E-Paper
Advertisement

Kavitha vs BRS: కడిగిన ముత్యమైన కవిత.. బీఆర్ఎస్‌కు బురద.. కారు పని ఖేల్ ఖతమేనా?

Kavitha vs BRS: కడిగిన ముత్యమైన కవిత.. బీఆర్ఎస్‌కు బురద.. కారు పని ఖేల్ ఖతమేనా?
Advertisement

Kavitha vs BRS: దిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో జాగృతి అధ్యక్షురాలు కవితకు క్లీన్ చిట్ రావడం తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలకు కారణమైంది. త్వరలో కొత్త రాజకీయ పార్టీ పెట్టబోతున్న కవితకు.. ఈ తీర్పు ఆయుధంగా మారింది. లిక్కర్ కేసులో గతంలో జైలుకు వెళ్లిన కవిత.. కడిగిన ముత్యంలా బయటకు వస్తానని శపథం చేశారు. ఈ క్రమంలోనే దిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు.. దిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సహా కవితకు క్లీన్ చిట్ ఇవ్వడంతో ఆమెకు రాజకీయంగా బలమైన అస్త్రం దొరికినట్లైంది. ఈ పరిణామల వల్ల కవితకు కలిగే లాభం, బీఆర్ఎస్ కు జరిగే నష్టం గురించి ఇప్పుడు పరిశీలిద్దాం.

టార్గెట్ బీఆర్ఎస్..

దిల్లీ లిక్కర్ కేసులో తనకు క్లీన్ చిట్ వచ్చిన వెంటనే కవిత మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ ను టార్గెట్ చేశారు. ముఖ్యంగా సోదరుడు కేటీఆర్ పై విమర్శనాస్త్రాలు సంధించారు. గత ఎన్నికల్లో పార్టీ ఓటమికి తనను బాధ్యురాలిని చేశారని.. మీ నాయకత్వ అహంకారం వల్లే బీఆర్ఎస్ ఓడిపోయిందని ఆమె విమర్శించారు.

క్లీన్ చిట్.. కారుకు డ్యామేజ్

Advertisement

గత అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నిక్లలో బీఆర్ఎస్ ఓటమికి దిల్లీ లిక్కర్ స్కామ్ కారణమని కేటీఆర్ పేర్కొనగా.. కవిత దానిని తిరస్కరించారు. ఉద్యోగాల కల్పనలో వైఫల్యం, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల హామీ నెరవేర్చకపోవడం వంటి పాలనాపరమైన లోపాలే ఓటమికి కారణమని తేల్చేశారు. ఈ వ్యాఖ్యలకు పార్టీ ఇమేజ్ మరింత దెబ్బ తీసే అవకాశం ఏర్పడింది. దిల్లీ కేసులో బాధితురాలిగా ఉన్న కవిత.. బీజేపీని వదిలేసి నేరుగా బీఆర్ఎస్ ను టార్గెట్ చేస్తుండటం ఆ పార్టీ నేతల్లో కలవరానికి కారణమవుతున్నట్లు రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి.

బీఆర్ఎస్ శ్రేణుల్లో కవితపై సానుభూతి!

తాను జైల్లో ఉన్న సమయంలో పార్టీ తనను సరిగ్గా ఆదుకోలేదని కవిత చెప్పారు. సోషల్ మీడియాలోనూ మద్దతు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలతో బీఆర్ఎస్ శ్రేణులు సైతం ఆలోచనలో పడ్డట్లు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. పార్టీలో నెం.4గా ఉండి, స్వయంగా కేసీఆర్ కూతురు అయిన కవితకే.. ఇలాంటి పరిస్థితి ఎదురైతే తమ పరిస్థితి ఏంటన్న ప్రశ్నలు అటు నేతల్లో మెుదలైనట్లు సమాచారం. ఇప్పటికే కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు వైఖరిపై అసంతృప్తితో ఉన్న నేతల్లో కవితపై మరింత సానుభూతి పెరిగినట్లు రాజకీయంగా చర్చ జరుగుతోంది.

Advertisement

Also Read: Telangana Politics: తెలంగాణ రాజకీయాల్లో సంచలనం.. చట్టసభల్లో ఆ కీలక మావోయిస్టులకు సీట్లు..?

బీఆర్ఎస్ ఓటర్లలో చీలికలు!

క్లీన్ చిట్ కారణంగా కవిత త్వరలో ప్రకటించే కొత్త పార్టీకి మంచి బూస్టప్ లభించినట్లైందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. తనను బాధితురాలిగా కవిత చిత్రీకరించుకునే అవకాశముందని అభిప్రాయపడుతున్నారు. దీని బీఆర్ఎస్ ఓటు బ్యాంకును చీల్చే అవకాశముందని పేర్కొంటున్నారు. కాగా ఇప్పటికే తెలంగాణ జాగృతి సంస్థ ద్వారా ఆమెకున్న క్యాడర్ ఇప్పటికే బీఆర్ఎస్ ను వీడారు. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో మరింత మంది ఆ పార్టీని వీడితో.. కారు విజయవకాశాలు దెబ్బతిని వచ్చే ఎన్నికల్లోనూ ఆ పార్టీ ఖేల్ ఖతం కావొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Also Read: Viral Video: విషమని చెత్తలో పారేసిన.. స్వీట్స్ కోసం ఎగబడ్డ జనం.. ఇలా ఉన్నారేంట్రా!

Related News

వరంగల్ ఎయిర్‌పోర్టు గురించి శుభవార్త.. నిధులపై మంత్రి ప్రకటన, టెండర్లు ఆహ్వానంతో

హైదరాబాద్ సిటీలో వాహనదారులకు బిగ్ అలర్ట్.. రెండు రోజులు ట్రాఫిక్ ఆంక్షలు, ఆయా ప్రాంతాల్లో

సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. డివైడర్‌ను ఢీకొట్టిన కారు.. ముగ్గురు మృతి

ఈసారి దక్షిణాది వంతు.. అల్పపీడనం సంకేతాలు, వారం పాటు వర్షాలు కుమ్ముడే కుమ్ముడు

Contract Teachers: ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్.. రూ.21.99 కోట్ల నిధులు విడుదల!

Voter Revision: హైదరాబాద్‌లో ఓట్ల తొలగింపు కుట్ర?.. విజిలెన్స్ డేగ కన్ను..!

Banjara Ekta: బంజారా ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ నెల 27న ఢిల్లీలో భారీ బహిరంగ సభ!

కానిస్టేబుల్ పై ఫోక్సో కేసు నమోదు.. ఎక్కడంటే..?

Big Stories

Advertisement
×