Devotional Tips: ఎన్ని పూజలు చేసినా ఫలించకపోతే.. ఎన్ని వ్రతాలు నోమినా ఫలితం ఇవ్వకపోతే చిన్న రెమెడీస్ పాటించమని పండితులు చెప్తున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం
మేష రాశి: ఈ రాశి జాతకులు కచ్చితంగా సూర్యుడిని పూజించాలి. ఆదిత్యుని ఆశ్శీస్సులు ఉంటేనే ఈ మేష రాశి వారికి అన్ని శుభాలే జరుగుతాయని పండితులు చెప్తున్నారు.
వృషభ రాశి: ఈ రాశిలో పుట్టిన వ్యక్తులు చంద్రుడిని పూజించాలట. చంద్రుడు శాంతి కారకుడు మీరు చంద్రుడిని పూజించిన తర్వాత మీరు ఏ దేవుడిని మొక్కినా.. పూజలు చేసినా అధిక ఫలితాన్ని ఇస్తాయట.
మిథున రాశి: ఈ రాశిలో పుట్టిన జాతకులు ముందుగా లక్ష్మీ దేవిని పూజించాలట. తర్వాతే మిగతా దేవతలను మొక్కాలట. అప్పుడే మీరు చేసే పూజలకు బలం చేకూరుతుందట.
కర్కాటక రాశి: ఈ రాశిలో పుట్టిన వ్యక్తులు ముందుగా హనుమంతుడిని పూజించాలట. ఆంజనేయస్వామికి పూజలు చేసిన తర్వాతే మిగతా దేవుళ్లను పూజించుకోవచ్చని సూచిస్తున్నారు.
సింహ రాశి: ఈ రాశిలో పుట్టిన వ్యక్తులు తమ పూజలు ఫలించాలన్నా..? తమ మొక్కులు నెరవేరాలన్నా..? ముందుగా సింహ రాశికి అనువైన పరమ శివుణ్ని పూజించాలట. అలా చేస్తేనే మీకు దైవబలం చేకూరుతుందట.
కన్యా రాశి: ఈ రాశిలో పుట్టిన జాతకులు మెరుగైన శుభ ఫలితాల కోసం ముందుగా శ్రీ మహా విష్ణువును పూజించాలట. తర్వాత మీరు ఏ పని చేసినా కలిసి వస్తుందట. ఏ దేవుణ్ని పూజించినా వెంటనే కరుణిస్తాడట.
తులా రాశి: తులా రాశిలో పుట్టిన వ్యక్తులు ముందుగా పూజించాల్సిన దేవత మాతా పార్వతీదేవి. అమ్మ వారిని పూజించి దర్శించినంత మాత్రం చేతనే మీ కష్టాలన్నీ పటాపంచలై పోతాయట. మీరు చేసే పూజలకు, వ్రతాలకు మరింత శక్తిని చేకురుస్తుందట పార్వతి దేవి.
వృశ్చిక రాశి: ఈ రాశిలో పుట్టిన వ్యక్తులు తమ జాతకరీత్యా మొదటగా పూజించవలసిన దేవుడు వినాయకుడు. గణేషుడిని పూజించిన తర్వాత మీరు ఏ పని చేసిన విజయం మిమ్మల్ని వరిస్తుందట. అలాగే ఏ పూజలు చేసినా హోమాలు చేసినా మీకు కచ్చితంగా కలిసొస్తుందట.
ధనస్సు రాశి: ఈ రాశిలో పుట్టిన జాతకులకు కలిసొచ్చే దేవుడు శ్రీ మహా విష్ణువు. విష్ణువును పూజించిన తర్వాతే వీరు వేరొక దేవుడిని కానీ దేవతను కానీ పూజించాలి. అప్పుడే ఆ దేవీదేవతలు మిమ్మల్ని వెంటనే కరుణిస్తారట.
మకర రాశి: ఈ రాశిలో పుట్టిన జాతకులు చదువుల తల్లి సరస్వతి దేవిని దర్శించాలట. అప్పుడే మీకున్న అవరోధాలు తప్పిపోయి మీరు జీవితంలో ఉన్నత స్థితికి చేరుకుంటారట. అలాగే మీరు ఏ పని చేసినా ఏ పూజ చేసినా.. వ్రతం చేసినా ముందుగా సరస్వతి దేవిని స్మరించుకోవాలట. అప్పుడే మీరు చేసే పూజలకు సార్థకత చేకూరుతుందట.
కుంభ రాశి: ఈ రాశి జాతకులు మొదటగా శని దేవుడిని పూజించాలట. ఆ తర్వాతే మిగతా వారిని మొక్కాలట. ఈ రాశికి అధిపతి శనిదేవుడు కాబట్టి వీరు తప్పకుండా శనిని స్మరించుకోవాలట. ఇలా చేయడం వల్ల వీరికి పనుల్లో ఆటంకాలు తప్పిపోవడమే కాకుండా జీవితంలో వీరు చేయబోయే ఎలాంటి పనుల్లోనైనా విజయం సాధిస్తారట.
మీన రాశి: పన్నెండు రాశుల్లో చివరిదైన మీనరాశిలో పుట్టిన వారు దుర్గా మాతను పూజించాలట. అప్పుడే మీరు ఏ పనిలోనైనా విజయం సాధిస్తారట. అలాగే దుర్గాదేవిని పూజించన తర్వాతే మీరు మిగతా దేవుళ్లను మొక్కాలట.
ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.
ALSO READ: సైన్స్ ను సవాలు చేసిన హిందుత్వం – అసలు విషయం తెలిస్తే షాక్ అవుతారు