BigTV English
Advertisement

SmartPhone Comparison: ఒప్పో F31 ప్రో ప్లస్ vs నథింగ్ ఫోన్ 3ఏ ప్రో.. ఏది కొనుగోలు చేయాలి?

SmartPhone Comparison: ఒప్పో F31 ప్రో ప్లస్ vs నథింగ్ ఫోన్ 3ఏ ప్రో.. ఏది కొనుగోలు చేయాలి?

Oppo F31 Pro Plus vs Nothing Phone 3a Pro| రూ.30,000 బడ్జెట్‌లో మంచి ఫీచర్ల ఉన్న స్మార్ట్‌ఫోన్ కావాలంటే, ఒప్పో F31 ప్రో ప్లస్ 5జి మరియు నథింగ్ ఫోన్ 3ఏ ప్రో 5జి రెండూ మంచి ఎంపికలు. ఒప్పో తాజాగా F సిరీస్ మోడల్స్‌ను లాంచ్ చేసింది. వాటిలో టాప్ మోడల్ F31 ప్రో ప్లస్ 5జి.


ఈ మిడ్ రేంజ్ మోడల్ ఫోన్.. డ్యూరబిలిటీ, పెర్ఫార్మెన్స్, కెమెరా ఫీచర్లకు ఫేమస్. అయితే, ఇది మార్కెట్‌లోని మిడ్-రేంజ్ ఫోన్లతో పోటీ పడుతోంది, ముఖ్యంగా నథింగ్ ఫోన్ 3ఏ ప్రో ఒప్పో F31 ప్రో ప్లస్ కు గట్టి పోటీనిస్తోంది. ఈ రెండు ఫోన్లో ఏది కొనుగోలు చేయాలో నిర్ణయించుకునేందుకు వీటి ఫీచర్లు పోల్చి చూద్దాం.

ధర (ఇండియాలో)


ఒప్పో F31 ప్రో ప్లస్.. 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజ్ వేరియంట్‌ ప్రారంభ ధర రూ.32,999. 12జిబి ర్యామ్ + 256జిబి వేరియంట్‌ ధర రూ.34,999. ఇది మిడ్-రేంజ్‌లో కొంచెం ఎక్కువ ధర కానీ, ఫీచర్లు అద్భుతం. మరోవైపు, నథింగ్ ఫోన్ 3ఏ ప్రో 5జి 8జిబి + 128జిబి వేరియంట్‌కు రూ.27,999, 12జిబి + 256జిబి వేరియంట్‌కు రూ.31,999.

ఇది బడ్జెట్-ఫ్రెండ్లీగా ఉంది. ముఖ్యంగా బేసిక్ వేరియంట్. రెండూ ఆన్‌లైన్ స్టోర్లలో అందుబాటులో ఉన్నాయి. ఈ కామర్స్ ప్లాట్ ఫామ్స్‌లో మరిన్ని డిస్కౌంట్లతో కొనుగోలు చేయవచ్చు.

డిజైన్, డిస్‌ప్లే
ఒప్పో F31 ప్రో ప్లస్ సింపుల్ డిజైన్‌తో వస్తుంది. ఈ డిజైన్‌లో టెక్స్చర్డ్ రియర్ ప్యానెల్, సర్క్యులర్ కెమెరా మాడ్యూల్, ఏరోస్పేస్-గ్రేడ్ అల్యూమినియం ఫ్రేమ్ ఉన్నాయి. డ్యూరబిలిటీకి IP66, IP68, IP69 వాటర్ ప్రొటెక్షన్ రేటింగ్స్, MIL-STD-810H సర్టిఫికేషన్ ఉన్నాయి. అంటే నీరు, దుమ్ము, షాక్‌లకు తట్టుకునే బలమైన డిజైన్ తో రూపొందింది. డిస్‌ప్లే 6.79-అంగుళాల FHD+ AMOLED, 120Hz రిఫ్రెష్ రేట్‌తో మృదువైన, బ్రైట్ స్క్రీన్.

నథింగ్ ఫోన్ 3ఏ ప్రో సిగ్నేచర్ ట్రాన్స్‌పరెంట్ డిజైన్‌తో ప్లాస్టిక్, గ్లాస్ బిల్డ్. డ్యూరబిలిటీకి IP64 రేటింగ్ మాత్రమే, అంటే సాధారణ నీరు, దుమ్ము నుండి రక్షణ. డిస్‌ప్లే 6.77-అంగుళాల FHD+ ఫ్లెక్సిబుల్ AMOLED, 120Hz రిఫ్రెష్ రేట్‌తో 3000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్. ఇది బయట ఎండలో కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఒప్పో డ్యూరబుల్, నథింగ్ స్టైలిష్.

