BigTV English

Apple 2025 Gadgets : 2025లో యాపిల్ జాతరే జాతర.. ఏకంగా 20 గ్యాడ్జెట్స్ లాంఛ్

Apple 2025 Gadgets : 2025లో యాపిల్ జాతరే జాతర.. ఏకంగా 20 గ్యాడ్జెట్స్ లాంఛ్

Apple 2025 Gadgets : ఎప్పటికప్పుడు లేటెస్ట్ గ్యాడ్జెట్స్ ను లాంఛ్ చేస్తున్న టెక్ దిగ్గజం యాపిల్.. ఈ ఏడాది తన స్మార్ట్ ప్రియులకు మరింత జోష్ ఇవ్వనుంది. ప్రతి ఏడాది ఎన్నో లేటెస్ట్ అప్డేట్స్ తో కొత్త సిరీస్ ను లాంఛ్ చేస్తున్న యాపిల్ ఈ ఏడాది ఏకంగా 20 గ్రాడ్జెట్స్ ను మార్కెట్లోకి తీసుకురాబోతుంది.


2025లో యాపిల్ ప్రియులకు పండగే పండగ. ఎందుకంటే ఈ ఏడాది ఈ సంస్థ ఎప్పుడూ లేనంతగా ఎన్నో లేటెస్ట్ గాడ్జెట్స్ ను తీసుకురావడానికి సిద్ధమైంది. ఏకంగా 20 ప్రొడక్ట్స్ ను లాంఛ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. వీటిలో యాపిల్ మాక్ బుక్, ఐఫోన్ SE4, ఐప్యాడ్ 11, ఐఫోన్ 17 సిరీస్, యాపిల్ వాచ్ అల్ట్రా, ఎయిర్ పాడ్స్, యాపిల్ టీవీ, హోమ్ ప్యాడ్ మినీ తో పాటు మరిన్ని ప్రొడక్ట్స్ ను తీసుకురాబోతుంది. ఇంకా జూన్ లో జరగబోయే వరల్డ్‌వైడ్‌ డెవలపర్స్‌ కాన్ఫరెన్స్‌లో మరిన్ని లేటెస్ట్ గ్యాడ్జెట్స్ వచ్చే ఛాన్స్ కనిపిస్తుంది. ఇక ఈ గ్యాడ్జెట్స్ లాంఛ్ తో పాటు వాటి ఫీచర్స్ పై సైతం ఓ లుక్కేేసేయండి.

M4 Macbook Air : బ్యాటరీ లైఫ్‌, కెమెరా క్వాలిటీ, ఎక్స్‌టర్నల్‌ డిస్‌ప్లే సపోర్ట్‌తో M4 Macbook Air ఈ ఏడాది మార్చిలో లాంఛ్ కాబోతుంది.


iPhone SE4 : బడ్జెట్ ఫ్రెండ్లీ ఐఫోన్ SE4 లేటెస్ట్ ఫీచర్స్ తో లాంఛ్ కాబోతుంది. 48MP కెమెరా, IOS 18తో ఈ మెుబైల్ రాబోతుంది. ఇందులో OLED ఎడ్జ్‌ టు ఎడ్జ్‌ డిస్‌ప్లే, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఫీచర్స్ సైతం ఉండబోతున్నాయి. తక్కువ ధరకే అందుబాటులో ఉండే ఛాన్స్ కనిపిస్తుంది. ఐఫోన్‌ 16Eగా రీబ్రాండ్‌ గా ఈ మెుబైల్ రాబోతుంది.

iPad 11 : లేటెస్ట్‌ ఏఐ ఫీచర్సో తో అప్‌గ్రేడెడ్‌ చిప్‌తో ఈ కొత్త ఐప్యాడ్ లాంఛ్ కాబోతుంది.

New iPad Air : M3 లేదా M4 చిప్‌తో రాబోతున్న ఈ ఐప్యాడ్స్ లో అదిరిపోయే పర్ఫార్మెన్స్‌ ఉండనుంది.

Home Pad : యాపిల్ హోమ్ ప్యాడ్ సైతం ఇదే ఏడాది లాంఛ్ కాబోతుంది.

M4 Mac Studio : M4 అల్ట్రా చిప్‌తో M4 మ్యాక్‌ స్టూడియో ఈ ఏడాది గ్రాండ్ గా లాంఛ్ కాబోతుంది.

