BigTV English

Sravana Shaniwar 2024: శ్రావణ మాసంలో శనివారం.. శని దోషం తొలగిపోవడానికి ఇలా చేయండి

Sravana Shaniwar 2024: శ్రావణ మాసంలో శనివారం.. శని దోషం తొలగిపోవడానికి ఇలా చేయండి

Sravana Shaniwar 2024: శ్రావణమాసం అత్యంత పవిత్రమైన మాసం. ఈ మాసంలో శివుడు, పార్వతీదేవిని పూజిస్తుంటారు. శనివారం శని రోజుగా పరిగణించబడుతుంది. ముఖ్యంగా శ్రావణ శనివారానికి విశేష ప్రాముఖ్యత ఉంటుంది. శ్రావణమాసంలో శివుడిని ఆరాధించడం వల్ల మంచి జరుగుతుందని నమ్ముతారు. సిరి సంపదలు లభిస్తాయని చెబుతుంటారు.


శ్రావణ మాసంలో శనివారం రోజున శివుడిని ఆరాధించడంతో పాటు శని దేవుడిని ఆరాధించడం ద్వారా మంచి ఫలితాలు ఉంటుంది. శ్రావణ శని వారం రోజు కొన్ని ప్రత్యేక పనులు చేయడం ద్వారా శని దోషం ఉన్నవారు ఉపశమనం పొందుతారు.

శ్రావణమాసంలో ఈ పరిహారాలు చేయండి :
శ్రావణ మాసంలో వచ్చే శని వారం రోజు అచంచలమైన భక్తితో హనుమంతుడిని పూజించడం వల్ల శని దేవుడి అనుగ్రహం లభిస్తుందని చెబుతుంటారు. శని భగవంతుడిని శాంతింపజేయడానికి అంతే కాకుండా అతడి ప్రతికూల ప్రభావాలను తొలగించడానికి తమకు తాముగా ముందుగా హనుమంతుడికి అంకితం చేసుకోవాలని చెబుతుంటారు. హనుమంతుడిని శనివారం రోజు పూజించడం ద్వారా వ్యక్తులు ఆ రెండు శక్తివంతమైన దేవతలు మధ్య సామరస్యం, సమతుల్యత ప్రభావాలను పొందుతారు.


శని దేవుడికి నువ్వుల సమర్పణ:
శ్రావణ శనివారం నువ్వులు, ఆవ నూనే దానం చేయడం చేయాలని పండితులు చెబుతుంటారు. ఇలా చేయడం వల్ల శని దేవుడు మన జీవితంలో సంతోషాన్ని కలిగిస్తాడు. అంతే కాకుండా శివుడి అనుగ్రహాన్ని కూడా మనం పొందుతాము. మనిషి జాతకంలో ఏర్పడే గ్రహ దోషాలు కూడా దీని ద్వారా తొలగిపోతాయి.

శివుడికి అభిషేకం:
శ్రావణ శని వారం రోజు ఉదయాన్నే నిద్రలేచి తలంటు స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించాలి. అనంతరం గంగా జలం, పాలు, పెరుగు పంచదార మొదలైన వాటిని శివుడికి సమర్పించడం మంచిది. దీంతో పాటు శివుని అభిషేకం చేసేటప్పుడు శ్రీ భగవతే సాంబశివాయ నమ: అనే మంత్రాన్ని నిరంతరం జపిస్తూ ఉండండి. దీని వల్ల మీపై శివుడి అనుగ్రహం కలుగుతుంది.

రావి చెట్టును పూజించడం:
శనివారం రావిచెట్టును పూజించడం చాలా ప్రయోజనకరం. శ్రావణమాసంలో శనివారం రావి చెట్టుకు నీరు సమర్పించి సాయంత్రం చెట్టు దగ్గర దీపం వెలిగించండి. ఇలా చేయడం వల్ల గ్రహ బాధలు, ఆర్థిక సంక్షోభం మొదలైన సమస్యలు తొలగిపోతాయి.

Also Read: కన్యా రాశిలోకి చంద్రుని ప్రవేశంతో ఈ 4 రాశులకు లక్ష్మి అనుగ్రహం

శనివారం రుద్రాక్షలు ధరించండి:
శివుని ఇట్టమైన ఆభరణాలలో ఒకటైన రుద్రాక్ష చాలా ఉత్తమమైందిగా చెబుతుంటారు. అందువల్ల శనివారం రుద్రాక్షలు ధరించండి. వీలైతే మీ రాశి ప్రకారం ఏ రుద్రాక్ష మీకు మంచి ఫలితాలను ఇస్తుందో అలాంటి రుద్రాక్ష గురించి సమాచారం జ్యోతిష్య నుంచి పొందండి. దీని ద్వారా ఆనందం, శ్రేయస్సు, ఆరోగ్యం పొందుతారు.

శివ మంత్రాలు, స్తోత్రాలు:
శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి శివ మంత్రాలు సోత్రాలు పటించడం చాలా అవసరం. శ్రావణ శనివారం ఉదయం, సాయంత్రం శివ చాలీసా పఠించడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయి. అంతే కాకుండా శని చాలీసా పారాయణం కూడా శుభప్రదంగా పరిగణించబడుతుంది. శని దోషం ఉన్న వాళ్లు శని చాలీసా పఠించడం ద్వారా విశేష ప్రయోజనాలను పొందుతారు.

Related News

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలను ఎండకుండా చూసుకోండి, అలా ఎండితే లక్ష్మీదేవి కరుణించదు

Raksha Bandhan 2025: రాఖీ పళ్లెంలో.. ఈ వస్తువులు తప్పకుండా ఉండాలట !

Raksha Bandhan 2025: భద్ర నీడ అంటే ఏమిటి ? ఈ సమయంలో రాఖీ ఎందుకు కట్టకూడదని చెబుతారు

Big Stories

×