BigTV English

Dhana Lakshmi : మీ ఇంట్లో ట్యాప్ లీకవుతుందా… అయితే ధన నష్టమే…

Dhana Lakshmi : మీ ఇంట్లో ట్యాప్ లీకవుతుందా… అయితే ధన నష్టమే…

Dhana Lakshmi : భారతీయ ఆచార వ్యవహారాల్లో వాస్తుకి ఎంతో ప్రాధాన్యం ఉంది. . కేవ‌లం ఇంటికి కాదు, అందులో ఉండే బాత్‌రూమ్‌ల‌కు కూడా వాస్తు వ‌ర్తిస్తుంది. తెలియకుండా , అజ్ఞానంతో చేసే పనులు ఇంట్లో వాళ్లకి నష్టం కలిగిస్తాయి.లేదా ఆ ఇంట్లో ఉంటున్న వారంద‌రికీ అనారోగ్యంగా ఉండ‌డ‌మో లేదంటే డ‌బ్బు ఎప్పుడూ వ‌చ్చింది వ‌చ్చిన‌ట్టు ఖ‌ర్చ‌వ‌డ‌మో జ‌రుగుతూ ఉంటుంది.


బాత్‌రూంలో ఉండే వాస్తు దోషం పోవాలంటే అందులో ఎప్పుడూ ఒక నీలం రంగు బ‌కెట్‌ను ఉంచాలి. ఎందుకంటే ఈ రంగుకు వాస్తు శాస్త్రంలో బాగా ప్రాముఖ్య‌త ఉంది. దీంతో ఈ రంగు ఉన్న బ‌కెట్‌ను బాత్‌రూంలో ఉంచితే అప్పుడు ఇంట్లో ఉన్న నెగెటివ్ శ‌క్తి పోతుంది. డ‌బ్బు వృథాగా ఖ‌ర్చు కాదు. అయితే ఆ బ‌కెట్‌లో ఎల్ల‌ప్పుడూ నిండుగా నీటిని నింపి మాత్రం పెట్టాలి. దీంతో పాజిటివ్ శ‌క్తి మ‌రింత పెరుగుతుంది.

బాత్‌రూం డోర్‌కు ఎదురుగా లోప‌ల అద్దాన్ని ఉంచరాదు. అలా ఉంచితే ఇంట్లో ఉండే నెగెటివ్ శ‌క్తి బాత్‌రూం లోప‌లికి వెళ్లి ఎదురుగా ఉన్న అద్దం నుంచి ప్ర‌తిబింబించి మ‌ళ్లీ ఇంట్లోకే ఆ నెగెటివ్ శ‌క్తి వ‌స్తుంది. బాత్‌రూంను వాడ‌గానే వెంట‌నే డోర్‌ను క్లోజ్ చేయాలి. డోర్‌ను ఎల్ల‌ప్పుడూ క్లోజ్ చేసే ఉంచాలి. లేక‌పోతే బాత్‌రూంలో ఉండే నెగెటివ్ ఎన‌ర్జీ ఇంట్లోకి వ‌స్తుంది. బాత్‌రూంలోనే కాదు, ఇంట్లో ఇత‌ర ప్ర‌దేశాల్లో ట్యాప్ ఎక్క‌డ ఉన్నా అక్కడ నుంచి నీళ్లు లీక్ కాకుండా చూసుకోవాలి. లేదంటే నీటి లీక్ లాగానే డ‌బ్బు కూడా వృథాగా ఖ‌ర్చ‌వుతుంది. అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయి


ట్యాప్‌ను అలాగే తిప్పి ఉంచి నీటిని వేస్ట్ చేయ‌రాదు. డ‌బ్బులు వృథాగా ఖ‌ర్చ‌వుతాయి. ఆర్థిక స‌మ‌స్య‌లు వ‌స్తాయి. ఇంట్లో కుటుంబ స‌భ్యుల‌కు ఆరోగ్యం బాగుండ‌దు. బాత్‌రూంను ఎల్ల‌ప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. లేదంటే అందులో నెగెటివ్ ఎన‌ర్జీ పెరిగిపోతుంది. అలా పెరిగిన త‌రుణంలో అది ఇంట్లోకి ప్ర‌వేశించి ఆర్థిక స‌మ‌స్య‌లు వస్తాయి. ఇంట్లో వాస్తు దోషం ఉందని అనుకుంటే..ఒక గ్లాసు ఉప్పు తీసుకొని దాన్న బాత్ రూంలో ఉంచాలి. అలా ఉంచితే ఇంట్లో ఉన్న నెగెటివ్ ఎనర్జీ పోయి.. పాజిటివ్ ఎనర్జీ వస్తుందట. అంతే కాదు.. ఎన్నో ఆటంకాలు తొలిగిపోతాయి

Tags

Related News

Vastu Tips: వాస్తు ప్రకారం.. ఇంట్లో డబ్బు ఎక్కడ దాచాలి ?

Vastu Tips:ఇంట్లో నుంచి నెగిటివ్ ఎనర్జీ పోయి..సంతోషంగా ఉండాలంటే ?

Raksha Bandhan 2025: 16 రోజుల పాటు రాఖీ తీయకూడదట ! హిందూ సాంప్రదాయం ఏం చెబుతోందంటే ?

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Big Stories

×