Big Stories

Brahmotsavam:మంగళగిరిలో బ్రహ్మోత్సవం

Brahmotsavam:మంగళగిరి శ్రీ పానకాల లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు మార్చి 7వ తేదీ వరకు జరుగనున్నాయి. స్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రత్యేక పాల్గుణ శుద్ధ షష్టి నుంచి బహుళ విధియ వరకు 12 రోజుల పాటు వైభవంగా జరుగుతాయి. లోక కళ్యాణార్థం దిగువ సన్నిధిలో బ్రహ్మోత్సవాలు నిర్వహించడం గత కొన్నేళ్లుగా ఆనవాయితీగా వస్తోంది. పెండ్లి కుమారుని ఉత్సవంతో ఆదివారం స్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి.

- Advertisement -

27వ తేదీన రాత్రి 8 గంటలకు బ్రహ్మోత్సవాల్లో అతి ప్రధాన ఘట్టమైన ధ్వజారోహణం, 28న హనుమంత వాహనం, మార్చి 1వ తేదీన రాజాధిరాజ వాహనం, 2వ తేదీన రాలి వాహనం, 3వ తేదీన సింహ వాహనం, 4వ తేదీ ఉదయం 9 గంటలకు హంస వాహనం, అదే రోజు రాత్రి 7 గంటలకు గజవాహనం, 5వ తేదీ ఉదయం 9గంటలకు కల్పవృక్ష వాహనం, అదే రోజు రాత్రి 7 గంటలకు పొన్న వాహనం, 6వ తేదీ 9 గంటలకు ఆ శివ వాహనం అదే రోజు రాత్రి 12 గంటలకు శ్రీ స్వామివారి కల్యాణ మహోత్సవం నిర్వహిస్తారు. ఏడో తేదీ ఉదయం 6 గంటలకు బంగారుగరుడోత్సవం అదే రోజు మధ్యాహ్నం 3గంటలకు శ్రీవారి దివ్య రథోత్సవం నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేయనున్న ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకోనున్నాయి.

- Advertisement -

దేశంలో ఎన్నో మిస్టరీలు ఉన్న ఆలయాల్లో మంగళగిరి పానకాల లక్ష్మీనరసింహస్వామి ఆలయం. చిన్న అన్నం ముద్దో చాక్లెట్టూపడితే నిమిషాల్లో ఈగలు,దోమలు వచ్చిచేరుకుంటాయి. కాని మంగళగిరి గుట్టపై బెల్లంపానకం డ్రమ్ముల కొద్దీ వస్తూ వుంటుంది. స్వామి వారికి నిత్యం నైవేద్యంగా పానకం సమర్పిస్తూవుంటారు. కానీ భూతద్దంపెట్టి వెతికినా కూడా ఎక్కడా చిన్నచీమకూడా కనిపించదు. ఇదంతా స్వామివారి మహిమేగా భక్తులు భావిస్తుంటారు. స్వామి వారి విగ్రహం కవచం కప్పినట్లుగా ఉంటుంది. ఎందుకంటే స్వామి ఉగ్రరూపం చూసి తట్టుకోలేం. మిగతా నరసింహుని క్షేత్రాల్లో మొత్తం శరీరం కనిపిస్తుంది. కాని మంగళగిరిలో మాత్రం ప్రత్యేకమైన రూపం ఉంటుంది.

Alcohol:ఏడాదికోసారి మద్యం పంచే ఆలయం ఎక్కడుంది ?

Kedarnath Temple:ఏప్రిల్ లో తెరుచుకోనున్న కేథార్ నాథ్ తలుపులు

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News