BigTV English

Vastu Dolls : ఇంటి అదృష్టాన్ని మార్చే బొమ్మలు

Vastu Dolls  : ఇంటి అదృష్టాన్ని మార్చే బొమ్మలు

Vastu Dolls : ఇంటికి అదృష్టాన్ని తెచ్చే పెట్టే జంతువుల్లో కొన్ని ప్రత్యేకమైనవి. ఏనుగు, ఆవు బొమ్మలు ఇంట్లో పెట్టుకుంటే ఆ ఇల్లు సౌభాగ్య లక్ష్మితో కళకళలాడుతుంది. ఇంటికి ఐశ్వర్యలక్ష్మిని తెచ్చే వీటిని గృహంలో పెట్టుకునేటప్పుడు కొన్ని నియమాలు, పద్దతులు పాటించాల్సి ఉంటుంది. ఐశ్వర్య లక్ష్మి ప్రతీక ఏనుగు. అలాంటి జంతువు బొమ్మను ఇంటి ఎంట్రన్స్ గుమ్మానికి కుడి, ఎడమ వైపు పెట్టుకోవాలి. అయితే వాటి చూపు మాత్రం మెయిన్ ఎంట్రన్స్ వైపు పడకుండా ఏర్పాటు చేసుకోవాలి. తొండం పైకెత్తి నిలబడ్డ ఏనుగు బొమ్మల్ని మాత్రమే పెట్టుకోవాలి. అలా ఉంటే అదృష్టలక్ష్మిని ఆహ్వానిస్తున్నట్టు అవుతుంది.


ఏనుగుతోపాటు ఇంట్లో ఆవు బొమ్మలు ఉన్నా మంచిదే. హిందూమతంలో గోవుకి ఎంతో ప్రత్యేకమైన స్థానం ఉంది. ఆవు పాలతోనే పూజ చేసే ఆచారం తరతరాలుగా కొనసాగిస్తూనే ఉన్నారు. గతంలో ప్రతీ ఇంటిలోను పశుసంపద ఉండేది. ఉదయం లేవగానే గోమాతకి నమస్కారం చేసి పనులు ఆరంభించే వారు. ఇప్పుడు ఇళ్ల్లలో ఆవులు పెంచుకునే పరిస్థితి లేదు . అందుకే ఇప్పుడు ఆవు బొమ్మల్ని ఇంట్లో పెట్టుకోమని సూచిస్తున్నారు. ఇంట్లో ఉత్తర దిక్కుగా ఆవు బొమ్మను పెట్టుకోవడం గృహానికి శుభదాయకం.

ఆవు దక్షిణ దిక్కును చూస్తూ ఉత్తర దిక్కున ఉండేలా ఇంట్లో, కానీ పనిచేసే చోట కానీ ఏర్పాటు చేసుకోవచ్చు. ఆవు దూడతో కలిసి డబ్బులున్న స్థానంలో కూర్చునే పొజిషన్ ఉన్నలో బొమ్మను మాత్రమే ఎంచుకోవాలి. ఏనుగు, ఆవుబొమ్మల్ని తెచ్చుకునే టప్పుడు ఈ జాగ్రత్తలు పాటించాలి.


Related News

Sri Padmavathi Ammavari Temple: శ్రీ పద్మావతి అమ్మవారి పవిత్రోత్సవాలు.. రూ.750 చెల్లిస్తే ఆ సేవలు

Lord Vinayaka – Moon: చంద్రుడు నవ్వినందుకే చవితి శాపమా? అసలు శాస్త్రీయ కారణం ఇదే!

Ganesh Chaturthi 2025: వినాయకుడిని ఇంటికి తీసుకొచ్చే.. ముందు వీటిని అస్సలు ఇంట్లో ఉంచొద్దు

Diwal 2025 Telugu Calendar: తెలుగు క్యాలెండర్ ప్రకారం దీపావళి ఎప్పుడో తెలుసా.. కరెక్ట్ డేట్ ఇదే

Ganesh Chaturthi 2025: వినాయకుడిని 21 పత్రాలతోనే.. ఎందుకు పూజించాలి ?

Mangalwar Ke Upay: చెడు దృష్టి పోవాలంటే.. మంగళవారం ఈ పరిహారాలు చేయండి చాలు !

Big Stories

×