K Ramp OTT : టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం వరుస హిట్ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు. గత ఏడాది క మూవీ బ్లాక్ బస్టర్ హిట్ సినిమాని తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పుడు రీసెంట్ ‘కే ర్యాంప్’ అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు.ఈ మూవీ దీపావళి సందర్భంగా థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా మొదటి రోజు నుంచి బాక్స్ఆఫీస్ వద్ద పాజిటివ్ టాక్ ని అందుకోవడంతో పాటుగా భారీగానే కలెక్షన్ల వర్షం కురిపించింది.. ఈ మూవీని ఓటీటీ చూసేందుకు అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.. తాజాగా ఈ సినిమా ఓటిటి డేట్ ని లాక్ చేసుకుంది. స్ట్రీమింగ్ ఎప్పుడూ? ఏ ఫ్లాట్ ఫామ్ లో అన్నది ఇప్పుడు తెలుసుకుందాం..
కిరణ్ అబ్బవరం 11వ సినిమాగా ఈ సినిమా విడుదలైంది.. ఇందులో హీరోయిన్ గా యుక్తి తరేజా నటించింది. జైన్స్ నాని దర్శకత్వం వహించాడు. రొమాంటిక్ కామెడీ జోనల్లో తెరకెక్కిన ఈ మూవీ ప్రేక్షకులను బాగా అలరించింది.. దాంతో ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకుంది.. థియేటర్లలో ఈ సినిమాని మిస్సయిన వారు ఓటీటీలో చూసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. దీన్ని ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అందులో ఈ నవంబర్ 15 నుంచి సినిమా స్ట్రీమ్ అయ్యేందుకు లాక్ అయ్యింది. అప్పటి నుంచే మూవీ ఓటీటీలోకి రాబోతుంది. డిఫరెంట్ స్టోరీగా వచ్చిన మూవీ కావడంతో అక్కడ కూడా హిట్ టాక్ ను అందుకుంటుందనే ఆయన అభిమానులు భావిస్తున్నారు. మరి ఎన్ని వ్యూస్ ను అందుకుంటుందో చూడాలి..
Also Read : శర్వానంద్ జీవితాన్ని మార్చేసిన యాక్సిండెంట్.. 8 నెలలు నరకం..
హీరో ఎప్పుడూ డిఫరెంట్ స్టోరీలతో సినిమాలు చేస్తూ వస్తున్నాడు.. కిరణ్ అబ్బవరం 11వ సినిమాగా ఈ మూవీ వచ్చింది. క మూవీతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈయన ఇందులో సరికొత్తగా కనిపించాడు. కుమార్ అనే పాత్రలో హీరో నటించారు. కుమార్ పుట్టుకతోనే సంపన్నుడు. తండ్రి కృష్ణ అతి గారబంతో సర్వం సమకూర్చుతాడు.. అయితే కుమార్ కి చదువు తప్ప అన్ని బాగానే ఉంటాయి. తెలుగులో చాలా పూర్ గా ఉంటాడు..అదే కాలేజీలో హీరోయిన్ కూడా చదువుతూ ఉంటుంది. అయితే హీరోయిన్ కి ఒక మానసిక సమస్య ఉంటుంది. ఆ సమస్య వల్ల తాను చాలా ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటుంది.. సమస్యలని హీరో తీరుస్తాడా? వీరిద్దరి మధ్య ప్రేమ ఎలా మొదలైంది అన్నది స్టోరీ.. థియేటర్లలో బాగా ఆకట్టుకున్న ఈ మూవీ ఓటీటీలో ఎలాంటి టాక్ ను అందుకుంటుందో చూడాలి.. ఇకపోతే ఈ సినిమాలోని ఓ రీమిక్స్ సాంగ్ బాగా ట్రెండ్ అవుతుంది. ఇదేమిటమ్మా మాయ అన్న సాంగ్ ప్రస్తుతం ఎక్కడ చూసినా వినిపిస్తుంది.. దాంతో ఈ సినిమాకు మంచి హైప్ క్రియేట్ అయింది. ఇక ప్రస్తుతం కిరణ్ చేస్తున్న సినిమాల విషయానికొస్తే.. ఓ రెండు ప్రాజెక్టులకు సైన్ చేసినట్లు సమాచారం..