నో దారులు కనిపిస్తాయి. వాస్తును అనుసరిస్తే చాలా సమస్యల నుండి పరిష్కారం దొరుకుతుంది. పండితులు . ఏళ్ల తరబడి అద్దె ఇంట్లోనే గడిపే వారు సొంతిల్లు యోగం కలగాలంటే కొన్ని చిట్కాలు చెబుతోంది వాస్తుశాస్త్రం. కొన్ని పరిహారాలు పాటిస్తే కల నెరవేరుతుందట. వాస్తు శాస్త్రం ప్రకారం ఆవ నూనె తో ప్రతిరోజు దీపం పెడితే చాలా మంచి కలుగుతుంది శని దేవుడు కి రోజూ ఆవ నూనె తో దీపాన్ని పెట్టి శ్లోకాలను చదువుకుంటే చక్కటి పరిష్కారం దొరుకుతుంది. సొంత ఇల్లు కట్టుకోవాలని చాలా మంది అనుకున్నప్పటికీ అది కుదరకపోవచ్చు అలాంటివాళ్లు సొంత ఇంటిని కట్టుకోవాలని అనుకుంటే వాస్తు ప్రకారం ఇలా అనుసరించడం మంచిది అప్పుడు తప్పక సొంత ఇంటిని కట్టుకోవచ్చు.


అలానే వాస్తు శాస్త్రం ప్రకారం వేప చెక్కతో చిన్న ఇల్లు చేసి పేదలకి కానీ గుళ్లో కానీ పెడితే లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి ఆర్థిక బాధల నుండి బయట పడచ్చు. సొంత ఇల్లు కల కూడా నెరవేరుతుంది. వాస్తు శాస్త్రం ప్రకారం శ్రీ యంత్రాన్ని పెట్టడం వల్ల చక్కటి ఫలితం పొందవచ్చు. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి.ఆవుకి బియ్యం బెల్లం మంగళవారం నాడు పెడితే కూడా చక్కటి ఫలితాన్ని పొందొచ్చు అలానే వాస్తు శాస్త్రం ప్రకారం పాలు, పంచదార, నెయ్యి, కర్పూరం, పెరుగు, తేనె నవరాత్రి ఆఖరి రోజున పెట్టి నవరన మంత్రాలని దుర్గాదేవికి చదివితే కూడా సొంతింటి కల నెరవేరుతుంది. చూశారు కదా పండితులు చెప్పిన అద్భుతమైన చిట్కాలని మరి వీటిని అనుసరించి సొంత ఇంటి కలని నెరవేర్చుకోండి .

అద్దింటి నుంచి సొంతింటికి మారే కల కంటున్న వారు ఇప్పుడు నివసిస్తున్న ఇంటిలో పశ్చిమ దిక్కున రాగితో చేసిన అలంకరణ వస్తువును పెట్టాలి. ఇలా చేస్తే శని అనుగ్రహం లభిస్తుంది. శని అనుగ్రహం ఉంటే సొంత ఇంటి కల సాకారం అవుతుంది. ఇంటి బాల్కని లేదా ఆరుబయట పక్షిగూటిని ఏర్పాటు చేసి అందులో నివసించేందుకు పక్షులు చేరితే వాటికి గింజలు వేయడం, నీళ్లు పెట్టడం వల్ల కూడా సొంత ఇల్లు చేకూరుతుంది.


Tags

Related News

Navaratri 2025: నవరాత్రి 6వ రోజు.. లలితా దేవిని ఏ విధంగా పూజించాలో తెలుసా ?

Bathukamma 2025: వేపకాయల బతుకమ్మ.. ఆ పేరు వెనక కథ, సమర్పించాల్సిన నైవేద్యం ఏంటి ?

Navratri 2025: దృష్టశక్తులు తొలగిపోవాలంటే.. నవరాత్రి సమయంలో ఇలా చేయండి !

Bastar Dussehra Festival: అక్కడ 75 రోజుల పాటు దసరా ఉత్సవాలు.. ప్రాముఖ్యత ఇదే!

Navratri Day 5: నవరాత్రుల్లో 5వ రోజు అమ్మవారిని.. ఏ విధంగా పూజించాలి ?

Bathukamma: అలిగిన బతుకమ్మ అనే పేరు ఎలా వచ్చింది ? ఈ రోజు నైవేద్యం ఎందుకు సమర్పించరు ?

Navratri Day-4: నవరాత్రి నాల్గవ రోజు.. అమ్మవారిని ఎలా పూజించాలి ?

Bathukamma 2025: ఐదో రోజు అట్ల బతుకమ్మ.. అట్లు నైవేద్యంగా పెట్టడం వెనక ఉన్న కారణం ఏంటి ?

Big Stories

×