Dilraju:సినీ రంగంలోనే కాదు ఏ రంగంలో అయినా సరే సక్సెస్ అవ్వాలి అంటే కొత్త ఆలోచనలు తప్పనిసరి. అయితే ఆ ఆలోచనలు విజయపథం వైపు వెళ్లేలా చూసుకోవాలి. ఒక్కొక్కసారి పాత ఆలోచనలను మళ్లీ రిపీట్ చేసినా అవి వర్కౌట్ అయ్యేలా ఉండాలి. సరిగ్గా ఇప్పుడు అలాంటి ఆలోచనలే చేస్తున్నారు టాలీవుడ్ బడా నిర్మాత దిల్ రాజు (Dilraju). గత కొంతకాలంగా వరుస ఫ్లాప్ లను ఎదుర్కొంటూ సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న దిల్ రాజు..ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టుగా తన ఆలోచనలను వెనక్కి తీసుకెళ్తున్నట్లు తెలుస్తోంది. మరి ఏ మేరకు ఆయన ఆలోచనలు వర్కౌట్ అవుతాయో తెలియదు కానీ.. ప్రస్తుతం ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది.
అసలు విషయంలోకి వెళ్తే.. పంపిణీదారుడిగా కెరియర్ ను ఆరంభించి.. ఆ తర్వాత నిర్మాతగా మారి ఎంతోమంది దర్శకులను ఇండస్ట్రీకి పరిచయం చేసిన ఘనత దిల్ రాజుకి సొంతం. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై కొత్త టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ మంచి మంచి కథలతో భారీ సక్సెస్ లను చవిచూసారు. ఆ సక్సెస్ తో భారీ స్థాయిలో కలెక్షన్లు వసూలు చేయడమే కాకుండా.. ఇప్పుడు చిత్రాలకు వందల కోట్లు బడ్జెట్ కేటాయించడానికి కూడా వెనుకాడడం లేదు. కానీ ఆ చిత్రాల ఫలితాలు మాత్రం దిల్ రాజుకు పూర్తిస్థాయిలో నిరాశను మిగులుస్తున్నాయి. ఈ క్రమంలోనే సీనియర్ డైరెక్టర్లను నమ్ముకోకుండా మళ్ళీ కొత్త డైరెక్టర్లను ఇండస్ట్రీకి పరిచయం చేసి సక్సెస్ కొట్టాలని చూస్తున్నారు దిల్ రాజు.
అందులో భాగంగానే వచ్చే ఏడాది ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా 7 మంది డైరెక్టర్లను తెలుగు చిత్రసీమకు పరిచయం చేయబోతున్నారట. కొత్త టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ పాత పద్ధతులను అవలంబిస్తూ ఏడు మంది డెబ్యూ డైరెక్టర్స్ తో ప్రాజెక్ట్స్ చేయబోతున్నట్లు సమాచారం. అందులో రెండు ఓటీటీ ఒరిజినల్స్ కాగా.. మరో రెండు యూఎస్ఏ బ్యాక్ డ్రాప్ అని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో దిల్ రాజు నిర్మాతగా అడుగులు వేసిన తొలి రోజుల్లో ఇలా చాలామంది దర్శకులను ఇండస్ట్రీకి పరిచయం చేసి సక్సెస్ అందుకున్నారు. అందుకే ఇప్పుడు మళ్లీ అలాంటి విజయాల కోసమే కొత్త వారితో సినిమాలు చేయబోతున్నారు కాబోలు అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ ఆలోచన దిల్ రాజుకు ఏ మేరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.
also read:Nawazuddin Siddiqui: ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా.. కానీ!
దిల్ రాజు కెరియర్ తొలినాళ్లల్లో ఇండస్ట్రీకి పరిచయం చేసిన దర్శకుల వివరాల విషయానికి వస్తే.. సుకుమార్, బోయపాటి శ్రీను, వివి వినాయక్, రవి యాదవ్, వాసు వర్మ, శ్రీరామ్ వేణు , వంశీ పైడిపల్లి, బొమ్మరిల్లు భాస్కర్, శ్రీకాంత్ అడ్డాల ఇలా వీరందరినీ కూడా దిల్ రాజు ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఇప్పుడు మరో 7 మంది కొత్త దర్శకులను ఇండస్ట్రీకి పరిచయం చేయడానికి సిద్ధమవుతున్నారు. మరి వీరు దిల్ రాజు నేతృత్వంలో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి తమ కెరీర్ కి ఎలాంటి పునాదులు వేసుకుంటారో చూడాలి.