BigTV English

Mokshagna: నందమూరి మోక్షజ్ఞ కొత్త లుక్.. ఇలా మారిపోయాడేంటి ?

Mokshagna: నందమూరి మోక్షజ్ఞ కొత్త లుక్.. ఇలా మారిపోయాడేంటి ?

Mokshagna: నందమూరి మోక్షజ్ఞ (Nandamuri Mokshagna) సినిమాల్లోకి రాకముందే భారీ హైప్ తెచ్చుకున్న పేరు. ఎందుకంటే నందమూరి ఫ్యామిలీ నుండి ఎవరైనా హీరో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నారు అంటే.. వారు సినిమాల్లోకి రాకముందే భారీ హైప్ తెచ్చుకుంటారు. ఎందుకంటే వారి ఇంటి పేరుకు ఉన్న క్రేజ్ అలాంటిది. నందమూరి అనే ఇంటి పేరు ఉంటే చాలు ఎవరైనా సరే వారిని ఆకాశానికి ఎత్తేస్తారు అభిమానులు. అయితే అలాంటి నందమూరి ఫ్యామిలీ నుండి సినిమాలు,రాజకీయాలు అంటూ సక్సెస్ఫుల్గా తన జీవితంలో రాణిస్తున్న బాలకృష్ణ.. తన కొడుకును ఇండస్ట్రీలోకి తీసుకు రాబోతున్నారు అంటే అభిమానుల్లో మరెన్ని అంచనాలు ఉంటాయో చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం నందమూరి ఫ్యామిలీలో ఎక్కువగా వినిపించే పేరు బాలకృష్ణ (Balakrishna), జూనియర్ ఎన్టీఆర్(Jr NTR) ..


మోక్షజ్ఞ ఎంట్రీ కోసం అభిమానుల ఎదురుచూపు..

వీరిలో నందమూరి ఫ్యామిలీకి పెద్దన్నలా ఉన్న బాలకృష్ణ సపోర్టు కోసం చాలామంది ఎదురు చూస్తారు. అలా బాలకృష్ణ కంటే పెద్దవాళ్లు నందమూరి ఫ్యామిలీలో ఉన్నారు. కానీ ఈయన ఓవైపు రాజకీయాల్లో.. మరోవైపు సినిమాల్లో సక్సెస్ఫుల్ గా రాణిస్తున్నారు. కాబట్టి ఈయన పేరే ఎక్కువగా వైరల్ అవుతోంది. అయితే అలాంటి బాలకృష్ణ వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్న మోక్షజ్ఞ సినిమాపై ఇండస్ట్రీలో ఎన్నో అంచనాలు ఉన్నాయి. మోక్షజ్ఞ మొదటి సినిమా అంటే మరో లెవల్ లో ఉంటుందని అందరూ అనుకున్నారు. ఈ నేపథ్యంలోనే మోక్షజ్ఞ మొదటి సినిమా బోయపాటి శ్రీను (Boyapati Sreenu) డైరెక్షన్లో అని, వివి వినాయక్ (VV Vinayak) డైరెక్షన్లో అని.. లేదు లేదు నందమూరి బాలకృష్ణనే స్వయంగా దర్శకత్వం వహిస్తారు అంటూ ఎన్నో రూమర్లు వినిపించాయి.


ప్రశాంత్ వర్మ కోసం లుక్ మార్చేసిన మోక్షజ్ఞ..

కానీ చివరికి హనుమాన్ (Hanuman)మూవీ తీసిన ప్రశాంత్ వర్మ (Prashanth Varma) డైరెక్షన్లో మోక్షజ్ఞ మొదటి మూవీ ఉండబోతున్నట్టు అఫీషియల్ గా క్లారిటీ ఇచ్చేశారు. ఇక మోక్షజ్ఞ ప్రశాంత్ వర్మ సినిమా కోసం తన లుక్ మొత్తాన్ని చేంజ్ చేసుకున్నారు. ఒకప్పుడు బొద్దుగా ఉండే మోక్షజ్ఞ సన్నబడి హీరో మెటీరియల్ గా మారిపోయారు. ఈయన లుక్,కటౌట్ కి చాలామంది ఫిదా అయ్యారు కూడా. అయితే అలాంటి మోక్షజ్ఞ మొదటి సినిమాకు సంబంధించి ఇప్పటివరకు మరో అప్డేట్ అయితే ఇవ్వలేదు.

మరో కొత్త లుక్ లో కనిపించిన మోక్షజ్ఞ..

మోక్షజ్ఞ బర్త్ డే రోజు వచ్చిన అప్డేట్ తప్ప మరో అప్డేట్ అయితే లేదు. అయితే చాలా రోజులకి నందమూరి మోక్షజ్ఞకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. మోక్షజ్ఞ తాజాగా కొత్త లుక్ లో అభిమానులకి దర్శనమిచ్చారు. రీసెంట్ గా ఓ పెళ్లికి హాజరైన మోక్షజ్ఞ.. ఆ పెళ్లిలో చాలా సన్నబడి కనిపించారు. మోక్షజ్ఞ లుక్ చూసిన చాలా మంది నెటిజన్లు ఫిదా అవుతున్నారు. మోక్షజ్ఞ మొదటి సినిమా గురించి ఇండస్ట్రీలో పలు రూమర్లు వినిపిస్తున్నాయి. ప్రశాంత్ వర్మ డైరెక్షన్లోనే ఈయన మొదటి సినిమా ఉంటుందని అఫీషియల్ గా చెప్పినప్పటికీ.. ఆ సినిమా పట్టాలెక్కడం లేదని తెలుస్తోంది.

కొడుకు బాధ్యతను బాలయ్య స్వీకరించారా..?

దాంతో కొడుకు మొదటి సినిమాకి తానే దర్శకత్వం వహించాలని బాలకృష్ణ ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. త్వరలోనే బాలకృష్ణ దర్శకత్వంలో మోక్షజ్ఞ మొదటి సినిమా వస్తుందని, సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.మరి చూడాలి మోక్షజ్ఞ మొదటి సినిమా ప్రశాంత్ వర్మ డైరెక్షన్లోనా.. లేక బాలకృష్ణ డైరెక్షన్లోనా.. అనేది ముందు ముందు తెలుస్తుంది.

also read: War 2 Collections: దారుణంగా పడిపోయిన వార్ 2 కలెక్షన్లు… భారీ నష్టాలు తప్పేలా లేదు

Related News

Film industry: సినీ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ నటుడు కన్నుమూత!

Raghava lawrance : మానవత్వాన్ని చాటుకున్న హీరో.. కన్నీళ్లు తెప్పిస్తున్న పోస్ట్..

Coolie collections : వీకెండ్ దారుణంగా పడిపోయిన కూలీ కలెక్షన్స్.. ఇలా అయితే కష్టమే లోకీ..!

AA22xA6 Update : అల్లు అర్జున్ ఎంట్రీ సీన్‌కు అట్లీ మాస్టర్ ప్లాన్.. వందల మందితో..

Rahul Sipligunj: సైలెంట్ గా ఎంగేజ్మెంట్ చేసుకున్న రాహుల్.. అమ్మాయి ఎవరంటే..?

Big Stories

×