
Diwali Festival 2022 : ఎప్పుడూ లేని విధంగా ఈసారి దీపావళి పండుగ తేదీపై సస్పెన్స్ నెలకొంది. కొంతమంది పండితులు సోమవారం అంటే 24న జరుపుకోవాలని సూచిస్తున్నారు. రాత్రంతా అమావాస్య గడియలు ఉన్నాయని చెబుతున్నారు. తిథుల ప్రకారం 24 ఉదయం వరకు మాత్రమే చతుర్దశి ఉంది.
దీపావళి ముందు రోజు నరకచతుర్ధశి జరుపుకుని తర్వాత పండుగ చేసుకోవడం ఆనవాయితీ. అయితే ఈసారి సూర్యగ్రహణం కూడా దీపావళి వెంటే వచ్చింది. దీపావళి నాడు పూజలు చేయడం భావ్యం కాదన్నది మరికొందరు వాదన.
అక్టోబరు 25 సాయంత్రం 5.11 గంటల నుంచి 6.27 గంటల వరకు సూర్య గ్రహణం ఉంటుందిట. అమావాస్య వెళ్లిపోయి పాడ్యమి వస్తుందని.. దీని మూలంగా అమావాస్య ఉండదు. అందుకే అక్టోబర్ 24న దీపావళి పండుగ జరుపుకోవాలి. సోమవారమే పండుగ చేసుకోవాలి. పండితులు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నారు.
24న ఉదయం వరకు మాత్రమే చతుర్దశి ఉంది. ఆ తర్వాత వచ్చేది అమావాస్య కాబట్టే వివాదానికి లేకుండా సోమవారమే దీపావళి చేసుకుంటే మంచిదని సెలవిస్తున్నారు. దీపావళి నాడు ముగ్గులు వేసినప్పుడు నలుపు రంగుని కానీ బ్రౌన్ కలర్ ని కానీ ఉపయోగించకండి. దీపావళి నాడు చాలామంది బహుమతులను ఇస్తుంటారు. ముఖ్యంగా లెదర్ వస్తువులను ఇవ్వకూడదు.