Big Stories

Chilukur : వీసాగాడ్ చిలుకూరులో ప్రదక్షణలు మళ్లీ మొదలు

Chilukur : కరోనా కారణంతో చిలుకూరులో ఆగిపోయిన ప్రదక్షణ సౌకర్యం మళ్లీ పునః ప్రారంభమైంది. ఎప్పటిలాగానే భక్తులు తమ మొక్కులు చెల్లించుకునే అవకాశం కల్పించారు. రవాణా సౌకర్యాలు కూడా చక్కగా అందుబాటులో ఉండటం, వల్ల బాలాజి ఆలయాన్ని దర్శించటానికి ప్రతిరోజూ వేలల్లో భక్తులు వస్తుంటారు . ప్రతి రోజూ 20-30 వేలమంది భక్తులు , సెలవుదినాలలో 30-50 వేలమంది భక్తులు వేంకటేశ్వరుని దర్శిస్తుంటారు. విఐపి దర్శనాలు , టిక్కెట్లు , హుండీలు లేని దేవాలయాలయంగా చిలుకూరు ఆలయం ఒక్కటే. .

- Advertisement -

ఒకే ప్రాంగణంలో వెంకటేశ్వర స్వామి, మరోవైపు శివుడు పూజలందుకోవటం ఈ ఆలయ విశిష్టత. ఈ ఆలయంలో 108 ప్రదక్షణలు ప్రసిద్ధి పొందినది. కలియుగ దైవం, శ్రీ వెంకటేశ్వర స్వామి మూడు చోట్ల ప్రత్యక్షమైనట్లు పురాణాలు చెబుతున్నాయి . తిరుమలలో వెలసిన శ్రీ వేంకటేశ్వరుడు , ద్వారాక తిరుమల చిన్న వెంకటేశ్వర స్వామి , చిలుకూరు బాలాజీ గా మూడుచోట్లా ప్రసిద్ధి చెందారు.
చిలుకూరు గుడికి 500 ఏళ్ళ సుదీర్ఘ చరిత్ర ఉంది.

- Advertisement -

వెంకటేశ్వర స్వామి కోరిన కోర్కెలను తీర్చే ,కలియుగ వైకుంఠుడిగా ప్రసిద్ధి. చిలుకూరు బాలాజీ ఆలయాన్ని మొదటసారి దర్శించి 11 ప్రదక్షిణలు చేసి కోర్కెలను కోరుకోవటం , అవి తీరిన తర్వాత 108 ప్రదక్షణలు చేసి మొక్కులను చెల్లించుకొనే పద్దతి ఇక్కడ ఆవవాయితీగా వస్తుంది. . చిలుకూరు బాలాజీ ఆలయానికి వీసా గాడ్ అని కూడా పేరు . కొన్నేళ్ల క్రితం పై చదువులకు, ఇతర దేశాలకు వెళ్లి చదువుకునే విద్యార్థులకు, వీసా దొరకక ఇబ్బందిపడేవారు . చిలుకూరి బాలాజీ విశిష్టత తెలుసుకుని ఎక్కువమంది త్వరగా వీసా రావాలని కోరుకోవటం , ఆకోరిక నెరవేరటం వెంటనే జరిగిపోయాయి. దాంతో ఇక్కడ స్వామి వారికి వీసా దేవుడిగా పేరొచ్చింది .

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News