BigTV English

Blue Moon: రాఖీపండగ రోజు ఆకాశంలో అద్భుతం.. ఈ రాశుల వారికి ధనలాభం

Blue Moon: రాఖీపండగ రోజు ఆకాశంలో అద్భుతం.. ఈ రాశుల వారికి ధనలాభం

Blue Moon: రాఖీ పండగను ఆగస్టు 19వ తేదీన జరుపుకోనున్నాం. ఈ రోజు ఆకాశంలో అద్భుత దృశ్యం కనిపించనుంది. అన్నాచెల్లెల్లు, అక్కా తమ్ముళ్ల మధ్య ఉండే అపురూపమైన ప్రేమకుగా గుర్తు రాఖీ పండగను జరుపుకుంటాము. అదే సమయంలో రాఖీ పండగ రోజు అద్భుత దృశ్యం ఆవిష్కృతం కానుంది. ఆకాశంలో బ్లూమూన్ కనిపించబోతోంది. ఈ బ్లూమూన్ మూడు రోజుల పాటు కొనసాగుతుంది. బ్లూ మూన్ శని రాశిలో ఉంటాడు. అదే సమయంలో రాఖీ పండగ రోజున రవియోగం, సర్వార్థ సిద్ధియోగం, శోభన యోగం, శ్రావణ నక్షత్రాల కలయిక కూడా జరగనుంది.


అటువంటి పరిస్థితిలో ఈ సారి రాఖీ పండగ ప్రత్యేకమైందిగా మారనుంది. రాఖీ పండగ నాడు గ్రహాల సంచారం, శుభ యోగాలు ఏర్పడడం వల్ల వల్ల కొన్ని రాశుల వారికి శుభం కలుగుతుంది. అది ఏ రాశులకో ఇప్పుడు తెలుసుకుందాం.

బ్లూమూన్ అంటే ?
చంద్రుడు భూమికి దగ్గరగా ఉన్నప్పుడు సూపర్‌ మూన్ లేదా బ్లూమూన్ అని పిలుస్తారు. ఈ సమయంలో చంద్రుడు చాలా పెద్దదిగా, ప్రకాశవంతంగా కనిపిస్తాడు. కొంతమంది దీనిని సూపర్ మూన్ అని కూడా పిలుస్తారు. ఇది రెండు రోజుల పాటు ప్రకాశవంతంగా కనిపించనుంది. మూడవ రోజు నుంచి చంద్రుడి పరిమాణం తగ్గడం ప్రారంభమవుతుంది. సూపర్ మూన్ మూడు నుంచి నాలుగు నెలలకు ఒకసారి సంభవిస్తుంది. అయితే ఇప్పుడు కనిపించే బ్లూ మూన్ మాత్రం రెండు నుంచి మూడు సంవత్సరాలకొకసారి వస్తుంది.


ఆగస్ట్ 19 వ తేదీన సాయంత్రం 06:56 గంటలకు చంద్రోదయం జరుగుతుంది. మరుసటి రోజు ఉదయం చంద్రుడు అస్తమించనున్నాడు. రాత్రి 11:55 గంటలకు చంద్రుడు ఉచ్ఛస్థితిలో ఉండనున్నాడు. ఈ రోజున చంద్రుడు కూడా మకరం నుంచి కుంభం వరకు ప్రయాణాన్ని పూర్తి చేస్తాడు.

రాఖీ పండగ రోజు అద్భుతమైన యాదృచ్ఛికం..
ఈ ఏడాది రాఖీ పండగ రోజున శశి రాజయోగం ఏర్పడనుంది. బుధాదిత్య రాజయోగం, లక్ష్మీనారాయణ రాజయోగం, విశ్వ రాజయోగం ఏర్పాటు అద్భుతంగా జరగనుంది. గ్రహాల ప్రత్యేక కలయికను ఈ రోజు మరింత ప్రత్యేకమైందిగా చేస్తుంది. రాఖీ పండగ రోజు కొన్ని రాశుల వారికి అదృష్టంగా మారుతుంది.

రాఖీ పండగ రోజు ఆరు గ్రహాల జాతకులు బ్లూమూన్, శుభ యోగాలు, గ్రహ కదలిక వల్ల అద్భుతమైన ప్రయోజనాలు పొందనున్నారు. సింహం, ధనస్సు, మకరం, కుంభ, మీన రాశుల వారికి ఈ రోజు పవిత్రమైందిగా పరిగణించబడుతుంది. వీరికి అనుకోని ధనలాభం కూడా కలిగే అవకాశం ఉంటుంది, కొందరికి ప్రమోషన్ కూడా వచ్చే అవకాశం ఉంది. అంతే కాకుండా మరి కొందరి జీతం కూడా పెరుగుతుంది. కుటుంబంలోకి అతిథులు కూడా వస్తారు. సంతోషకరమైన వాతావరణం ఉండే అవకాశం ఉంది.

Related News

Navratri Day-2: నవరాత్రి రెండో రోజు.. అమ్మవారిని ఎలా పూజించాలి ?

Navaratri 2025: నవరాత్రుల సమయంలో.. ఇలా చేస్తే పట్టిందల్లా బంగారమే !

Bathukamma 2025: మూడో రోజు బతుకమ్మ.. ముద్దపప్పు నైవేద్యంగా పెట్టడం వెనక ఇంత కథ ఉందా ?

Bathukamma Festival 2025: 9 రోజుల బతుకమ్మ.. ఏ రోజు ఏ నైవేద్యం పెడతారు ?

Yaksha questions: యక్ష ప్రశ్నలు అంటే ఏమిటి? ఎందుకు అంత ప్రాధాన్యం

Engili Pula Bathukamma: ఎంగిలి పూల బతుకమ్మ.. సమర్పించే నైవేద్యం, ప్రత్యేకత ఏంటో తెలుసా ?

Bathukamma 2025: ఎంగిలి పూల బతుకమ్మ.. ఇంతకీ ఈ పేరు ఎలా వచ్చిందో తెలుసా ?

Amavasya 2025: ఆదివారం అమావాస్య.. సాయంత్రం లోపు ఇలా చేయకుంటే అష్టకష్టాలు

Big Stories

×