E-Paper
Advertisement

Ayodhya Temple : టేకు తలుపులు.. బంగారు పూత.. శరవేగంగా రామాలయ నిర్మాణం..

Ayodhya Temple : టేకు తలుపులు.. బంగారు పూత.. శరవేగంగా రామాలయ నిర్మాణం..
Advertisement

Ayodhya Temple : అయోధ్య రామాలయ నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. స్వామివారి ఆలయాన్ని సర్వాంగ సుందరంగా సిద్ధం చేస్తున్నారు. స్వామివారి సింహాసనం, తలుపులు, శిఖరానికి బంగారు పూత పూయడానికి ప్లాన్ చేస్తున్నారు.

రాంలాలా విగ్రహం తయారీ పనులు 80 శాతం పనులు పూర్తి అయ్యాయి. మిగిలిన 20 శాతం పనులు చివరి దశలో ఉన్నాయి. అవి కూడా చివరి దశకు వచ్చాయని ఉడిపికి చెందిన రామమందిర్ ట్రస్ట్ సభ్యుడు, పీఠాధీశ్వర్ విశ్వతీర్థ ప్రపన్నాచార్య మహరాజ్ తెలిపారు. ఆలయ స్తంభాలపై పలు విగ్రహాలు చెక్కుతున్నారు. ఒక్కో స్తంభంపై 6000 విగ్రహాలు ఉంటాయని రామమందిర్ ట్రస్ట్ సభ్యుడు అనిల్ మిశ్రా చెప్పారు.

Advertisement

ఆలయంలో మొత్తం 42 తలుపులు ఉంటాయి. అందులో 18 తలుపులు ఆలయ గర్భగుడి సమీపంలో ఉంటాయి. వాటన్నిటికీ బంగారు పూత వేయనున్నారని రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు క్యాంపు కార్యాలయ ఇన్‌చార్జి ప్రకాష్ గుప్తా తెలిపారు. ఆలయ నిర్మాణానికి విరాళాల రూపంలో భక్తులు.. బంగారం, వెండి ఇస్తున్నారు. అటు.. శాస్త్రవేత్తల సలహా మేరకు మహారాష్ట్రకు చెందిన టేకు కలపతో తలుపులు తయారు చేస్తున్నారు.

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×