Bad Karma: ఆర్థికంగా వెనకబడిపోయారా..? ఏ పని చేసినా కలిసిరావడం లేదా..? మీకున్న చెడు కర్మలు తొలగిపోవాలా..? లక్షల్లో సంపాదన..? కోట్లల్లో ఆదాయం రావాలా..? అయతే శాస్త్రం ప్రకారం కొన్ని దానాలు చేయడం వల్ల మీ కర్మలు తీరిపోయి మీ జీవతం సుఖవంతంగా మారిపోతుందని పరిహారశాస్త్రంలో ఉన్నట్టు పండితులు చెప్తున్నారు. ఆ దానాలు ఏంటో ఇప్పుడు ఈ కథనంలో తెలుసుకుందాం.
పరిహారశాస్త్రం ప్రకారం కొన్ని దానాలు చేస్తే అన్ని రకాలుగా కలిసి వస్తుందట. జీవితంలో దేనికి లోటు లేకుండా జీవిస్తారట. ఆ దానాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
బియ్యం: చేసిన పాపాలు తీరిపోయి.. జీవితంలో మంచి రోజులు రావాలంటే బియ్యాన్ని దానం చేయాలని సూచిస్తున్నారు పండితులు. బియ్యం దానం చేస్తే మీకున్న పాప కర్మలు తొలగిపోయి మంచి కర్మలు వస్తాయట.
వెండి: ఎంత సంపాదించిన ఎన్ని కోట్ల ఆస్థిని వెనకేసుకున్న చాలా మందికి మనఃశాంతి అనేది ఉండదట. మరి అలాంటి వారు కాస్త వెండిని దానం చేస్తే ఎనలేని మనఃశాంతి లభిస్తుందట. మనసులోని వ్యథ దూరమవుతుందట.
బంగారం: సువర్ణ దానం చేస్తే సువర్ణ లోకం సిద్దిస్తుందట లోకోక్తి. సమస్త దోషాలు తొలగిపోవాలంటే కాసింత బంగారం దానం చేయాలని పరిహారశాస్త్రంలో ఉందట.
పండ్లు: పిల్లలకు బుద్ది మాంద్యం ఉంటుంది. అలాంటి వాళ్లు పండ్లను దానం చేయడం వల్ల పిల్లలకు మంచి బుద్ది, సిద్ది కలుగుతాయట. అలాగే చదువులో వెనకబడ్డ పిల్లలు కూడా క్లెవర్ స్టూడెంట్స్ అవుతారట.
పెరుగు: ఇంద్రియ నిగ్రహం కావాలని కోరుకునే వారు పెరుగును దానం చేయాలని సూచిస్తున్నారు పండితులు. చాలా మంది జప, తపాలు చేసుకునే వారికి ఇంద్రియ నిగ్రహం అంత ఈజీగా జరగదు. అలాంటి వారు పెరుగును దానం చేయాలట.
నెయ్యి: ఎప్పుడూ రోగాల బారిన పడుతూ బాధపడుతున్న వారు నెయ్యిని దానం చేస్తే రోగాలు పోతాయని చెప్తున్నారు పండితులు.
పాలు: నిద్రలేమితో బాధపడేవారు పాలను దానం చేయాలని సూచిస్తున్నారు. దీంతో మీకు సమైన సమయంలో కంటి నిద్ర పడుతుందట. కుంభకర్ణుడిలా గాఢమైన నిద్రపోతారట.
తేనే: ఈ మధ్య కాలంలో పిల్లలు పుట్టక చాలా మంది దంపతులు బాధపడుతున్నారు. ఎన్నో పూజలు, వ్రతాలు చేసినా సంతానం కలగని దంపతులు ఒక్కసారి తేనేను దానం చేస్తే సంతాన దోషాలు ఏమైనా ఉంటే పోతాయని సూచిస్తున్నారు పండితులు.
ఉసిరికాయలు: ఎంత చదివినా గుర్తు లేని విద్యార్థులు కానీ మరెవరైనా జ్ఞాపకశక్తి తక్కువగా ఉన్న వాళ్లు ఉసిరికాయలు దానం చేయాలని దీంతో వారి జ్ఞాపకశక్తి బాగా పెరుగుతుందని చెప్తున్నారు పండితులు.
కొబ్బరికాయ: ఏదైనా పని అనుకుంటే ఆటంకాలు ఏర్పడుతూ అనుకున్న కార్యం నెరవేరకుండా ఆగిపోయే వారు.. టెంకాయను దానం చేయాలని పండితులు సూచిస్తున్నారు. కొబ్బరికాయను దానం చేసి మీ పని మొదలుపెడితే అనుకున్న కార్యం నెరవేరుతుందట.
ఇంకా గోవులను దానం చేస్తే మొండి బాకీలు తీరుతాయట. భూమిని దానం చేస్తే బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుందట. వస్త్రాలు దానం చేస్తే ఆయుష్షు పెరుగుతుందట. అన్నదానం చేస్తే పేదరికం పోతుంది. అయితే ఇవన్నీ శాస్త్రం తెలిసిన పండితులను అడిగి వారి సూచనల మేరకు చేసుకోవాలని సూచిస్తున్నారు.
ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.
ALSO READ: సైన్స్ ను సవాలు చేసిన హిందుత్వం – అసలు విషయం తెలిస్తే షాక్ అవుతారు