BigTV English

Bathukamma 2025: ఎంగిలి పూల బతుకమ్మ.. ఇంతకీ ఈ పేరు ఎలా వచ్చిందో తెలుసా ?

Bathukamma 2025: ఎంగిలి పూల బతుకమ్మ.. ఇంతకీ ఈ పేరు ఎలా వచ్చిందో తెలుసా ?

Bathukamma 2025: తెలంగాణ ప్రజలు తొమ్మిది రోజుల పాటు అత్యంత భక్తిశ్రద్ధలతో, ఉత్సాహంగా బతుకమ్మ పండుగను జరుపుకుంటారు. ఈ సంవత్సరం బతుకమ్మ పండుగ సెప్టెంబర్ 21న మహాలయ అమావాస్యతో ప్రారంభం కానుంది. ప్రకృతిని, పూలను పూజించడం ఈ పండుగ ముఖ్య ఉద్దేశ్యం. దేవీ నవరాత్రులు మొదలవడానికి ఒకరోజు ముందుగా ఈ సంబరాలు మొదలవుతాయి. ఈ పండుగలో భాగంగా మహిళలు వివిధ రకాల పూలను గోపురం ఆకారంలో పేర్చి.. పాటలు పాడుతూ గౌరమ్మను కొలుస్తారు. మొదటి రోజు ‘ఎంగిలి పూల బతుకమ్మ’తో మొదలయ్యే ఈ పండుగ తొమ్మిదవ రోజు ‘సద్దుల బతుకమ్మ’తో ముగుస్తుంది. అలిగిన బతుకమ్మ రోజు తప్ప మిగతా అన్ని రోజులు బతుకమ్మకు ప్రత్యేకమైన నైవేద్యాలు సమర్పిస్తారు.


బతుకమ్మ పండుగలోని తొమ్మిది రోజులు – వాటి ప్రత్యేకత:
బతుకమ్మ పండుగ తొమ్మిది రోజులు వివిధ పేర్లతో.. వైవిధ్యమైన నైవేద్యాలతో జరుపుకుంటారు. ప్రతిరోజు ఒక ప్రత్యేకమైన వంటకాన్ని బతుకమ్మకు సమర్పిస్తారు. స్థానికంగా లభించే పంటలైన మొక్కజొన్న, జొన్న, సజ్జ, బియ్యం వంటి వాటిని ఎక్కువగా ఉపయోగిస్తారు. వీటితో పాటు మినుములు, శనగలు, పెసర్లు, పల్లీలు, నువ్వులు కూడా నైవేద్యంలో భాగం.

ఎంగిలి పూల బతుకమ్మ: ఇది పండుగ తొలి రోజు. నువ్వులు, బియ్యంపిండి, నూకలతో నైవేద్యం పెడతారు.


అటుకుల బతుకమ్మ: సప్పిడి పప్పు, బెల్లం, అటుకులతో నైవేద్యం సమర్పిస్తారు.

ముద్దపప్పు బతుకమ్మ: ముద్దపప్పు, పాలు, బెల్లంతో చేసిన పదార్థాలను నైవేద్యంగా పెడతారు.

నానబియ్యం బతుకమ్మ: నానబెట్టిన బియ్యం, పాలు, బెల్లంతో నైవేద్యం తయారు చేస్తారు.

అట్ల బతుకమ్మ: ఈ రోజు అట్లు, దోసెలు నైవేద్యంగా పెడతారు.

అలిగిన బతుకమ్మ: ఈ రోజు బతుకమ్మకు నైవేద్యం ఉండదు.

వేపకాయల బతుకమ్మ: బియ్యంపిండిని వేయించి వేపపండ్లలాగా చేసి నైవేద్యంగా పెడతారు.

వెన్నముద్దల బతుకమ్మ: నువ్వులు, నెయ్యి, బెల్లంతో చేసిన వెన్నముద్దలను నైవేద్యంగా సమర్పిస్తారు.

సద్దుల బతుకమ్మ: ఇది చివరి రోజు. ఐదు రకాల నైవేద్యాలు (సద్దులు) – పెరుగన్నం, పులిహోర, నిమ్మకాయ అన్నం, కొబ్బరన్నం, నువ్వులన్నం – సమర్పిస్తారు.

ఎంగిలి పూల బతుకమ్మ పేరు ఎలా వచ్చింది?
పండుగ తొలి రోజును ‘ఎంగిలి పూల బతుకమ్మ’ అని పిలవడానికి రెండు కారణాలు ప్రచారంలో ఉన్నాయి.

పూల నిద్రావస్థ: బతుకమ్మను పేర్చడానికి అవసరమైన పూల కోసం మహిళలు, పిల్లలు పొలాలకు, చెట్లకు, గట్ల దగ్గరికి వెళ్లి పూలు సేకరిస్తారు. ఎక్కువగా తంగేడు, గునుగు, తామర, చామంతి, బంతి, సీత జడల పూలను కోసి తీసుకొస్తారు. ఆ పూలు వాడిపోకుండా ఉండడానికి, మరుసటి రోజు పేర్చడానికి వీలుగా రాత్రి వాటి మీద నీళ్లు చల్లుతారు. పూలు రాత్రి పూట నిద్రపోతాయని, ఆ విధంగా రాత్రి నిద్రించిన పూలను ‘ఎంగిలి పూలు’ అని పిలుస్తారని కొందరు నమ్ముతారు.

మహాలయ అమావాస్య తర్పణం: మరికొందరు చెప్పే దాని ప్రకారం, బతుకమ్మ మొదటి రోజు మహాలయ పితృపక్ష అమావాస్యతో వస్తుంది. ఈ రోజున చాలామంది తమ పూర్వీకులకు, పెద్దలకు తర్పణాలు ఇస్తారు. భోజనం చేసిన తర్వాతే బతుకమ్మను తయారు చేయడం మొదలుపెడతారు. భోజనం చేసిన తర్వాత నోరు ‘ఎంగిలి’ అవుతుంది కాబట్టి.. ఆ ఎంగిలితో చేసే బతుకమ్మను ‘ఎంగిలి పూల బతుకమ్మ’ అని పిలుస్తారని చెబుతారు. ఈ పితృ అమావాస్యను తెలంగాణలో పెత్రమాస అని కూడా అంటారు.

 

Related News

Amavasya 2025: ఆదివారం అమావాస్య.. సాయంత్రం లోపు ఇలా చేయకుంటే అష్టకష్టాలు

Mahalaya Amavasya 2025: మహాలయ అమావాస్య ఈ నియమాలు పాటిస్తే.. పితృదోషం తొలగిపోతుంది

Bathukamma 2025: తెలంగాణలో బతుకమ్మ పండగను ఎందుకు జరుపుకుంటారు ? అసలు కారణం ఇదే !

Bathukamma 2025: తీరొక్క పూలతో ఊరంతా పండగ.. బతుకమ్మ సంబురాలు ఎప్పటి నుంచి ?

Goddess Durga: దుర్గాదేవిని ఈ ఎర్రటి పూలతో పూజిస్తే.. కష్టాలన్నీ తొలగిపోతాయ్ !

Sabarimala: శబరిమల అయ్యప్ప ఆలయంలో 4.54 కేజీల బంగారం మాయం..

Navratri Gifts Ideas: నవరాత్రి స్పెషల్.. బహుమతులు ఇచ్చే క్రీయేటివ్ ఐడియాస్ మీకోసం

Big Stories

×