Chanakya niti: వ్యక్తి తనలోని ఐదు లక్షణాలను వదిలేస్తే ఆ వ్యక్తికి జీవితంలో తిరుగే ఉండదట. అయితే ఎలాంటి లక్షణాలు వదిలేయాలి.. ఎలాంటి లక్షణాలు అలవర్చుకోవాలి అనే ఆసక్తికర విషయాలు చాణక్య నీతిలో ఉన్నాయంటున్నారు. ఆ లక్షణాలేంటి..? ఇప్పుడు ఈ కథనంలో తెలుసుకుందాం.
ఎవరైతే జీవితంలో విజేతలుగా నిలవాలనుకుంటారో అలాంటి వారు ఐదు లక్షణాలను వదిలేయాని చాణక్యుడు సూచించారు. ఆ ఐదు లక్షణాలేంటి ఇప్పుడు తెలుసుకుందాం.
అందరినీ సంతృప్తి పరచడం: ఒక వ్యక్తి జీవితంలో విజేతగా నిలవాలంటే ముందుగా వదులుకోవాలసిన లక్షణం ఇది. ఈ లక్షణం వదులుకున్న వెంటనే ఆ వ్యక్తి జీవితంలో విజయానికి దారులు తెరుచుకున్నట్టే అని చాణక్యుడు చెప్పినట్టు తెలుస్తుంది. అందరినీ సంతృప్తి పరచడం అనేది అసాధ్యం. అసాధ్యాన్ని సుసాధ్యం చేయాలనుకోవడంతోనే మనిషి జీవితం అయిపోతుంది. కాబట్టి మిగతా విషయాలలో ఆ వ్యక్తి సక్సెస్ కాలేదు. అందుకే ఈ ఒక్క లక్షణ వదిలేస్తే తన పనేదో తాను చేసకుంటూ జీవితంలో విజేతగా నిలవొచ్చట.
ఎక్కువగా ఆలోచించడం: ఈ విషయం గురించి కూడా ఎక్కువగా ఆలోచించే వ్యక్తి జీవితంలో గెలుపు తీరాలు చేరుకోలేడు. ప్రతి విషయంలో తలదూర్చడం పదే పదే ఆ విషయం గురించే ఆలోచించడంతోనే ఉన్న సమయం అయిపోతుంది. ఇక మిగతా విషయాల మీదకు దృష్టి మళ్లదు. దీంతో ఏ విషయం గురించైనా ఎక్కువగా ఆలోచించే వ్యక్తులు ఎప్పటికీ విజేతలు కాలేరు అని చాణ్యక్యుడు చెప్పాడట.
తనను తాను కించ పరుచుకోవడం: నిన్ను నువ్వు గౌరవించుకోకపోతే.. ఈ సమాజం కూడా ఎప్పటికీ నిన్ను గైరవించదు అనేది పెద్దల నానుడి. అలాగే చాణక్యుడు కూడా చెప్పారు. తనను తాను కించ పరుచుకోవడం.. తక్కువగా చేసి ఊహించుకోవడం.. తాను ఏమీ చేయలేనని భయపడిపోవడం.. తన మీద తనకు నమ్మకం లేకపోవడం ఇలాంటి లక్షణాలు ఉన్న వ్యక్తులు కూడా ఎప్పటికీ జీవితంలో విజేతలు కాలేరట. ఎప్పుడైతే ఇన్ఫియారిటీ కాంప్లెక్స్ వదిలేస్తాడో అప్పుడే ఆ వ్యక్తి జీవితంలో పైకి వస్తాడని చాణ్యక్యుడు చెప్పాడట.
మార్పుకు భయపడటం: ఎవరైతే జీవితంలో మార్పు కోరుకోరో.. ఏదైనా మార్పు వస్తుందంటే భయంతో ఉన్నంతలో ఉండిపోవాలని జంకుతారో ఆ వ్యక్తులు కూడా జీవితంలో ఎప్పటికీ విజయాన్ని అందుకోలేరట. ఎప్పుడైతే మార్పును స్వాగతిస్తారో అప్పుడే ఆ వ్యక్తికి జీవితంలో మంచి రోజులు వస్తాయట. అక్కడి నుంచే ఆ వ్యక్తి జీవితంలో విజయానికి దారులు ఏర్పడతాయట.
గతంలోనే జీవిచడం: మారుతున్న కాలంతో పాటు తాను కూడా మారకుండా ఎవరైతే గతంలోనే జీవిస్తారో.. కాలంతో పటు పరుగెత్తగకుండా తన పరిస్థితుల దగ్గరే ఆగిపోతారో అటువంటి వారు ఎటువంటి స్థితిలో ఉన్నా జీవితంలో ఓటమి చవిచూస్తారట. భవిష్యత్తును ముందే ఊహించి అందుకు తగ్గుట్టుగా కార్యాచరణ వేసుకుని ముందుకు సాగితేనే సక్సెస్ వశమవుతుందట.
ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.
ALSO READ: మహిళలకు కేంద్రం గుడ్ న్యూస్ – వడ్డీ లేకుండా 5 లక్షల రుణం