Lord Shiva : శివాలయాల్లో భక్తులు తమ ఇష్టదైవాన్ని తగిన ఆచారాలతో పూజిస్తారు. భక్తులు తనను నిజమైన భక్తితో స్మరించుకున్నప్పుడే శివుడు వారి పిలుపును వింటాడు. శివలింగంపై కొన్ని ప్రత్యేక వస్తువులను సమర్పించడం ద్వారా.. మహాదేవుని ప్రత్యేక ఆశీస్సులు వారికి లభిస్తాయి.
పురాణాల ప్రకారం జీవితంలో సానుకూల మార్పు, ఆనందం, శ్రేయస్సు కలగాలంటే శివ పూజలో కొన్ని ముఖ్యమైన వస్తువులను తప్పకుండా చేర్చాలి. శివుడు అభిషేక ప్రియుడు అని చెబుతారు. కానీ 10 రకాల వస్తువులను చేర్చడం వల్ల కూడా శివుడి అనుగ్రహం లభిస్తుందని నమ్ముతారు.
శివుడికి జలాభిషేకం చేస్తారు. శివలింగంపై నీటిని సమర్పించడం యొక్క ప్రాముఖ్యత సముద్ర మంథనం కథతో ముడిపడి ఉంది. సముద్ర మథనం సమయంలో శివుడు విషం తాగినప్పుడు.. ఆయన గొంతు పూర్తిగా నీలం రంగులోకి మారింది. ఈ విషం యొక్క వేడిని తగ్గించడానికి, అంతే కాకుండా శివుడికి చల్లదనాన్ని అందించడానికి.. అందరు దేవతలు ఆయనకు నీటిని సమర్పించారు. అప్పటి నుండి శివుడికి నీటిని అర్పిస్తున్నారు. అందుకే ఆయన పూజలో నీటికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది.
బిల్వ పత్రం:
బిల్వ పత్రం అనేది శివుని మూడు కళ్ళకు చిహ్నం. అందుకే.. మూడు ఆకులు కలిగిన బెల్పపత్రం శివుడికి చాలా ప్రియమైనది. పురాణాల ప్రకారం శివుడికి బిల్వ పత్రం సమర్పించడం, కోటి మంది బాలికలకు కన్యాదానం చేసిన అంత ఫలితానికి సమానం అని చెబుతారు.
ఉమ్మెత్త:
భోళా శంకరుడికి ఉమ్మెత్త అంటే చాలా ఇష్టం. దేవీ భాగవత పురాణం ప్రకారం.. శివుడు సముద్ర మథనం నుండి వచ్చిన హాలాహల విషాన్ని తాగినప్పుడు.. దాని మండే స్వభావం కారణంగా అశాంతికి గురయ్యాడు. అప్పుడు కొందరు గంజాయి, ఒక రకమైన వైన్, ఉమ్మెత్త మొదలైన మందులతో వేడిని తగ్గించారు. అప్పటి నుండి శంకరుడికి ఉమ్మెత్త ఇష్టమని చెబుతారు.
గంజాయి:
శివుడికి కూడా గంజాయి అంటే చాలా ఇష్టం. సముద్ర మథనం నుండి వచ్చిన విషాన్ని శివుడు తాగినప్పుడు.. ఔషధంగా గంజాయి సమర్పించారట. అందువల్ల.. శివుడిపూజలో గంజాయిని కూడా నైవేద్యంగా పెడతారు.
కర్పూరం:
శివుడికి కర్పూరం వాసన చాలా ఇష్టం. శివపూజలో కర్పూరం ఉపయోగించడం శుభప్రదంగా భావిస్తారు. శివుడికి సంబంధించిన మంత్రాల్లో ఆయన కర్పూరం లాగా ప్రకాశవంతమైన వ్యక్తిగా వర్ణించబడ్డాడు. కాబట్టి.. శివరాత్రి పూజలో కర్పూరాన్ని ఖచ్చితంగా చేర్చండి.
పాలు:
శివుడికి కూడా పాలు అంటే చాలా ఇష్టం. ఆయనను పాలతో అభిషేకం చేస్తారు. శివుడికి పాలతో అభిషేకం చేయడం చాలా శుభప్రదంగా భావిస్తారు. ఈ శివరాత్రి రోజు తప్పకుండా శివుడికి పాలు అర్పించండి.
బియ్యం:
పూజలో బియ్యాన్ని అక్షతలు అంటారు. అక్షత అంటే విరగని బియ్యం. శివుని పూజలో అక్షత ఉపయోగించడం ముఖ్యం. పూజలో అక్షతలు లేకపోతే ఆ పూజ పూర్తయినట్లు భావించరు.
Also Read: నుదుటిపై కుంకుమ, బియ్యంతో తిలకం ఎందుకు పెడతారో తెలుసా ?
గంధం:
శివుడు తన నుదిటిపై గంధపు త్రిపుండాన్ని పూసుకుంటాడు. అందుకే ఆయన పూజలో గంధపు చెక్కకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. శివుడికి చందనం సమర్పించడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది.
రుద్రాక్ష:
రుద్రాక్ష శివుడికి ప్రతీక. రుద్రాక్షలు శివుడి కన్నీటి నుండి ఉద్భవించాయని నమ్ముతారు. అందుకే.. శివుడి ఆరాధనలో దీనికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది.