BigTV English

Tuesday: మంగళవారం ఇలా చేస్తే మీరు పట్టిందల్లా బంగారమే

Tuesday: మంగళవారం ఇలా చేస్తే మీరు పట్టిందల్లా బంగారమే

Tuesday: మీరు పట్టిందల్లా బంగారం కావాలని అనుకుంటున్నారా..? చేసే ప్రతి పనిలో విజయం సాధించాలని కోరుకుంటున్నారా..? మీరు మీ కుటుంబ సభ్యులు సుఖఃసంతోషాలతో హ్యాపీగా ఉండాలనుకుంటున్నారా..? అయితే నెలకు ఒక్క మంగళవారం ఇలా చేశారంటే మీరు పట్టిందల్లా బంగారమే అవుతుందట. ఒక్క మాటలో చెప్పాలంటే ఏ పని చేసినా మీకు తిరుగుండదట. ఇంతకీ ఏం చేయాలో ఈ కథనంలో తెలుసుకుందాం.


చాలా మందికి ఏ పని చేసినా కలిసిరాదు. ఏం చేస్తున్నా  ఫెయిల్ అవుతుంటారు. ఎన్ని పూజలు చేసినా ఫలితం రాక మానసికంగా ఇబ్బంది పడుతుంటారు.  ఎలాంటి హోమాలు చేసినా వారి జాతకంలో మాత్రం మార్పు కనబడదు. అలాంటి వారికోసమే తంత్ర శాస్త్రంలో అద్బుతమైన ఎన్నో పరిహారాలు ఉన్నాయంటున్నారు పండితులు.  అలాంటి పరిహారాలలో ఎవరైనా అతి సులువుగా చేసుకోగలిగిన మంగళవారపు పరిహారం ఇప్పుడు తెలుసుకుందాం. అవును మీరు చదివింది నిజమే నెలలో ఒక్క మంగళవారం కొన్ని పరిహారాలు పాటిస్తే.. కచ్చితంగా వారు అనుకున్న పనులు అనుకున్న టైంకు పూర్తి అవుతాయట.

అయితే చాలా మందికి వారంలో కొన్ని రోజులు స్పెషల్‌గా ఉంటాయి కొంత మంది వారికి మంచి జరగాలని వారికి ఇష్టమైన భగవంతుని ఆలయానికి వెళ్లి వస్తుంటారు. ప్రత్యేక పూజలు చేస్తుంటారు. అభిషేకాలు జరిపిస్తూ ఉంటారు. మరికొంత మంది ఇంట్లోనే దేవుడిని పూజిస్తూ ఉంటారు. ముఖ్యంగా చెప్పాలంటే చాలా మంది మంగళవారం, శుక్రవారం ప్రత్యేక దినంగా బావిస్తూ ఉంటారు. అయితే మంగళవారం రోజు ఆంజనేయస్వామిని ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటారు. అయితే మంగళవారం రోజు ఈ కింది పరిహారాలు పాటించడం ద్వారా ఎంతో మంచి జరుగుతుందని పండితులు చెప్తున్నారు.


పరిహారాలు:

  • మంగళవారం రోజు సూర్యోదయానికి ముందే అంటే బ్రహ్మ ముహూర్తంలో ( తెల్లవారుజామున 3 గంటల 30 నిమిషాల నుంచి 5 గంటల 30 నిమిషాల వరకు) నిద్ర లేచి ఇంటి ముందు శుభ్రం చేసుకోవాలి. శుభ్రం చేసిన వాకిలిలో  రంగుల ముగ్గు వేయాలి. అలాగే సుగంధ ద్రవ్యాలను వెదజల్లే పువ్వులు ఆ ముగ్గుపై ఉంచాలి.
  • ఇంకా చెప్పాలంటే మంగళవారం రోజున ఇంటిని శుభ్రం చేసే నీటిలో కల్లు ఉప్పు ఉపయోగించి ఇంటిని శుభ్రం చేయాలి. ఇంటి గేటు ముందు ముళ్ల మొక్కలు ఉంటే వాటిని తీసివేయాలి.
  • ఇక మంగళవారం సాయంత్రం ఏడు గంటల వరకు తలుపులు అసలు మూయకూడదు. అలాగే రాత్రి పూట కళ్లు ఉప్పు తీసుకుని ఎరుపు రంగు బట్టలో మూటకట్టి ఇంటి ప్రధాన ద్వారం ముందు ఉంచాలి. మరుసటి రోజు దానిని తీసుకొని ఏదైనా చెట్టు మొదట్లో వేయాలి. ఈ విధంగా చేస్తే మీరు పట్టిందల్లా బంగారంలా మారుతుంది. ఇలా నెలలో ఒక మంగళవారం చేస్తే మీకు మీ ఇంటికి ఉన్న దోషాలన్నీ పోతాయి. మీ ఇంట్లో సంపాదనకు ఎలాంటి లోటు ఉండదు.

ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలను ఎండకుండా చూసుకోండి, అలా ఎండితే లక్ష్మీదేవి కరుణించదు

Raksha Bandhan 2025: రాఖీ పళ్లెంలో.. ఈ వస్తువులు తప్పకుండా ఉండాలట !

Raksha Bandhan 2025: భద్ర నీడ అంటే ఏమిటి ? ఈ సమయంలో రాఖీ ఎందుకు కట్టకూడదని చెబుతారు

Raksha Bandhan 2025: ఈ నియమాలు పాటించకపోతే రాఖీ కట్టిన ఫలితం ఉండదు!

God Idols: ఇంట్లో ఉంచకూడని దేవుని ఫోటోలు ఏవో తెలుసా..? ఆ తప్పు మీరు అసలు చేయకండి

Big Stories

×