BigTV English

Chidambaram temple scientific facts : చిదంబరం రహస్యం మాటకు దేవాలయానికి సంబంధమేంటి..

Chidambaram temple scientific facts : చిదంబరం రహస్యం మాటకు దేవాలయానికి సంబంధమేంటి..

Chidambaram temple scientific facts : తమిళనాడులోని చిదంబరంలో గొప్ప దేవాలయం ఉందనీ , అక్కడున్న నటరాజ విగ్రహం ప్రపంచ ప్రసిద్ధమైంది. నటరాజ విగ్రహం యొక్క కాలి బొటన వేలు, భూమి అయస్కాంత క్షేత్రానికి మధ్య బిందువు అని 8 సంవత్సరాల పరిశోధన అనంతరం సైంటిస్టులు ఒప్పుకున్నారు. ఈవిషయాన్ని తిరుమందిరం అనే గ్రంధంలో ప్రసిద్ధ తమిళ స్కాలర్ తిరుమూలర్ చెప్పారు.చిత్‌ అంటే మనస్సు. అంబళం అంటే ఆకాశం. ఆకాశానికి సంబంధించిన జ్ఞాన ప్రదేశమని అర్థం. అందుకే దీన్ని చిదాకాశం అనీ పిలుస్తారు. చిదంబరం స్వయంభూక్షేత్రం. చిదంబరం లో ఉండేది ఆకాశలింగం.


ఈ ఆలయంలో స్వామి నటరాజలా, స్పటిక లింగరూపం. రూపం లోనూ, దైవసాన్నిధ్యం అనే మూడు రకాలుగా శివుని చూడవచ్చు. ఆ మూడో రూపమే చిదంబర రహస్యం.ఈ ఆలయం ప్రపంచ అయస్కాంత క్షేత్ర మధ్య బిందువుగా ఉంది.పంచ భూతాలు అని మనం చెప్పుకునే భూమి , ఆకాశమూ , వాయువూ , నీరు , అగ్ని లో చిదంబరం ఆకాశానికి ప్రతీక అనీ , కాళహస్తి వాయువుకు ప్రతీక కంచిలోని ఏకాంబరేశ్వరుడు పృథ్వి కి ప్రతీక అనీ అంటారు. ఈ మూడు దేవాలయాలూ ఒకే రేఖాంశం మీద ఉన్నాయి . 79డిగ్రీల 41 నిముషాల రేఖాశం మీద ఉన్నాయి .
చిదంబరం దేవాలయానికి 9 ప్రవేశ ద్వారాలు ఉన్నాయి . మానవుడికి నవ రంధ్రాలు ఉంటాయి

చిదంబరం దేవాలయంలో పైన 21600 బంగారపు రేకులు తాపడం చేశారు . మానవుడు రోజుకు 21600 సార్లు గాలి పీలుస్తాడు .ఆ బంగారపు రేకులు తాపడం చేయడానికి 72000 బంగారపు మేకులు వాడారు . మన శరీరం లో ఉండే నాడులు 72000 అని ఆయుర్వేదశాస్త్రం చెబుతోది. దేవాలయంలో పొన్నాంబళం కొంచెం ఎడమవైపుకు ఉంటుంది .


పొన్నాంబళం లో 28 స్థంబాలు 28 శైవ ఆగమాలకు ప్రతీకలు – శివారాధనా పద్ధతులు . ఇవి 64 ఇంటూ 64 దూలాలను సపోర్ట్ చేస్తున్నాయి. 64 కళలు ఉన్నాయనడానికి రుజువిది. . అర్ధ మంటపం లోని 6 స్తంబాలూ 6 శాస్త్రాలకు ప్రతీకలు . పక్కన ఉన్న మంటపంలోని 18 స్తంభాలకు18 పురాణాలకి ప్రతీకలు. నటరాజు నృత్యాన్ని పాశ్చాత్య సైంటిస్ట్ లు కాస్మిక్ డాన్సు అని వర్ణించారు . నటరాజస్వామిని దర్శించుకుని బయటకు వచ్చి వెనుదిరిగి చూస్తే ఆలయ గోపురం మన వెనుకనే వస్తున్న అనుభూతి కలుగతుంది . ఏ రూపం లేకుండానే అజ్ఞానాన్ని తొలగించుకుంటూ దైవ సాన్నిథ్యాన్ని అనుభూతి చెందడమే ఈ క్షేత్ర ప్రాశస్త్యం. అదే చిదంబర రహస్యం.

Follow this link for more updates:- Bigtv

Related News

Raksha Bandhan 2025: 16 రోజుల పాటు రాఖీ తీయకూడదట ! హిందూ సాంప్రదాయం ఏం చెబుతోందంటే ?

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలను ఎండకుండా చూసుకోండి, అలా ఎండితే లక్ష్మీదేవి కరుణించదు

Raksha Bandhan 2025: రాఖీ పళ్లెంలో.. ఈ వస్తువులు తప్పకుండా ఉండాలట !

Big Stories

×