Sun Transit 2025: జ్యోతిష్య శాస్త్రంలో సూర్యుడిని గ్రహాలకు రాజుగా పరిగణిస్తారు . సూర్యుడు ఆత్మ, గౌరవం, స్థానం, అధికారం, నాయకత్వ సామర్థ్యం, పాలన, ఉన్నత స్థానానికి కారకంగా చెబుతారు. అంతే కాకుండా సింహరాశిని పాలించే గ్రహం కూడా సూర్యుడు.
సూర్యుడు ఒక రాశిలో సుమారు 30 రోజుల పాటు ఉంటాడు. సూర్యుడు రాశి మార్చినప్పుడల్లా ఆ ప్రభావం మొత్తం 12 రాశుల మీద ఉంటుంది. ప్రజల జీవితాలపై సూర్యుడి ప్రభావం ఉంటుంది. సూర్యుడు తన రాశిని మార్చినప్పుడల్లా కొంతమందికి ప్రత్యేక ప్రయోజనాలు లభిస్తాయని చెబుతారు. ప్రస్తుతం సూర్యుడు ఉత్తరాషాడ నక్షత్రంలో ఉన్నాడు.
24 జనవరి 2025న శ్రావణ నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. శ్రావణ నక్షత్రంలో సూర్యుని రాకతో ముఖ్యంగా మూడు రాశుల వారికి అదృష్టాలు పెరుగుతాయి. అంతే కాకుండా వ్యాపారంలో ధనలాభం కూడా ఉంటుంది. మరి సూర్యుడి రాశి మార్పు ఏ ఏ రాశుల వారికి ప్రయోజనాలను కలిగిస్తుందనే విషయాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
వృషభ రాశి:
వృషభ రాశి వారు సూర్యుని రాశిలో మార్పు నుండి ప్రయోజనాలను పొందుతారు. మీపై సూర్యుడి శుభ ప్రభావం వల్ల చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తి అవుతాయి. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి శుభవార్తలు అందే అవకాశం ఉంది. మీ జీతంలో పెరుగుదల ఉండవచ్చు. సూర్యుని రాశిలో మార్పు మీ వైవాహిక జీవితంలో సంతోషాన్ని కలిగిస్తుంది. అంతే కాకుండా మీ జీవిత భాగస్వామితో జరుగుతున్న సమస్యలన్నీ ముగుస్తాయి.
కర్కాటక రాశి:
సూర్యుని రాశిలో మార్పు కర్కాటక రాశి వారి జీవితంలో అనేక మార్పులను తీసుకురాబోతోంది. కుటుంబంతో కలిసి విహారయాత్రకు వెళ్లే అవకాశం ఉంటుంది. కొత్త ఇల్లు లేదా వాహనం కొనుగోలు చేయాలనే వ్యాపారవేత్తల కల నెరవేరుతుంది. మీరు ఎవరికైనా వాగ్దానం చేసి ఉంటే దానిని సులభంగా నెరవేర్చగలరు. కుటుంబంలో కూడా సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. చిన్న పిల్లలతో కొంత సమయం సరదాగా గడుపుతారు. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. పెండింగ్ పనులు కుటుంబ సభ్యుల సహాయంతో పూర్తి చేస్తారు. విద్యార్థులకు ఇది మంచి సమయం. ఆర్థిక పరంగా మీకు ఏ లోటూ ఉండదు.
Also Read: వసంత పంచమి తేదీ.. శుభ సమయం, పూజా విధానం
ధనస్సు రాశి:
ధనస్సు రాశి వారికి ఈ సమయం శుభప్రదం కానుంది. పాఠశాల లేదా కళాశాలలో పనిచేసే వ్యక్తులు కొంత గౌరవాన్ని పొందుతారు. సూర్యుని యొక్క శుభ ప్రభావం కారణంగా పెండింగ్‌లో ఉన్న ఏదైనా పని పూర్తి అవుతుంది. మీరు వ్యాపారంలో ఆశించిన లాభాలను పొందుతారు. వైవాహిక జీవిత బాగుంటుంది. మీ పాత బంధువులను కలిసే అవకాశాలు ఉన్నాయి. కొత్త, వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. పాత పెట్టుబడులు లాభాలు కలిగిస్తాయి.