M4 MAc Pro : జూన్ లో జరగబోయే WWDCలో ఈ గ్యాడ్జెట్ ను లాంఛ్ చేయబోతున్నారు. ఇక ఇప్పటివరకూ ఫీచర్స్ మాత్రం లాంఛ్ కాలేదు.

ALSO READ : టెల్కోలకు గుడ్‌న్యూస్‌.. రూ.లక్ష కోట్ల మాఫీ దిశగా కేంద్రం అడుగులు

iPhone 17 Series : యాపిల్ కంపెనీ ఎంతో గ్రాండ్ గా ఐఫోన్ 17 సిరీస్ ను సెప్టెంబర్ లో లాంఛ్ చేయనుంది. ఇందులో భాగంగా నాలుగు మొబైల్స్ రాబోతున్నాయి. ఐఫోన్ 17, ఐఫోన్ 17 ప్రో, ఐఫోన్ 17 ప్రో మాక్స్, ఐఫోన్ స్లిమ్ మొబైల్స్ రాబోతున్నాయి. ఇక లేటెస్ట్ ఫీచర్స్ తో పాటు అదిరిపోయే అప్ గ్రేడ్స్ తో ఈ మొబైల్స్ రాబోతున్నట్టు తెలుస్తోంది. బెస్ట్ కెమెరా ఫీచర్స్ తో పాటు మరిన్ని ఫీచర్స్ ఈ మెుబైల్స్ లో ఉండనున్నాయి.

Apple Watch Ultra 3 : బెస్ట్ హెల్త్ బెనిఫిట్స్ తో ఈ మెుబైల్స్ రాబోతున్నాయి. హైబీపీ డిటెక్షన్‌, శాటిలైజ్‌ కనెక్టివిటీతో రాబోతున్న ఈ వాచ్ ను యాపిల్ సెప్టెంబర్ లో తీసుకురాబోతుంది.

Apple Watch Series 11 : యాపిల్ ఓల్డ్ గ్యాడ్జెట్స్ తో పోలిస్తే మరిన్ని హెల్త్‌ సెన్సార్స్ తో ఈ వాచ్ రాబోతుంది.

Apple Watch SE 3 : కొత్త డిజైన్‌, మెరుగైన ఫీచర్లతో ఈ వాచ్ రాబోతుంది.

Airpods Pro 3 : బెటర్‌ నాయిస్‌ క్యాన్సిలేషన్‌, అప్‌గ్రేడెడ్‌ H3 చిప్‌, కొత్త డిజైన్‌తో ఎయిర్‌పాడ్స్‌ ప్రో 3 వెర్షన్‌ రాబోతున్నట్లు తెలుస్తుంది.

Apple Tv 4K : AI సపోర్ట్‌ ఇంటిగ్రేషన్‌తో Apple Tv 4K రాబోతుంది.

Home Pad mini 2 : కొత్త హోమ్‌పాడ్‌ మినీ 2 వైఫై చిప్‌ రాబోతుంది.

M5 ipad Pro, M5 ipadPro, M5 MacBook PRo : లేటెస్ట్ అప్ గ్రేడ్స్ తో ఈ గ్యాడ్జెట్స్ రాబోతున్నాయి.

Related News

Galaxy A55 vs Xiaomi 14 CIVI vs OnePlus Nord 5: మూడు ఫోన్లలో ఏది బెటర్.. విన్నర్ ఎవరెంటే?

iQOO Z10 Turbo+ 5G: iQOO Z10 టర్బో+ 5G లాంచ్.. ప్రీమియం ఫోన్లకు పోటీనిచ్చే మిడ్ రేంజ్ సూపర్ ఫోన్

Instagram New Feature: అయిపాయే.. ఇన్‌స్టాలో లైక్స్ చేస్తే వాళ్లు కూడా చూసేస్తారా!

Block Spam Calls: స్పామ్ కాల్స్‌తో విసిగిపోయారా? ఈ సెట్టింగ్స్‌తో ఈజీగా బ్లాక్ చేయండి

AI Bike Garuda: ముగ్గురు విద్యార్థుల సృష్టి.. దేశంలో ఫస్ట్ ఏఐ బైక్, ఖర్చు ఎంతో తెలుసా?

Samsung Galaxy Z Fold 7: శామ్‌సంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 7 రిపేర్ చేయడం చాలా కష్టం.. iFixitలో అతి తక్కువ స్కోర్

Big Stories

×