Shukra Gochar 2025: వేద జ్యోతిష్య శాస్త్రంలో శుక్రుడిని అందం, ప్రేమ, సంపద, కళ, వైవాహిక ఆనందం, భౌతిక శ్రేయస్సుకు కారకంగా పరిగణిస్తారు. ఒక వ్యక్తి జాతకంలో శుక్రుడు బలంగా ఉన్నప్పుడు.. మాత్రమే అతడి జీవితంలో డబ్బుకు లోటు ఉండదు. అంతే కాకుండా కుటుంబ సంబంధాలు కూడా మధురంగా మారతాయి.
జీవితంలో సుఖాలు, విలాసాలు పెరుగుతాయి. కానీ శుక్రుడు అశుభ స్థానంలో ఉంటే.. మాత్రం ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవడమే కాకుండా.. ప్రేమ జీవితం, వివాహం, వ్యక్తిగత సంబంధాలలో కూడా సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది.
దాదాపు ఒక సంవత్సరం తర్వాత శుక్రుడు తన సొంత రాశి అయిన వృషభ రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. జూన్ 29 2025న, శుక్రుడు మేషరాశి నుండి బయలుదేరి వృషభరాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ మార్పు 12 రాశులపైనా ఏదో ఒక విధంగా ప్రభావం చూపినప్పటికీ.. శుక్రుడి ఈ సంచారం వల్ల ప్రత్యేకంగా ప్రయోజనం పొందే 5 రాశులు ఉన్నాయి. ఆ రాశులేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
వృషభ రాశి:
శుక్రుడి సంచారం మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. అంతే కాకుండా ఆర్థికంగా మీరు గతంలో కంటే ఎక్కువ సంతోషంగా ఉంటారు. వ్యాపారంలో అనేక కొత్త అవకాశాలు కనిపిస్తాయి. పెట్టుబడి పెట్టిన డబ్బు నుండి మంచి లాభాలు పొందే సంకేతాలు ఉన్నాయి. ఇల్లు, కుటుంబంలో సౌకర్యాలు పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. జీవిత భాగస్వామితో సంబంధం మరింత మధురంగా మారుతుంది. మీరు ఆస్తి కొనాలని లేదా ఏదైనా పెద్ద ఆర్థిక నిర్ణయం తీసుకోవాలని ఆలోచిస్తుంటే.. మాత్రం ఈ సమయం ఖచ్చితంగా మీకు అనుకూలంగా ఉంటుంది. మొత్తంమీద.. మీ జీవితంలో భౌతిక , మానసిక శాంతి రెండూ మీకు సంతోషాన్ని కలిగిస్తాయి.
మిథున రాశి:
శుక్ర సంచారం మిథున రాశి వారికి అనేక ప్రయోజనాలను అందిస్తుంది. అంతే కాకుండా ఇది అదృష్టం, పురోగతికి కొత్త ద్వారాలను తెరుస్తుంది. ఆర్థికంగా నష్టపోయిన వారు ఈ సమయంలో లాభం పొందడానికి అనేక అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా వ్యాపారంలో నిమగ్నమైన వ్యక్తులు కొత్త ఒప్పందాలు , పెట్టుబడుల నుండి మంచి లాభాలను పొందుతారు. కుటుంబ జీవితంలో కూడా ఆహ్లాదకరమైన మార్పులు కనిపిస్తాయి. మీ జీవిత భాగస్వామితో మీ సంబంధం మరింత బలపడుతుంది. పాత గొడవలు క్రమంగా తొలగిపోతాయి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఈ సమయం చాలా మంచిది.
తులా రాశి:
తులా రాశి వివాహితులకు వారి జీవిత భాగస్వామి నుండి మద్దతు లభిస్తుంది. అంతే కాకుండా పరస్పర అవగాహన కూడా పెరుగుతుంది. ప్రేమ జీవితంలో ఉత్సాహం , కొత్తదనం ఉంటుంది. భాగస్వామితో కలిసి చిరస్మరణీయమైన యాత్రకు కూడా వెళ్లే అవకాశాలు ఉన్నాయి. ఆర్థికంగా, ఈ సంచారం ఆస్తి లేదా కుటుంబ మద్దతు నుండి ఆకస్మిక లాభాలను తెస్తుంది. ఈ సమయంలో మీ ఆకర్షణ, విశ్వాసం కూడా గరిష్ట స్థాయిలో ఉంటాయి. ఇది సమాజంలో, సంబంధాలలో మీ ఇమేజ్‌ను మరింత బలోపేతం చేస్తుంది. అవివాహితులు మంచి సంబంధాల కోసం ప్రతిపాదనలు పొందవచ్చు.
Also Read: శుక్రాదిత్య యోగం.. వీరు పట్టిందల్లా బంగారం
మకర రాశి:
మకర రాశి వారికి.. శుక్రుడి సంచారం ఆనందం, శ్రేయస్సును అందిస్తుంది. చాలా కాలంగా ఆర్థిక ఒత్తిడి లేదా కుటుంబ ఒత్తిడిని ఎదుర్కొంటున్న వారికి ఇప్పుడు ఉపశమనం లభిస్తుంది. వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి. అంతే కాకుండా ఉద్యోగం కోసం చూస్తున్న వారికి కొత్త అవకాశాలు లభిస్తాయి. మీ తల్లిదండ్రులు లేదా సీనియర్ నుండి ఆకస్మిక ధన లాభాలు పొందే అవకాశం ఉంది. ఇది మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తుంది. అంతే కాకుండా మీ వైవాహిక జీవితంలో మాధుర్యం పెరుగుతుంది. ఇంట్లో వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. మీరు జీవితంలోని చిన్న చిన్న ఆనందాలను అనుభవిస్తారు. మీ ఆత్మవిశ్వాసం కూడా ఈ సమయంలో రెట్టింపు అవుతుంది.