E-Paper
Advertisement

Avihitham: పితృస్వామ్య రాజ్యంలో బాధితులుగా కూతుర్లు.. ఓటీటీ స్ట్రీమింగ్ కి సిద్ధం..!

Avihitham: పితృస్వామ్య రాజ్యంలో బాధితులుగా కూతుర్లు.. ఓటీటీ స్ట్రీమింగ్ కి సిద్ధం..!
Advertisement

Avihitham: మలయాళం సినిమాలకు ఇండియన్ సినిమాల్లో ఓ సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఈ సినిమాలు మలయాళంలోనే కాదు ఇతర భాషల్లో కూడా హిట్ అవడానికి కారణం మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలను తీసుకురావడమే. అయితే అలాంటి ఒక సినిమానే ఓటీటిలోకి రాబోతుంది. అదే అవిహితం.. సెన్నా హెగ్డే డైరెక్షన్లో వచ్చిన ఈ బ్లాక్ కామెడీ మూవీ ఓ గ్రామంలో ఉండే పురుషుల చుట్టూనే కథ అంతా తిరుగుతుంది. ముఖ్యంగా పితృస్వామ్య నేపథ్యంలో మహిళలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు? అనేది ఈ సినిమాలో ప్రధానంగా చూపించారు. థియేటర్లో విడుదలైన నెల తర్వాత ఈ మూవీ నవంబర్ 14న ఓటీటీలోకి రాబోతుంది.

అవిహితం స్టోరీ..

ఈ కథ ఏంటంటే..ప్రకాశన్ ఇద్దరి మధ్య ఉన్న అక్రమ సంబంధం గురించి ఓ పుకారు క్రియేట్ చేస్తాడు.ఆ తర్వాత వారు రహస్యంగా ఎక్కడ కలుసుకుంటున్నారో తెలియడానికి వాళ్లపై నిఘా పెడతాడు. అలా ప్రకాశన్ రహస్యంగా దాక్కొని చూస్తూ ఉన్నప్పుడు అతను.. పిండి మిల్ లో పనిచేసే వినోద్ అని గుర్తిస్తాడు. కానీ ప్రకాశన్ ఆ మహిళ ముఖాన్ని సరిగ్గా చూడకపోయినప్పటికీ ఆ తర్వాత మళ్లీ ఆమె నిర్మల అని నిర్ధారించుకుంటాడు.ఆ తర్వాత స్థానిక దర్జీ అయినటువంటి వేణు దగ్గరకి వెళ్లి ఈ విషయాన్ని బయట పెడతారు. అలా రాత్రిపూట బయటకు వెళ్లిన ఆ జంటను చూడడం కోసం వీరు రహస్యంగా వెళ్తారు.అలా ఆ మహిళ ఎవరో గుర్తుపట్టి ఈ విషయాన్ని ఆ మహిళ ఇంట్లో వాళ్లకి చెప్పినప్పుడు చాలామంది అక్కడికి రావడంతో పరిస్థితి గందరగోళంగా మారుతుంది.

Advertisement

also read:Dilraju: ఓల్డ్ ఈజ్ గోల్డ్.. వెనక్కి వెళ్తున్న దిల్ రాజు.. ఈ ఆలోచన వర్కౌట్ అవుతుందా?

పితృస్వామ్య పరిపాలనలో..

ఈ చిత్రం సారాంశం ఏంటంటే.. పురుషులు.. వారి వ్యవహారాల గురించి కొన్ని గాసిప్ లతో నిండిన ఓ గ్రామంలో సమాజం మహిళల గుర్తింపులను ఎలా అసంబద్ధంగా తీర్పు ఇస్తుంది అనేది ఈ మూవీలో చూడవచ్చు. అంతేకాదు పితృస్వామ్య పరిపాలనలో కూతుర్లు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు అనే విషయాలను కూడా ఈ సినిమాలో చూపించారు. మహిళల పట్ల పురుషుల ఆలోచన ధోరణి ఎలాంటిది? అసలు కాలం మారుతున్నా.. ఎందుకు మహిళలను తక్కువగా చూస్తున్నారు? అనే కథాంశాలతో మంచి కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో అలరించడానికి సిద్ధమవుతోంది.

ఓటీటీ స్ట్రీమింగ్ కి సిద్ధం..

Advertisement

ఇక ఈ మూవీలో ఉన్ని రాజ్, వినీత్ చాక్యార్, రెంజీ కంకోల్, ధనేష్ కోలియత్, రాకేష్ ఉషార్, బృందా మీనన్, అజిత్ పున్నద్ వంటి వాళ్ళు కీలక పాత్రల్లో పోషించారు.. సెన్నా హెగ్డే ఈ సినిమాకి దర్శకత్వం వహించగా.. అంబరీష్ కలతేరా రచయితగా వ్యవహరించారు. అలా నవంబర్ 14 నుండి అవిహితం అనే మూవీ జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ మూవీ మలయాళం తో పాటు తెలుగు,తమిళ,కన్నడ, హిందీ భాషల్లో కూడా అందుబాటులోకి రానుంది. థియేటర్లలో ప్రేక్షకులను అలరించిన ఈ సినిమా ఓటీటీలో అంతకుమించి రికార్డు క్రియేట్ చేయాలని చిత్ర బృందం ఆశాభావం వ్యక్తం చేస్తోంది.

Related News

ఏం సిరీస్ రా అయ్యా… రక్తం ఏరులై పారే పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్

అమాయకపు దొంగను అడ్డం పెట్టుకుని ఇవేం పాడు పనులు… ఈ తమిళ మిస్టరీ థ్రిల్లర్ క్లైమాక్స్ హైలెట్

40 ఏళ్ల వయసులో పట్టే పిచ్చి… ఫ్యామిలీ ఫ్యామిలీకి నెంబర్ల శాపం… కట్ చేస్తే గజగజా వణికిపోయే ట్విస్ట్

సైనికుడిని సొంత ప్రభుత్వమే ఉగ్రవాదిగా ముద్రవేస్తే… మెంటల్ మాస్ యాక్షన్ థ్రిల్లర్

శబరిమల కొండల్లో కొడుకు మిస్సింగ్… ఎమోషనల్ తమిళ ఫ్యామిలీ డ్రామా

పెళ్ళయిన వ్యక్తితో ప్రేమ… ఓటీటీలోకి వచ్చేసిన ట్రయాంగిల్ రొమాంటిక్ డ్రామా

కోమాలో ఉన్న భార్యను కాపాడుకోవడానికి కిరాక్ ప్లాన్, కానీ… ఒక్కసారి చూస్తే మర్చిపోలేరు భయ్యా

ఘనంగా నెక్సా ఓటీటీ అకాడమీ అవార్డ్స్ వేడుక.. సత్తా చాటిన తెలుగు కుర్రాడు!

Big Stories

Advertisement
×