కెమెరా
ఒప్పోలో డ్యూయల్ రియర్ కెమెరా: 50MP మెయిన్ + 2MP మోనోక్రోమ్. సెల్ఫీలకు 32MP ఫ్రంట్ కెమెరా. డైలీ ఫొటోలు తీయడానికి అద్భుతంగా పనిచేస్తుంది. కానీ జూమ్ లేదు. నథింగ్‌లో ట్రిపుల్ సెటప్: 50MP మెయిన్, 50MP పెరిస్కోప్ టెలిఫోటో (3x ఆప్టికల్ జూమ్), 8MP అల్ట్రా‌వైడ్. ఫ్రంట్ 50MP. ఇది జూమ్, వైడ్ యాంగిల్ ఫొటోలకు బెటర్, ప్రొ-లెవల్ షూటింగ్ అందిస్తుంది.

పెర్ఫార్మెన్స్, బ్యాటరీ
ఒప్పోలో స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 ప్రాసెసర్, 12జిబి ర్యామ్, 256జిబి స్టోరేజ్. గేమింగ్, మల్టీటాస్కింగ్ సులభం. బ్యాటరీ 7,000mAh, 80W సూపర్‌వూక్ ఫాస్ట్ ఛార్జింగ్‌తో 2 రోజులు సరిపడా ఉపయోగం. నథింగ్‌లో స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 3, అదే ర్యామ్-స్టోరేజ్. పెర్ఫామెన్స్ మంచిదే, కానీ ఒప్పో కంటే కొంచెం తక్కువ. బ్యాటరీ 5,000mAh, 50W ఫాస్ట్ ఛార్జింగ్‌తో రోజంతా పని చేస్తుంది. కానీ ఒప్పోలా లాంగ్-లాస్టింగ్ కాదు.

రూ.30,000 బడ్జెట్‌లో ఒప్పో F31 ప్రో ప్లస్ డ్యూరబిలిటీ, బిగ్ బ్యాటరీ కోసం బెస్ట్. నథింగ్ ఫోన్ 3ఏ ప్రో కెమెరా, డిజైన్, తక్కువ ధర కోసం మంచి ఆప్షన్. మీ అవసరాల ప్రకారం ఎంచుకోండి – రగ్డ్ ఫోన్ కావాలంటే ఒప్పో, స్టైల్‌ష్ కెమెరా కావాలంటే నథింగ్!

Also Read: అమెజాన్, ఫ్లిప్ కార్ట్‌, స్విగ్గీలో ఎక్కువ డిస్కౌంట్ కావాలా? ఈ క్రెడిట్ కార్డ్స్‌ ఉంటే సరి

Related News

iQOO 13 Review: ఐక్యూ 13 టెక్ మార్కెట్‌లోకి ఎంట్రీ.. ఒక్క ఫోన్‌తో మొత్తం ట్రెండ్ మార్చేసింది

Samsung Galaxy S25 Ultra: టెక్ ప్రపంచాన్ని షేక్ చేసే మోడల్.. శామ్‌సంగ్ గెలాక్సీ ఎస్25 అల్ట్రా కొత్త ఫీచర్లు లీక్

Amazon Bumper offer: మ్యూజిక్ లవర్స్‌కు అమెజాన్ అదిరిపోయే ఆఫర్.. ఇదే సరైన సమయం

Oppo 5G: 210ఎంపి కెమెరాతో ఒప్పో గ్రాండ్ ఎంట్రీ.. 7700mAh బ్యాటరీతో మాస్టర్‌ బ్లాస్టర్ ఫోన్

Redmi Note 15: రూ.12,000లకే ఫ్లాగ్‌షిప్ లుక్‌.. రెడ్మీ నోట్ 15 ఫోన్‌ సూపర్ ఫీచర్లు తెలుసా..

Fastest Electric Bikes: ప్రపంచంలోనే ఫాస్టెస్ట్ ఎలక్ట్రిక్ బైక్‌లు, ఒక్కోదాని స్పీడ్ ఎంతో తెలుసా?

Vivo 78 Launch: వివో 78 కొత్త లుక్‌.. ఫోటో లవర్స్‌, గేమర్స్‌కి డ్రీమ్ ఫోన్‌..

Kodak HD Ready LED TV: రూ. 16 వేల కొడాక్ టీవీ జస్ట్ రూ. 8 వేలకే, ఫ్లిప్ కార్ట్ అదిరిపోయే డిస్కౌంట్!

Big Stories

×