Shani Vakri 2025: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొత్త సంవత్సరంలో శని కుంభరాశిని విడిచిపెట్టి మీన రాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ ఏడాది శని మొత్తం 138 రోజుల పాటు తిరోగమన దిశలో సంచరిస్తాడు. జూలై 13 నుండి నవంబర్ 28 వరకు శనితిరోగమన స్థితిలో ఉంటాడు.
శని కుంభరాశిని విడిచిపెట్టి మీన రాశిలోకి ప్రవేశిస్తాడు. అలాగే ఈ ఏడాది శని 138 రోజుల పాటు రివర్స్‌లో కదలబోతున్నాడు. జూలై 13 నుండి నవంబర్ 28 వరకు శని తిరోగమన స్థితిలో ఉంటాడు.ఫలితంగా 12 రాశులపై శని సంచార ప్రభావం ఉంటుంది. ముఖ్యంగా 3 రాశుల వారు ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ వ్యక్తులు ఆర్థిక నష్టాలను ఎదుర్కోవడమే కాకుండా అనేక ఇతర సమస్యలలో చిక్కుకోవలసి వస్తుంది. మరి శని తిరోగమన సంచారం ఏ రాశుల వారికి సమస్యలను కలిగిస్తుందనే విషయాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
వృషభ రాశి:
వృషభ రాశి వ్యక్తులు శని తిరోగమన స్థితి వల్ల ఎక్కువగా ప్రభావితమవుతారు. మీరు వ్యాపారంలో భారీ నష్టాలను ఎదుర్కోవలసి ఉంటుంది. ఆర్థిక పరిస్థితి బలహీనంగా ఉంటే, కుటుంబంలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. మీ ఆరోగ్యం గురించి కూడా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే పని, డబ్బు పరంగా నష్టాలు ఎదుర్కోవలసి ఉంటుంది
మిథున రాశి:
మిథున రాశి వారు శని తిరోగమనం వల్ల డబ్బుకు కొరత ఏర్పడుతుంది. ఒకదాని తర్వాత ఒకటి నిరంతర నష్టాల కారణంగా, ఆర్థిక పరిస్థితి క్షీణించి, మానసిక ఒత్తిడికి దారి తీస్తుంది. మీరు మీ తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి కూడా ఆందోళన చెందుతారు. వైవాహిక జీవితంలో విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. భూముల క్రయవిక్రయాల్లో నష్టం వాటిల్లే అవకాశాలు కూడా ఉన్నాయి.
Also Read: బుధాదిత్య రాజయోగం.. జవవరి 4 నుండి వీరికి ఊహించని ధనలాభం
సింహ రాశి :
సింహ రాశి వారికి శని యొక్క తిరోగమన కదలిక హానికరం. ఈ వ్యక్తులు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవలసి ఉంటుంది. ఆస్తికి సంబంధించిన వివాదాల్లో కూడా వైఫల్యం ఉంటుంది. ఇప్పుడు మీ ఉద్యోగాన్ని మార్చాలని నిర్ణయించుకోకండి. మంచి అవకాశం కోసం ఎదురుచూడండి. ఆర్థిక పరంగా నష్టాలు ఎదుర్కోవసి వస్తుంది. అంతే కాకుండా పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.