Motorola Mobile Offer: ఫ్లిప్‌కార్ట్‌లో ఈ మధ్య స్మార్ట్‌ఫోన్లపై భారీ ఆఫర్లు కొనసాగుతున్నాయి. ప్రతీ వారం కొత్త మోడళ్లను తగ్గింపు ధరలతో అందిస్తూ కస్టమర్లను ఆకర్షిస్తోంది. ఈసారి మోటరోలా కంపెనీ నుంచి వచ్చిన కొత్త ఫోన్ మోటో జి67 పవర్ 5జి ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులోకి వచ్చింది. ఈ ఫోన్ పేరు విన్న చాలు పవర్ అనే పదం తన అర్థాన్నే చెప్పేస్తుంది. ఎందుకంటే ఇది నిజంగా బ్యాటరీ, పనితీరు, కెమెరా అన్నింటిలోనూ పవర్‌ఫుల్‌గా ఉంది.
7000mAh భారీ బ్యాటరీ
ఈ ఫోన్‌లో ఉన్న ప్రధాన ఆకర్షణ 7000mAh భారీ బ్యాటరీ. రోజంతా మొబైల్ వాడినా, వీడియోలు చూసినా, గేమ్స్ ఆడినా, నెట్ బ్రౌజింగ్ చేసినా కూడా బ్యాటరీ అయిపోతుందేమో అనే ఆందోళన ఉండదు. ఈ బ్యాటరీలో సిలికాన్ కార్బన్ టెక్నాలజీ వాడటం వల్ల దీర్ఘకాలం నడుస్తుంది, వేడి తక్కువగా ఉంటుంది. రెండు రోజులు కూడా ఈజీగా వాడొచ్చు.
పర్‌ఫార్మెన్స్ .. పవర్ ఎఫిషెన్సీ
పర్‌ఫార్మెన్స్ విషయంలో కూడా ఈ ఫోన్ తన సత్తా చాటుతోంది. ఇందులో స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 2 ప్రాసెసర్ ఉంది. ఇది 4ఎన్ఎమ్ టెక్నాలజీతో రూపొందించబడింది. అంటే పవర్ ఎఫిషెన్సీ, వేగం రెండూ అద్భుతంగా ఉంటాయి. గేమింగ్ చేసినా, మల్టీటాస్కింగ్ చేసినా ల్యాగ్ లేకుండా సాఫీగా నడుస్తుంది. 2.4GHz స్పీడ్ తో పనిచేసే ఈ చిప్‌సెట్ ఈ రేంజ్‌లో చాలా అరుదుగా దొరుకుతుంది.
32ఎంపి సెల్ఫీ కెమెరా
ఫోన్ కెమెరా సెక్షన్ గురించి చెప్పాలంటే, వెనుక భాగంలో 50ఎంపి సోని ఎల్.ఐ.టి.-600 సెన్సార్ ప్రధాన కెమెరా ఉంది. దీని సాయంతో 4కె వీడియో రికార్డింగ్ చేయొచ్చు. ఫోటోలు చాలా క్లియర్‌గా, డిటైల్డ్‌గా వస్తాయి. అదనంగా 8ఎంపి అల్ట్రా వైడ్ లెన్స్ ఉంది, అంటే ల్యాండ్‌స్కేప్ లేదా గ్రూప్ ఫోటోలు కూడా చక్కగా తీసుకోవచ్చు. ముందు భాగంలో ఉన్న 32ఎంపి సెల్ఫీ కెమెరా కూడా చాలా స్పష్టంగా ఫోటోలు తీయగలదు.
6.7 ఇంచ్ ఎల్‌సిడి స్క్రీన్
డిస్‌ప్లే పరంగా చూస్తే, ఇది పెద్ద 6.7 ఇంచ్ ఎల్‌సిడి స్క్రీన్ తో వచ్చింది. పంచ్‌హోల్ డిజైన్ ఉన్నందున స్క్రీన్ ఏరియా పెద్దగా ఉంటుంది. వీడియోలు, సినిమాలు చూడటానికి చాలా అనువుగా ఉంటుంది. రంగులు నేచురల్‌గా, కళ్లకు ఇంపుగా కనిపిస్తాయి.
డిజైన్ లెదర్ టెక్స్చర్ ఫినిష్
డిజైన్ విషయానికి వస్తే, పాంటోన్ కొత్తిమీర అనే గ్రీన్ కలర్‌లో ఇది ప్రత్యేకంగా ఆకర్షణీయంగా ఉంటుంది. అలాగే బ్లూ, పర్పుల్ కలర్ ఆప్షన్లలో కూడా లభిస్తోంది. వెనుక భాగంలో ఉన్న లెదర్ టెక్స్చర్ ఫినిష్ దీనికి ప్రీమియం లుక్ ఇస్తుంది. చేతిలో పట్టుకున్నప్పుడు స్లిప్ కాకుండా గట్టిగా గ్రీప్ ఇస్తుంది.
ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్
మెమరీ, స్టోరేజ్ పరంగా కూడా ఇది బలమైన కాంబినేషన్. 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజ్ కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్ తో వస్తుంది, అంటే యూజర్ ఇంటర్‌ఫేస్ చాలా సింపుల్‌గా, స్మూత్‌గా ఉంటుంది.
ఆరు నెలల యాక్సెసరీ వారంటీ
ఫ్లిప్‌కార్ట్ ఈ ఫోన్‌కు ఒక సంవత్సరం హ్యాండ్‌సెట్ వారంటీ, ఆరు నెలల యాక్సెసరీ వారంటీ ఇస్తోంది. అదనంగా 7 రోజుల రీప్లేస్‌మెంట్ పాలసీ కూడా ఉంది. ఈఎంఐ ఆప్షన్‌లు కూడా సులభంగా అందుబాటులో ఉన్నాయి, కాబట్టి కొనుగోలు ప్రక్రియ చాలా ఈజీ.
ఆఫర్ ధర ఎంతంటే?
ఈ ఫోన్ అసలు ధర రూ.18,999 అయినా, ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో ఆఫర్ ధర కేవలం రూ.15,999 మాత్రమే. అంతేకాదు, బ్యాంక్ ఆఫర్లు వాడితే రూ.1,000 వరకు అదనపు తగ్గింపును కూడా పొందొచ్చు. అంటే చివరికి ఈ పవర్‌ఫుల్ స్మార్ట్‌ఫోన్ ధర రూ.14,999కి వస్తుంది. ఈఎంఐ ఆఫర్ కూడా ఉంది, నెలకు రూ.710 చెల్లింపుతో రెండు సంవత్సరాల వరకు సులభంగా కొనుగోలు చేయవచ్చు. అదనంగా, మీ పాత మొబైల్‌ను ఎక్స్చేంజ్ చేస్తే రూ.15,440 వరకు తగ్గింపు కూడా వస్తుంది. మొత్తంగా చెప్పాలంటే, ఫ్లిప్‌కార్ట్ ఇప్పుడు మోటరోలా అభిమానులకు గోల్డెన్ ఛాన్స్ ఇస్తోంది. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ మధ్య స్మార్ట్‌ఫోన్ ఆఫర్లు మరింత ఆకర్షణీయంగా మారాయి. కొత్త ఫోన్ కొనాలనుకునేవాళ్లకు ఈ సమయం నిజంగా బెస్ట్ అని చెప్పాలి.