Overweight IPL Players: సోషల్ మీడియా కొత్త పుంతలు తొక్కుతుంది. రోజులు మారినా కొద్దీ…. టెక్నాలజీ వేగంగా మారిపోతుంది. ముఖ్యంగా ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను విపరీతంగా వాడుతున్నారు జనాలు. ఉన్న వాటిని లేనట్టు… లేని వాటిని ఉన్నట్టు.. చూపించి జనాలను పిచ్చోళ్ళను చేస్తున్నారు. అయితే తాజాగా… ఐపీఎల్ 2025 టోర్నమెంట్ లో బిజీగా ఉన్న టీమిండియా అలాగే ఇతర దేశ క్రికెటర్ల పై… ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను వాడి కొంతమంది వీడియోలు వైరల్ చేస్తున్నారు. ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ( Rohit Sharma), విరాట్ కోహ్లీ ( Virta Kohli), మహేంద్ర సింగ్ ధోని లాంటి ప్లేయర్లపై ఈ ఏఐ టెక్నాలజీ వాడి… వాళ్ల రూపాన్ని మార్చేసి వైరల్ చేస్తున్నారు.
Also Read: SRH Playoff: కావ్య పాప మాస్టర్ ప్లాన్…. ఇదే జరిగితే నేరుగా ప్లే ఆఫ్స్ కు SRH
క్రికెటర్లపై ఏఐ టెక్నాలజీ
ఏఐ టెక్నాలజీ వచ్చిన తర్వాత… క్రికెట్ ప్లేయర్లపై దారుణంగా ట్రోలింగ్ జరుగుతుంది. బక్కగా ఉన్న ప్లేయర్లను లావుగా చూపిస్తూ… తలకాయ చిన్నగా ఉంటే పెద్దగా చేసి చూపించడం మనం చూసాం. అయితే తాజాగా… టీమిండియా కు సంబంధించిన స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, మహేంద్ర సింగ్ ధోని, రోహిత్ శర్మ, బుమ్రా లాంటి ప్లేయర్లను ఏఐ టెక్నాలజీ వాడి గున్న ఏనుగుల్లా తయారు చేశారు. విరాట్ కోహ్లీ చాలా స్లిమ్ గా అలాగే ఫిట్నెస్ గా ఉంటాడు. అలాంటి విరాట్ కోహ్లీని… టాలీవుడ్ లో విలన్ తరహాలో… భారీ కాయం ఉన్నట్లు అతని వీడియోను క్రియేట్ చేశారు.
అటు రోహిత్ శర్మ పొట్టపై ఇప్పటికే ట్రోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో అతన్ని… రెజ్లింగ్ లో బిగ్ షో తరహాలో చేసేసారు. అలాగే మహేంద్ర సింగ్ ధోనీని… ముసలిగున్న ఏనుగు తరహాలు తయారు చేశారు. రేసుగుర్రం లాగా బౌలింగ్ చేసే బుమ్రా ను అత్యంత దారుణంగా క్రియేట్ చేసి.. రచ్చ చేస్తున్నారు. ఇక కేకేఆర్ డేంజర్ ఆటగాడు సునీల్ నరైన్ ను మరింత దారుణంగా తయారు చేశారు. సునీల్ పుత్తి కడుపు కనిపించేలా.. భారీ ఊబకాయం ఉన్న వ్యక్తుల తయారు చేశారు.
హార్దిక్ పాండ్యా ను కాస్త పోలార్డు లాగా తయారు చేశారు. ఇక రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు సామ్సన్ ను ఓ బుడ్డ పోరడి తరహాలో అతన్ని తయారు చేశారు. అలాగే రియాన్ పరాగ్ ను దారుణంగా తయారు చేశారు. ఇక కాటేరమ్మ కొడుకు క్లాసెన్ ను బట్ట తల ఉన్న ప్లేయర్ లాగా తయారు చేశారు. అటు రిషబ్ పంత్ ను కూడా గున్న ఏనుగు తరహాలో తయారుచేసి.. వైరల్ చేస్తున్నారు. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Also Read: SRH VS GT Match: IPL 2025 నుంచి SRH ఎలిమినేట్.. ముంబై ఇండియన్స్ ప్లేయర్‌పై రేప్ కేసు
?igsh=bGVub2t2Mnlpczhz