Scheme for women: మహిళల కోసం మోడీ ప్రభుత్వం బంపర్ ఆఫర్ తీసుకొచ్చింది. వడ్డీ లేకుండా మహిళలకు ఐదు లక్షల వరకు రుణాలు ఇవ్వనుంది. అయితే ఈ రుణాలకు ఎవరు అర్హులు..? ఎలాంటి సర్టిఫికెట్స్ కావాలి..? ఎంత వరకు లోన్ వస్తుంది…? లోన్ తిరిగి ఎలా కట్టాలి..? లోన్ తీసుకున్న తర్వాత సబ్సిడీ ఏమైనా వస్తుందా..? సబ్సీడీ వస్తే ఎంత శాతం రావొచ్చు..? ఇలాంటి పూర్తి వివరాలు ఇప్పుడు ఈ కథనంలో తెలుసుకుందాం.
మహిళలకు వడ్డీ లేకుండా ఐదు లక్షల వరకు రుణం అందించనుంది కేంద్ర ప్రభుత్వం. ఈ రుణానికి దరఖాస్తు చేసుకోవడం చాలా ఈజీ అయినప్పటికీ ఈ స్కీమ్ గురించి చాలా మందికి తెలియక ఎవ్వరూ ఉపయోగించుకోవడం లేదు. మహిళా సంక్షేమమే ధ్యేయంగా కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తుంది అందులో భాగంగానే మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకోవడం చాలా ముఖ్యమని మోడీ ప్రభుత్వం బలంగా నమ్ముతుంది. అప్పుడే మన దేశం ముందుకు సాగుతుందని బావిస్తుంది. అందుకే మహిళలకు వివిధ రకాలైన నైపుణ్యాలు నేర్పించి ఉపాధి కల్పించేందుకు ఎన్నో రకాల పథకాలు ప్రవేశ పెడుతుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో నివసించే మహిళలకు ఆ పథకాలు ఎంతో అండగా ఉంటున్నాయి. అలాంటి వాటిలో ఒకటి లక్‌పతి దీదీ పథకం. ఈ పథకాన్ని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ నిర్వహిస్తోంది. రెండు కోట్ల మంది మహిళలకు లబ్ది చేకూర్చేందుకు ఈ పథకం ప్రవేశపెట్టారు. అయితే తర్వాత మూడు కోట్ల మంది మహిళలకు లబ్ది చేకూర్చాలని నిర్ణయించారు.
ఎవరు అర్హులు: ఈ పథకంలో ఐదు లక్షల లోన్ తీసుకోవాలంటే భారతీయ మహిళ అయి ఉండాలి. వయస్సు 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల వరకు ఉండాలి. అలాగే కుటుంబ సంవత్సర ఆదాయం లక్ష రూపాయలకు మించకుండా ఉండాలి. మరీ ముఖ్యంగా లోన్ తీసుకోవాలి అనుకునే మహిళ స్థానిక మహిళా డ్వాక్రా సంఘంల్లో సభ్యురాలై ఉండాలి. ఒకవేళ డ్వాక్రా గ్రూపులో సభ్యురాలు కాకపోతే ఈ లోన్ రాదు.
ఎంత లోన్ వస్తుంది: ఈ పథకంలో లక్ష రూపాయల నుంచి ఐదు లక్షల రూపాయల వరకు లోన్ వస్తుంది. అయితే కొన్ని సందర్భాలలో సగం లోన్ మాఫీ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. తీసుకున్న లోన్ నెల వారీ విడతల వారీగా చెల్లించాలి.
కావాల్సిన సర్టిఫికెట్స్: ఈ పథకంలో డబ్బులు తీసుకోవాలంటే.. కచ్చితంగా ఆధార్ కార్డు, బ్యాంకు అకౌంట్ పాస్ బుక్, రేషన్ కార్డు, కులం సర్టిఫికెట్, ఇన్‌కం సర్టిఫికెట్‌తో పాటు మహిళా డ్వాక్రా సంఘంలో సభ్యురాలిగా గుర్తింపు లెటర్ ఉండాలి.
ఎక్కడ అప్లయ్ చేయాలి: దగ్గరలోని మీ సేవలో అన్ని సర్టిఫికెట్స్‌తో అప్లయ్ చేయోచ్చు. అలాగే జిల్లా గ్రామీణాభివృద్ది శాఖ లేదా మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యాలయంలో అప్లయ్ చేసుకోవచ్చు.
అయితే ఈ లోన్‌కు సెలెక్ట్ అయిన మహిళలకు వారికి ఇష్టమైన రంగంలో ప్రభుత్వమే పూర్తిగా శిక్షణ ఇచ్చి తర్వాత వారు వ్యాపారం చేసుకోవడానికి కావాల్సిన రుణాన్ని అందిస్తుంది కేంద్ర ప్రభుత్వం.
ALSO READ: పిల్లలకు ఇలాంటి పేర్లు పెడితే జీవితాంతం కష్టాలేనట – ఆ పేర్లేంటో తెలుసా..?