BigTV English
Advertisement

Lucky Zodiac Signs: రెండు రాజయోగాల ప్రభావం.. వీరికి అదృష్టం

Lucky Zodiac Signs: రెండు రాజయోగాల ప్రభావం.. వీరికి అదృష్టం

Lucky Zodiac Signs: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అన్ని గ్రహాలు కాలానుగుణంగా తమ రాశులను మార్చుకుంటాయి. గ్రహాల రాశి మార్పు వల్ల వివిధ రాష్ట్రాల వారికి శుభయోగాలు కలుగుతాయి. అంతే కాకుండా ఇతర గ్రహాలతో కలయికలు కూడా ఏర్పడతాయి. సెప్టెంబర్‌లో గ్రహాల సంచారం వల్ల మాలవ్య, భద్ర రాజయోగాలు ఏర్పడనున్నాయి. ఒకటి బుధుడు ఏర్పరిస్తే మరొకటి శుక్రుడు ఏర్పరచనున్నాడు. సెప్టెంబర్ 18న శుక్రుడు కన్యారాశిని వదిలి తులారాశిలోకి సంచరించనున్నాడు.


సెప్టెంబర్ 23న బుధుడు ఉదయం 9:59 గంటలకు కన్యారాశిలోకి ప్రవేశించనున్నాడు. ఈ రెండు గ్రహాల పవిత్రమైన రాజయోగాల వల్ల శుక్రుడు తన సొంత రాశి అయిన తులా రాశిలో సంచరించినప్పుడు మాలవ్య రాజయోగం ఏర్పడనుంది. బుధుడు తన సొంత రాశులు అయిన కన్యా, మిధున రాశిలో సంచరించినప్పుడు భద్ర రాజ యోగాలు ఏర్పడనున్నాయి. పంచ మహాపురుష రాజయోగాలలో ఇవి రెండు కలిసి ఉన్నాయి. మాలవ్య, భద్ర రాజయోగాల వల్ల అదృష్టం పొందే రాశులు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.

మకర రాశి :
మాలవ్య, భద్ర రాజయోగాల వల్ల మకర రాశి వారు శుభ ఫలితాలు పొందుతారు. శుక్రుడు ఈ రాశి ఐదవ ఇంటిలో సంచరించనున్నాడు. బుధుడు కూడా ఇదే రాశుల సంచరించడం వల్ల వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. వివిధ ఒప్పందాల వల్ల భారీ లాభాలు కూడా పొందుతారు. ఉద్యోగస్తులు తమ కార్యాలయాల్లో కొత్త బాధ్యతలను స్వీకరిస్తారు. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు వస్తాయి. గతంలో నిలిచిపోయిన పనులు కూడా పూర్తి చేసేందుకు అవకాశం ఉంది. వ్యాపారస్తులు ఆర్థికంగా లాభపడే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగం నిమిత్తం ప్రయాణాలు చేయవలసి వస్తుంది.కుటుంబ సభ్యుల మద్దతు కూడా లభిస్తుంది. మీరు సంతోషంగా ఉంటారు.


కర్కాటక రాశి :
ఈ రాశి వారికి మాలవ్య, భద్రరాజు యోగాల వల్ల అపారమైన ప్రయోజనాలను పొందుతారు. మీ రాశి మూడవ ఇంట్లో బుధుడు, నాలుగవ ఇంట్లో శుక్రుడు సంచరిస్తాడు. ఫలితంగా భౌతిక ఆనందం చాలా వరకు పెరుగుతుంది. అన్ని రకాల ఆనందాలను కూడా పొందుతారు. ఈ రాజయోగాల వల్ల దైర్యం, పరాక్రమాలు కూడా పెరుగుతాయి. కెరీర్ లో పురోగతిని సాధిస్తారు. ఉద్యోగస్తులకు ఉన్నత పదవులు దక్కుతాయి. వాహనం లేదా ఆస్తి కొనుగోలు చేస్తారు. తల్లితో సంబంధాలు బాగా మెరుగుపడతాయి. జీవిత భాగస్వామితో ఉన్న గొడవలు కూడా సర్దుమనుగుతాయి. కుటుంబ సభ్యుల నుంచి మీకు పూర్తిగా మద్దతు లభిస్తుంది.

Also Read: గురుడి తిరోగమనం.. వీరు అనుకున్నవన్నీ జరుగుతాయ్

మిధున రాశి:
మాలవ్య, భద్ర రాజయోగాల వల్ల మిధున రాశి వారు చాలా వరకు లాభపడతారు. ఈ రాశి వారి నాలుగవ బుధుడు, ఐదవ ఇంట్లో శుక్రుడు సంచరిస్తాడు. మీ జీవితంలో అన్ని రకాల భౌతిక ఆనందం పెరుగుతుంది. వాహనం, ఆస్తి కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. పెండింగ్ పనులను పూర్తి చేస్తారు.అనేకమార్గాల నుంచి డబ్బు చేతికి వస్తుంది. పిల్లల నుంచి శుభవార్తలు పొందుతారు. జీవిత భాగస్వామితో ప్రేమ సంబంధాలు కూడా మెరుగుపడతాయి. ప్రేమలో ఉన్న వాళ్ళు పెళ్లి పీటలు ఎక్కేందుకు అవకాశం ఉంది. మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. విహారయాత్రలకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి.

(గమనిక : ఇక్కడ ఇచ్చిన సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించినది. bigtvlive.com దీనిని ధృవీకరించదు.)

Related News

Vastu tips: మీ ఇంట్లో ప్రతిరోజూ కర్పూరం వెలిగించడం వల్ల జరిగేది ఇదే

Vastu Tips: ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఉందా ? అయితే ఈ వాస్తు టిప్స్ పాటించండి !

Money Plant: మనీ ప్లాంట్ నాటుతున్నారా ? ఈ పొరపాట్లు అస్సలు చేయొద్దు

Vastu tips: వంట గదిలో మీ చేతిలోంచి ఈ ఐదు వస్తువులు జారి పడకుండా చూసుకోండి

Karthika Masam: కార్తీక మాసంలో.. ఎలాంటి దానాలు చేస్తే మంచిదో తెలుసా ?

Karthika Masam 2025: కార్తీక మాసంలో ఉసిరి దీపం వెలిగిస్తున్నారా ? ఈ పొరపాట్లు అస్సలు చేయొద్దు

Kartika Pournami 2025: కార్తీక పౌర్ణమి రోజు.. ఎన్ని దీపాలు వెలిగించాలి ?

Karthika Masam 2025: కార్తీక మాసంలో నారికేళ దీపం వెనుక అద్భుత రహస్యాలు.. తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు..

Big Stories

×