E-Paper
Advertisement

Tamarind vastu tips: చింతపండుతో ఇలా ఇంట్లో చేశారంటే నెగిటివ్ ఎనర్జీ పోయి ధన ప్రవాహం పెరుగుతుంది

Tamarind vastu tips:  చింతపండుతో ఇలా ఇంట్లో చేశారంటే నెగిటివ్ ఎనర్జీ పోయి ధన ప్రవాహం పెరుగుతుంది
Advertisement

ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉండాలన్నా, చేతుల్లో డబ్బు నిలవాలన్నా ఇంట్లో సానుకూల శక్తి అధింగా ఉండాలి. అయితే కొన్నిసార్లు కారణం లేకుండానే ఇంట్లో ఒత్తిడి, పనుల్లో ఆటంకాలు, ఆర్థిక సమస్యలు ఎదురవుతుంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో చాలామంది తెగ బాధపడతారు. ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పెరిగినప్పుడు ఇలా జరుగుతుంది. చిన్న చిన్న వాస్తు చిట్కాలను పాటిస్తే ఆ నెగిటివ్ ఎనర్జీని తొలగించుకోవచ్చు. సాధారణంగా వంటల్లో ఉపయోగించే చింతపండు వాస్తు పరంగా కొన్ని సమస్యలను తగ్గిస్తుంది. అందుకే ఇంటి ఎనర్జీని శుభ్రం చేసేందుకు కొన్ని సులభమైన సంప్రదాయ పద్ధతులు ఉన్నాయి.

చింతపండు నీరుతో..
ఈ వాస్తు చిట్కాను పాటించడం చాలా సులభం. కొంత చింతపండును తీసుకుని ఒక గిన్నెలో రాత్రంతా నీటిలో నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం ఆ నీటిని ఇంటి ప్రధాన ద్వారం దగ్గర నుంచి ప్రారంభించి ఇంటి మూలల వరకు స్వల్పంగా చల్లాలి. ఈ విధంగా చేయడం వల్ల ఇంటి వాతావరణంలో ఉన్న నెగటివ్ ఎనర్జీ తగ్గి పాజిటివ్ ఫీలింగ్ పెరుగుతుందని విశ్వాసం ఉంది. చాలామందికి ఇలా చేసిన తర్వాత ఇంట్లో తేలికగా అనిపించిందని, పనులు చక్కగా జరుగుతున్నాయన భావన కలుగుతుంది.

Advertisement

చింత చెట్టు కొమ్మతో
కొంతమంది బాగా సంపాదించినా చేతిలో డబ్బు నిలవడం లేదని బాధపడుతుంటారు. దీనికి వాస్తు శాస్త్రం మంచి పరిహారం ఉంది. గురువారం లేదా శుక్రవారం రోజు చింత చెట్టు నుంచి చిన్న కొమ్మ తీసుకురావాలి. దాన్ని శుభ్రంగా తుడిచిన తర్వాత డబ్బు పెట్టే అల్మరాలో ఉంచాలి. జ్యోతిష విశ్వాసాల ప్రకారం చింతపండు కొన్ని గ్రహ ప్రభావాలను సమతుల్యం చేస్తుందని, ఈ ఉపాయం వల్ల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని చెబుతారు. అలాగే ఆదాయం వచ్చినా వెంటనే ఖర్చైపోయే పరిస్థితి తగ్గుతుందని నమ్మకం.

చింతగింజలతో
ఇంట్లో తరచుగా గొడవలు, ఒత్తిడి వాతావరణం ఉంటే మరో చిన్న చిట్కా పాటించవచ్చు. కొన్ని చింతపండు గింజలను ఎర్రటి వస్త్రంలో కట్టి ఇంటి ఒక మూలలో ఉంచాలని సూచిస్తారు. ఇది వాస్తు దోషాలను తగ్గించి కుటుంబ సభ్యుల మధ్య అనుబంధాన్ని పెంచుతుందనే నమ్మకం ఉంది. ఇలాంటి చిన్న చిన్న వాస్తు చిట్కాలు ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని బయటికి పంపిస్తాయి. మనసుకు ధైర్యాన్ని ఇస్తాయి. ఏదో ఒక మంచి పని చేశామనే భావన వల్ల మన ఆలోచనలు కూడా పాజిటివ్‌గా మారే అవకాశం ఉంటుంది.

Advertisement

మన దేశంలో శతాబ్దాలుగా ప్రకృతి ఆధారిత పద్ధతులు, ఇంటి చిట్కాలు, ఆధ్యాత్మిక సంప్రదాయాలు కొనసాగుతున్నాయి. ప్రతి వస్తువుకూ ఒక ప్రత్యేక శక్తి ఉందనే నమ్మకం చాలామందిలో ఉంటుంది. అందుకే ఉప్పు, నిమ్మకాయ, కర్పూరం, తులసి వంటి వాటితో పాటు చింతపండును కూడా కొన్ని ఉపాయాల్లో ఉపయోగిస్తారు. ఇవి కేవలం ఆధ్యాత్మిక లేదా సాంప్రదాయ విశ్వాసాలే అయినప్పటికీ, మనసుకు ధైర్యం, ఆశ కలిగించడంలో ముఖ్యపాత్ర పోషిస్తాయి. ఈ చింతపండు వాస్తు టిప్స్ అన్నీ శాస్త్రీయంగా నిరూపణ అయినవి కాదు. ఇవి సంప్రదాయ విశ్వాసాల ఆధారంగా చెబుతారు. కాబట్టి వాటిని పూర్తిగా నమ్మాలా వద్దా అనేది వ్యక్తిగత నిర్ణయం.

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×