IND Vs PAK : ఆసియా కప్ 2025 టోర్నీలో భాగంగా భారత్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య సూపర్ 4 మ్యాచ్ జరుగనుంది. అయితే ఈ మ్యాచ్ కి ముందే సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వైరల్ కావడం విశేషం. ముఖ్యంగా టీమిండియా అభిమానులు పాకిస్తాన్ ఆటగాడిని ఆటోగ్రాఫ్ అడిగినట్టు సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. వాస్తవానికి టీమిండియా అభిమానులు చాలా వరకు టీమిండియా క్రికెటర్లనే ఆటోగ్రాఫ్ అడుగుతుంటారు. వారు బిజీగా ఉండటం కారణం వల్ల.. జనాభా ఎక్కువ వెంట పడుతారనో మరేదైనా కారణంగా కొంత మంది ఆటగాళ్లు ఆటోగ్రాఫ్ ఇవ్వరు. అయితే ఇప్పుడు పాకిస్తాన్ క్రికెటర్ ఇండియా అభిమానులకు ఆటోగ్రాఫ్ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది.
Also Read : BCCI : బీసీసీఐలో ప్రక్షాళన..కొత్త అధ్యక్షుడు ఇతనే.. ఐపీఎల్ కు కొత్త బాస్
మరికొద్ది సేపట్లో ప్రారంభం కావాల్సిన సూపర్ 4 మ్యాచ్ కి ఏదో ఒక రకంగా టీమిండియా అభిమానులను, టీమిండియాను ఒత్తిడిలోకి నెట్టాలనే ఉద్దేశంతోనే కొత్తగా ఇప్పుడు ఆటో గ్రాఫ్ అంశాన్ని తీసుకొచ్చారు. మొన్నటి వరకు షేక్ హ్యాండ్ వివాదం తీసుకొచ్చి అప్గానిస్తాన్ పై గంటకు పైగా మ్యాచ్ ని ఆలస్యం చేశారని కొంత మంది టీమిండియా అభిమానులు పేర్కొంటున్నారు. ఎలాగైనా టీమిండియా డిస్ట్రబ్ చేయాలనే వీళ్లు ఏదో ఒక రకమైన నాటకం ఆడుతున్నారు. మరోవైపు ఆసియా కప్ 2025లో అంతగా ఫామ్ లో లేని శుబ్ మన్ గిల్ ఈ మ్యాచ్ లో అద్బుతమైన పామ్ లో ఉండాలని కసరత్తులు చేస్తున్నాడు. ముఖ్యంగా షేక్ హ్యాండ్ వివాదం తరువాత టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య జరుగబోయే మ్యాచ్ కావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. పాకిస్తాన్ జట్టేమో గ్రూపు దశలో ఓటమికి ప్రతికారం తీర్చుకోవాలనే కసితో ఉంది.
మరోవైపు పాకిస్తాన్ జట్టుతో మరోసారి గెలిచి టీమిండియా అభిమానులు సంబురాలు జరుపుకునేలా మ్యాచ్ ఆడాలని సూర్యకుమార్ సేన భావిస్తోంది. ఒమన్ తో మ్యాచ్ కారణంగా భారత్ తన వైఫల్యాలను బయటపెట్టింది. దీంతో పాకిస్తాన్ జట్టు టాస్ గెలిస్తే.. ఫీల్డింగ్ ఎంచుకోవాలని బావిస్తోంది. అసలే ఇవాళ ఆదివారం కావడంతో మ్యాచ్ చూసేందుకు అభిమానులు చాలా ఆసక్తి కనబరుస్తారు. సాధారణంగా దాయాది జట్ల పోరు అంటేనే ఆసక్తిని రేపుతోంది. లీగ్ దశలో పాకిస్తాన్ ఆటతీరు చూస్తే.. టీమిండియాకి మళ్లీ ఎదురు ఉండకపోవచ్చు. ఈ మ్యాచ్ కి కూడా ఐసీసీ ఆండీ పైక్రాప్ట్ నే రిఫరీగా ఎంపిక చేయడం విశేషం. ఒమన్ తో మ్యాచ్ లో ఇద్దరూ భారత కీలక ఆటగాళ్లకు విశ్రాంతిని ఇచ్చింది భారత్. వీరిద్దరూ పాకిస్తాన్ తో జరిగే మ్యాచ్ కి అందుబాటులోకి రావడం ఖాయంగా కనిపిస్తోంది. ఫీల్డింగ్ చేస్తూ.. తలకు దెబ్బ తగిలిన అక్షర్ పటేల్ ఆడుతాడా..? లేదా అనేది మాత్రం టాస్ సమయం వరకు అయితే క్లారిటీ రానుంది. ప్రస్తుతం మాత్రం రకరకాలుగా వార్తలు వినిపిస్తున్నాయి. అక్షర్ పటేల్ కూడా పాకిస్తాన్ తో అందుబాటులో ఉండనున్నట్టు ఫీల్డింగ్ కోచ్ తెలిపినట్టు సమాచారం.