Aamir Khan : ఇండియాలోని విలక్షణమైన నటుల ప్రస్తావన వస్తే ఖచ్చితంగా వినిపించే పేరు అమీర్ ఖాన్. పేరుకు బాలీవుడ్ నటుడు అయినా కూడా తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితం. అమీర్ ఖాన్ చేసిన ఎన్నో సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ సాధించాయి.
అమీర్ ఖాన్ సినిమాలను వెతుక్కుని మరీ చూసిన తెలుగు ఆడియన్స్ ఉన్నారు. చాలామంది ఫేవరెట్ ఫిలిమ్స్ లిస్టులో అమీర్ ఖాన్ సినిమాలు కూడా ఉంటాయి. ఇక రీసెంట్ గా అమీర్ ఖాన్ సితారే జమీన్ పర్ సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చారు. ఈ సినిమాకి ఆర్ఎస్ ప్రసన్న దర్శకత్వం వహించారు. జూన్ 20న ఈ సినిమా ప్రేక్షకులు ముందుకు వచ్చింది. అదే డేటున మరోవైపు 8 వసంతాలు కుబేర సినిమాలు కూడా విడుదలయ్యాయి.
125 కోట్ల అవసరం లేదు
రీసెంట్ టైమ్స్ లో ఓటిటి ప్రెజర్ సినిమాల మీద ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఓటిటి డీల్స్ కి అనుగుణంగా సినిమా రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేయవలసి వస్తుంది. అయితే అదే డేట్ నా రిలీజ్ అయిన రెండు సినిమాలు ప్రస్తుతం ఓటీటీ లోకి ఎంట్రీ ఇచ్చేశాయి. ఇక ఈ తరుణంలో అమీర్ ఖాన్ కొన్ని సంచలమైన వ్యాఖ్యలు చేశారు. నాకు ఓటీటీ ఇచ్చిన 125 కోట్లు కంటే కూడా ప్రేక్షకుడు ఇచ్చిన 100 రూపాయలు చాలా ఇంపార్టెంట్ అంటూ మాట్లాడారు. ఇక ఈ సినిమాను డైరెక్ట్ గా యూట్యూబ్లో పెడుతున్న సంగతి తెలిసిందే. కేవలం 100 రూపాయలు పే చేసి ఈ సినిమాను యూట్యూబ్లోనే చూడొచ్చు. అమీర్ ఖాన్ తీసుకున్న ఈ నిర్ణయం కి కొంతమంది ప్రశంసలు కూడా ఇస్తున్నారు. ఇదే జరిగి ఇంకొన్ని సినిమాలు ముందడుగు వేస్తే ఓటిటికి సరైన సమాధానం చెప్పినట్లు అవుతుంది.
బాక్సాఫీస్ వద్ద మంచి రెస్పాన్స్
ఈ సినిమా థియేటర్లో విడుదలైనప్పటి నుంచి మంచి టాక్ ను సాధించుకుంది. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమాకి దాదాపు 20 కోట్లు వచ్చినట్లు సమాచారం వినిపించింది. ఈ సినిమా 2018 స్పానిష్ మూవీ ఛాంపియన్స్ యొక్క అధికారిక రీమేక్. అలానే సస్పెండ్ చేయబడిన బాస్కెట్‌బాల్ కోచ్‌ను గురించి చూపించారు. బాస్కెట్ బాల్ కోచ్ వైకల్యాలున్న ఆటగాళ్ల టీం ను టోర్నమెంట్ కు ఎలా సిద్ధం చేశారు అని విషయాన్ని సినిమాలో చూపించాడు దర్శకుడు.
Also Read : Vijay Sethupathi : పూరి లెజెండ్, అమ్మో విజయసేతుపతి మాటలు వింటే పూరి కంబ్యాక్ ఇస్తాడేమో అనిపిస్తుంది