Shukra Gochar 2025: కొత్త సంవత్సరం 2025లో, అనేక గ్రహాలు ఒక రాశి నుండి మరొక రాశిలోకి ప్రవేశిస్తాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి గ్రహం యొక్క సంచారం ఒక నిర్దిష్ట వ్యవధిలో జరుగుతుంది. 2025 సంవత్సరం ప్రారంభంలో సంపద, కీర్తి, ఆనందానికి కారకుడైన శుక్రుడు మీన రాశిలో సంచరిస్తాడు. మీన రాశికి అధిపతి దేవగురువు బృహస్పతి. మీనరాశిలో శుక్రుని సంచారం అనేక రాశులకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ రాశుల వారు ఈ కాలంలో సానుకూల ఫలితాలను పొందుతారు.
దృక్ పంచాంగ్ ప్రకారం, జనవరి 28 న 2025 ఉదయం 07:12 గంటలకు శుక్రుడు మీనరాశిలోకి ప్రవేశిస్తాడు. దీని తరువాత, మే 31, 2025న శుక్రుడు మేషరాశిలోకి ప్రవేశిస్తాడు. 2025లో మేషరాశిలో శని యొక్క సడేసతి ప్రారంభమవుతుంది. ఇదిలా ఉంటే 3 రాశులపై శుక్రుడి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. మరి ఏఏ రాశులపై శుక్రుడి ప్రభావం ఎక్కువగా ఉంటుందనే విషయాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
1. వృషభ రాశి:
కొత్త సంవత్సరం ప్రారంభంలో మీనరాశిలో శుక్రుడు సంచరించడం వల్ల వృషభ రాశి వారి జీవితాల్లో సానుకూల మార్పులు వస్తాయి. శుక్ర సంచార ప్రభావం వల్ల మీ ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగాలలో ఉన్న వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. సామాజిక గౌరవం, కీర్తి ప్రతిష్టలు పొందుతారు. కొన్ని శుభవార్తలు వచ్చే అవకాశం కూడా ఉంది. వ్యాపారులకు లాభాలు చేకూరుతాయి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి మంచి ఫలితాలు ఉంటాయి. అంతే కాకుండా ఉన్నత ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి ఇది మంచి సమయం. పాత పెట్టుబడుల నుంచి మీరు లాభాలు అందుకుంటారు. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది.
2. కుంభ రాశి:
కుంభ రాశి వారికి శుక్రుడు మీన రాశిలోకి ప్రవేశించడం అద్భుత ప్రయోజనాలను కలిగిస్తుంది. ఈ సమయం మీకు అనుకూలంగా ఉంటుంది. మీరు ఊహించని ధనలాభాలు పొందుతారు. ఆనందం , సంపద పెరుగుతుంది. కుటుంబాల్లో పెరుగుదల ఉంటుంది. ప్రయాణాల వల్ల ప్రయోజనం కూడా ఉంటుంది. పెండింగ్‌లో ఉన్న డబ్బు తిరిగి రావడంతో మనసు ఆనందంగా ఉంటుంది. మీరు ఆఫీసుల్లోని పై అధికారుల నుండి మద్దతు పొందుతారు. కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి. పాత వనరుల నుండి కూడా డబ్బు వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి.
Also Read: గరుడ పురాణం ప్రకారం.. మరణానికి గంట ముందు ఈ సంకేతాలు కనిపిస్తాయ్
3. మీన రాశి:
శుక్రుని సంచారం మీన రాశి వారికి చాలా శుభ ఫలితాలను అందిస్తుంది. ప్రస్తుతం శుక్రుడు మీనరాశిలో సంచరిస్తున్నాడు. మీరు ప్రణాళిక ప్రకారం మీ పనిని కొనసాగిస్తారు. కొంతమంది అవివాహితులకు మంచి వివాహ ప్రతిపాదనలు రావచ్చు. ఆర్థికంగా లాభపడే అవకాశాలు కూడా ఉన్నాయి. మీరు పొదుపు చేయడంలో కూడా విజయం సాధిస్తారు. మీ ఆర్ధిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది. అంతే కాకుండా మీరు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. వైవాహిక జీవితం కూడా బాగుంటుంది. పెట్టుబడుల విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి. కుటుంబ సభ్యులతో ఈ సమయంలో ఆనందంగా గడుపుతారు.