E-Paper
Advertisement

Navagrahas: నవగ్రహాల భార్యలు ఎవరో తెలుసా..?

Navagrahas: నవగ్రహాల భార్యలు ఎవరో తెలుసా..?

Navagrahas: నవ గ్రహాల భార్యలు ఎవరో తెలుసా..? ఏ గ్రహానికి ఎంత మంది భార్యలు ఉన్నారు..? వారి భార్యలను కూడా కొంత మంది గుడి కట్టి పూజిస్తుంటారని ఎంత మందికి తెలుసు..?

హిందూ పురాణాల ప్రకారం నవగ్రహాలకు ఎంతో శక్తి ఉంటుంది.. ఒక మనిషి పుట్టిన దగ్గరి నుంచి చనిపోయి మళ్లీ పుట్టడానికి మధ్యలో జరిగే ప్రతి కర్మకు ప్రతి చర్యకు నవగ్రహాలే కారణంగా చెప్తుంటారు. నవగ్రహాలు అంటే భక్తులు కూడా భయపడుతుంటారు. ఏ చిన్న తప్పు చేసినా కఠినంగా శిక్షిస్తారని నమ్ముతుంటారు. అందులో శనిదేవుడి గురించి అయితే కొత్తగా చెప్పాల్సిన అవసరమే లేదు… అలాంటి నవగ్రహాల భార్యల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

సూర్యుడు: సూర్యుడికి ఇద్దరు భార్యలు అందులో మొదటి భార్య సంజ్ఞ (Sanjna) రెండవ భార్య పేరు చాయా (Chhaya) అయితే మొదటి సూర్యుడిని చేసుకున్న సంజ్ఞాదేవి ఆయన వేడిని తేజస్సును భరించలేక భయపడిపోయిందట. అందుకే తన నీడ అయిన చాయకు ప్రాణం పోసి సూర్యుడికి ఇచ్చి పెళ్లి చేసి తాను తపస్సు చేసుకోవడానికి వెళ్లిపోయిందట. అయితే సూర్యుడికి చాయా దేవికి పుట్టిన కుమారుడే శనిదేవుడు.

చంద్రుడు: చంద్రుడికి మొత్తం 27 మంది భార్యలు అందులో మొదటి భార్య రోహిణి. ఈ రోహిణి దక్ష మహారాజు కూతురు అయితే ఆయనకు పుట్టిన మిగతా 26 మంది కూతుర్లను కూడా చంద్రుడే పెళ్లి చేసుకున్నాడు. వీళ్లు మనం జ్యోతిష్యశాస్త్రంలో చూసే 27 నక్షత్రాలు అని ఒక వాదన ఉంది. అయితే చంద్రుడు మాత్రం రోహిణిని మాత్రమే ఎక్కువ ప్రేమగా చూసుకునే వాడట. దీంతో దక్షరాజు చంద్రుడిని శపిస్తే.. చంద్రుడు శివుడి దగ్గరకు వెళ్లి శాపం తగ్గించుకున్నాడట.

కుజుడు / మంగళుడు: నవగ్రహాల్లో మూడో వాడైన కుజుడి భార్య శక్తిదేవి. కుజుడిని భూమాత పుత్రుడిగా భావిస్తారు. అందుకే ధైర్యం, యుద్ధశక్తి, శౌర్యానికి ప్రతీక కుజుడిని భావిస్తారు.

బుధుడు: నవగ్రహాలలో నాలుగవ వాడైన బుధుడి భార్య ఇలా..? ఈమె ఒక రాజకుమార్తెగా ప్రసిద్ది చెందింది. బుధుడు చంద్రుడు, తారాదేవికి జన్మించాడు.

గురుడు: నవగ్రహాల్లో నాలుగవ వాడైన గురుడి భార్య పేరు తారాదేవి. తారా ఒకసారి చంద్రుడితో కలిసి వెళ్లిపోయిందట. తర్వాత తిరిగి వచ్చాక బుధుడు జన్మించాడని చెప్తుంటారు.

శుక్రుడు: రాక్షస జాతికి గురువు ఈ శుక్రాచార్యుడు ఈయన భార్య పేరు ఊర్వశి అని కొన్ని చోట్ల.. జయంతి కొన్ని పురాణాల్లో ఉన్నట్టు పండితులు సూచిస్తున్నారు. శుక్రుడి దగ్గర సంజీవిని విద్య ఉండేదట. దీంతో చనిపోయిన రాక్షసులను మళ్లీ బతికించేవాడట శుక్రుడు.

శనిదేవుడు: సూర్యుడికి చాయా దేవికి జన్మించాడు శనిదేవుడు. ఈయన భార్య పేరు నీలాదేవి అని కొన్ని పురాణాల్లో మాండా దేవి అని కొన్ని పురాణాల్లో  ఉన్నట్టు పండితులు చెప్తుంటారు.

రాహు: రాహువు రాక్షసుడు.. సముద్ర మథనం సమయంలో అమృతం తాగడంతో విష్ణువు అతని తలను కోశాడు. తల భాగం రాహు అయ్యిందట. రాహు భార్య పేరు సింహిక..

కేతు: సముద్ర మథనంలో అమృతం తాగినప్పుడు విష్ణువు రాహు తల మొండాన్ని వేరు చేస్తాడు. అప్పుడు తల భాగం రాహు అయితే మొండెం భాగం కేతు అయిందట. కేతు భార్య చిత్రగుప్తుని కుమార్తె చిత్రలేఖ అని చెప్తుంటారు.

ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ALSO READ: ఆ దిక్కు వీధిపోటున్న ఇంట్లో ఉంటే అష్టైశ్వర్యాలు కలిసి వస్తాయట

 

Related News

రథాన్ని విరగ్గొట్టిన లక్ష్మీదేవి! పూరీ జగన్నాథ క్షేత్రంలో.. నేటికీ జరిగే అద్భుతమైన ఆచారం

చార్ ధామ్ యాత్ర.. ఎటు చూసినా భక్తులు, 8 కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్

ఆ దేవుడికి చేతులు కాళ్ళు ఎందుకు ఉండవు ?..అసలు రహస్యం ఇదే

Black Thread: ఈ రాశుల వారు కాలికి నల్ల దారం కట్టుకుంటే శని చెడు ప్రభావం తగ్గుతుంది

Anger: కోపాన్ని తగ్గించే రత్నం.. సోమవారంనాడు ధరిస్తే మీ జీవితమే మారిపోతుంది

ప్రసాదంగా లడ్డూ కాదు.. సాక్షాత్తూ ‘డబ్బులే’ ఇస్తారు! ఈ వింత ఆలయం గురించి మీకు తెలుసా?

రావి చెట్టు ఇంట్లో ఉండకూడదని ఎందుకు అంటారు? అసలు నిజం తెలిస్తే షాక్ అవుతారు

Vastu tips: ఇలాంటి సీలింగ్ ఫ్యాన్ ఇంట్లోకి పేదరికాన్ని తెస్తుంది.. ఈ 5 తప్పులు చేయకండి

Big Stories

×