E-Paper
Advertisement

Gangajal: ఇంట్లో గంగాజలం ఉందా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి.. దారిద్య్రం తప్పదు!

Gangajal: ఇంట్లో గంగాజలం ఉందా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి.. దారిద్య్రం తప్పదు!
Advertisement

Gangajal: గంగానది కేవలం నది మాత్రమే కాదు. భారతీయుల పాలిట ఒక ఆరాధ్య దైవం. గంగాజలాన్ని ఇంట్లో ఉంచుకోవడం వల్ల ప్రతికూల శక్తులు నశించి, సానుకూల వాతావరణం ఏర్పడుతుందని మన నమ్మకం. అయితే.. అంత పవిత్రమైన గంగాజలాన్ని ఎక్కడ పడితే అక్కడ ఉంచడం లేదా అపవిత్రంగా తాకడం వంటివి చేస్తే సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. గంగాజలం తన పవిత్రతను కోల్పోకుండా.. మీ కుటుంబానికి శ్రేయస్సు కలిగించాలంటే ఆ జలాన్ని భద్రపరిచే విషయంలో ఏయే పొరపాట్లు చేయకూడదో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

ఇంట్లో గంగాజలం.. పాటించాల్సిన నియమాలు:

Advertisement

గంగాజలం స్వచ్ఛతకు.. మోక్షానికి ప్రతీక. దీనిని ఇంట్లో సరైన పద్ధతిలో ఉంచినప్పుడు మాత్రమే ఆ పుణ్యఫలం దక్కుతుంది. గంగాజలం నిల్వ విషయంలో చేసే సాధారణ పొరపాట్లు ఇక్కడ ఉన్నాయి.

1. ప్లాస్టిక్ పాత్రల వాడకం:
చాలామంది గంగా తీర్థం తీసుకువచ్చినప్పుడు లేదా కొన్నప్పుడు అది ప్లాస్టిక్ బాటిళ్లలోనే వస్తుంది. కానీ.. గంగాజలాన్ని ఎప్పుడూ ప్లాస్టిక్ పాత్రల్లో నిల్వ చేయకూడదు. ప్లాస్టిక్ అనేది అపవిత్రమైనదిగా చెబుతారు. దీనికి బదులుగా రాగి, వెండి, కాంస్య లేదా గాజు పాత్రలలో గంగాజలాన్ని భద్రపరచడం శ్రేయస్కరం. రాగి పాత్రలో ఉంచడం వల్ల ఆ జలం మరింత శక్తివంతంగా మారుతుంది.

Advertisement

2. చీకటి , మురికి ప్రదేశాలు:
గంగాజలాన్ని స్టోర్ రూమ్‌లలో లేదా అల్మారాల మూలల్లో, చీకటిగా ఉండే ప్రదేశాల్లో ఉంచకూడదు. దీని వల్ల ఇంట్లో దోషాలు ఏర్పడతాయి. గంగాజలాన్ని ఎప్పుడూ గాలి, వెలుతురు సోకే పూజ గదిలో లేదా ఈశాన్య మూలలో ఎత్తైన పీఠంపై ఉంచాలి.

3. అపవిత్రమైన చేతులతో తాకడం:
గంగాజలం పవిత్రమైనది. కాబట్టి స్నానం చేయకుండా లేదా మాంసాహారం తిన్న తర్వాత, మహిళలు పీరియడ్స్ సమయంలో ఉన్నప్పుడు గంగాజలాన్ని తాకకూడదు. దీనివల్ల ఆ జలం తన శక్తిని కోల్పోవడమే కాకుండా.. ఇంట్లో అశాంతికి కారణమవుతుంది.

4. గది శుభ్రత లేకపోవడం:
గంగాజలం ఉన్న గదిని ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. ముఖ్యంగా జలం ఉన్న పాత్ర చుట్టూ బూజు పట్టడం లేదా దుమ్ము చేరడం వంటివి జరగకూడదు.బెడ్ రూం లేదా వంటగదిలో గంగాజలాన్ని ఉంచడం వాస్తు ప్రకారం నిషిద్ధం. కేవలం పూజకు కేటాయించిన పవిత్ర స్థలంలోనే దీనిని ఉంచాలి.

5. మాంసాహారం, మద్యం:

ఇంట్లో గంగాజలం ఉన్నప్పుడు ఆ ఇంట్లో సాత్విక వాతావరణం ఉండాలి. గంగాజలం ఉన్న గదిలో లేదా దానికి సమీపంలో మాంసాహారం వండటం, మద్యం తీసుకోవడం వంటివి అస్సలు చేయకూడదు. ఇది తీవ్రమైన దోషంగా చెబుతారు.

Also Read: ఇంట్లో ఏనుగు విగ్రహం పెడితే.. నిజంగానే జీవితాలు మారిపోతాయా ?

6. మూత లేకుండా ఉంచడం:
గంగాజలం ఉన్న పాత్రకు ఎప్పుడూ మూత ఉండాలి. గాలిలో ఉండే ధూళి ఆ పవిత్ర జలంలో పడకుండా చూసుకోవాలి. అలాగే.. అప్పుడప్పుడు ఆ పాత్రను మారుస్తూ ఉండాలి లేదా శుభ్రం చేస్తూ ఉండాలి.

గంగాజలం వల్ల కలిగే ప్రయోజనాలు:

ప్రతికూల శక్తి దూరం: ఇంట్లో గంగాజలాన్ని ప్రతిరోజూ చల్లడం వల్ల నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుంది.

వాస్తు దోష నివారణ: ఇంటి ప్రధాన ద్వారం వద్ద గంగాజలం చల్లితే వాస్తు దోషాలు తొలగిపోతాయి.

ప్రశాంతత: మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు గంగాజలం స్మరిస్తే మనశ్శాంతి లభిస్తుంది.

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×