Vastu Tips: అప్పు ఏ వ్యక్తికి అయినా అంత మంచిది కాదు. కొన్ని సార్లు అప్పు అతిపెద్ద సమస్యగా మారుతుంది. అప్పుల కారణంగా.. ఒక వ్యక్తి తన జీవితాన్ని సంతోషంగా గడపలేడు. మీరు కూడా ఇలాంటి పరిస్థితిలో చిక్కుకుంటే.. మాత్రం వాస్తు శాస్త్రం మీకు ఉపయోగకరంగా ఉంటుంది. మీరు చాలా కాలంగా అప్పులతో బాధపడుతూ.. ఎన్ని ప్రయత్నాలు చేసినా దాన్ని తిరిగి చెల్లించలేకపోతే.. కొన్ని సాధారణ వాస్తు టిప్స్ పాటించాలి. ఈ చర్యలు రుణాన్ని తిరిగి చెల్లించడానికి ఉపయోగపడతాయి. అంతే కాకుండా ఇంట్లో సానుకూల శక్తిని ప్రసరింపజేస్తాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
అప్పుల నుండి బయటపడటానికి వాస్తు పరిహారాలు:
– వాస్తు శాస్త్రం ప్రకారం.. ఇంటి ఉత్తర దిశ నేరుగా సంపద, శ్రేయస్సుకు సంబంధించినది. కాబట్టి.. ఇంటి ఉత్తరం వైపు ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచండి. ఈ దిశ మురికిగా ఉంటే మనం లక్ష్మీ దేవి ఆశీర్వాదాలను పొందలేరు. మీరు ఉత్తర దిశలో శుభ్రమైన నీటితో నిండిన ఒక పాత్రను కూడా ఉంచవచ్చు. ఇది ఇంట్లో సానుకూల శక్తిని ఉత్పత్తి చేస్తుంది.
– సనాతన ధర్మంలో.. లక్ష్మీదేవికి చిహ్నంగా ప్రతి ఇంట్లో తులసి మొక్కను ఉంచే సంప్రదాయం ఉంటుంది. వాస్తు శాస్త్రంలో కూడా.. ఈ మొక్కను లక్ష్మీ దేవి ఆశీర్వాదంగా భావిస్తారు. ఈ మొక్క ఇంట్లోకి సానుకూల శక్తిని తీసుకురావడమే కాకుండా కుటుంబ సభ్యులకు అప్పుల నుండి విముక్తి కలిగిస్తుంది.
– ఇంట్లో ఉంచే ఇనుప పెట్టె దిశ ఎల్లప్పుడూ నైరుతి దిశలో ఉండాలి. వాస్తు శాస్త్రం ప్రకారం.. ఈ దిశ స్థిరత్వం , భద్రతను సూచిస్తుంది. నైరుతి దిశలో ఉంచిన డబ్బు కుటుంబ సభ్యుల ఆర్థిక పరిస్థితిని బలపరుస్తుంది. అంతే కాకుండా ఇది ఇంట్లో పొదుపును కూడా పెంచుతుంది.
Also Read: శివుడికి ఇష్టమైన ఈ 10 వస్తువులు సమర్పిస్తే.. జన్మజన్మల పుణ్యం
– హనుమంతుడిని ప్రతి మంగళవారం , శనివారం పూజించాలి. వాస్తు శాస్త్రం ప్రతి ఇంట్లో హనుమంతుడి చిత్ర పటం, ఆయన పూజా తప్పకుండా చేయాలని చెబుతారు. హనుమంతుడికి బెల్లం, పప్పు నైవేద్యం గా పెట్టండి. హనుమంతుడు అప్పుల నుండి విముక్తి పొందడంలో సహాయపడే దేవుడిగా భావిస్తారు.
– మీరు త్వరగా అప్పుల నుండి బయటపడాలనుకుంటే.. ఇంటి ప్రధాన ద్వారం మీద స్వస్తిక్ గుర్తును వేయండి. ఇది సంపద , శ్రేయస్సుకు ద్వారంగా చెప్పబడుతుంది. ప్రతి గురువారం, శనివారం స్వస్తిక్ తయారీకి పసుపు , బియ్యం ఉపయోగించండి. ఈ పరిష్కారం సంపదకు దేవత అయిన లక్ష్మీ దేవిని సంతోష పరుస్తుంది.